స్టార్ మా అనూహ్య నిర్ణయం... సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసు కు శుభం కార్డు! కారణం?

First Published | Aug 12, 2024, 7:32 PM IST

స్టార్ మా ఛానల్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకుందట. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసు కి ఎండ్ కార్డు వేయబోతుందట. ఇది ఆ సీరియల్ అభిమానులకు పిడుగులాంటి వార్త అంటున్నారు. 
 

Guppedantha Manasu

గుప్పెడంత మనసు లో హీరో పాత్ర రిషి తిరిగి వచ్చాడు. వసుధార - రిషిలు కలిసిపోయి సంతోషంగా ఉంటున్నారు. మళ్లీ రిషిధారల  మ్యాజిక్ స్క్రీన్ పై చూస్తూ ఎంజాయ్ కావచ్చని సీరియల్ ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశలపై దర్శకుడు నీళ్లు చల్లారు. రిషి రాకతో సీరియల్ గాడిన పడింది. రేటింగ్ పరంగా కూడా పుంజుకుని సాఫీగా సాగుతుంది. 

Guppedantha Manasu

కానీ... అనూహ్యంగా గుప్పెడంత మనసు  ముగించేస్తున్నారు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ కి ఫుల్ క్రేజ్ ఉంది. రిషి - వసుధార ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అయితే మాములుగా ఉండదు. కేవలం ఈ జంట కోసం సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అంతలా రిషి - వసుధార లు ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోయారు. 


Guppedantha Manasu

మొన్నామధ్య రిషి సీరియల్ లో కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఎంత రచ్చ చేశారో తెలిసిందే. రిషి లేని వసుధార ని చూడలేము. రిషి తిరిగి వస్తాడా రాడా ..  తీసుకొస్తావా లేదా అంటూ డైరెక్టర్ ని ఏకిపారేశారు అభిమానులు. మొత్తానికి రిషి అయితే తిరిగి వచ్చాడు. వసుధార - రిషి కలిసిపోయారు. 

Guppedantha Manasu

ఇక శైలేంద్ర ఆట కట్టించడానికి కాలేజ్ లో కూడా అడుగుపెట్టేశాడు. ఇక కాలేజ్ కూడా సేఫ్ కాబట్టి ఆ ఇష్యూ క్లియర్ అయిపోయినట్లే. ఇక తన  తండ్రి ఎవరు అనేది తెలుసుకునే పనిలో మను ఉన్నాడు. అనుపమ నోరు విప్పి మహేంద్ర నీ తండ్రి అని చెప్పింది అంటే కథ క్లోజ్. 

Guppedantha Manasu

కానీ ఇప్పుడిప్పుడే రిషి - వసు కలిసి ఉండడం చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటున్నారు. రిషిధారల బంధం చూసి మురిసిపోతున్నారు. కానీ సడన్ గా సీరియల్ ముగించేస్తున్నారని తెలిసి చాలా బాధ పడుతున్నారు.  తాజా సమాచారం ప్రకారం గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ కంప్లీట్ అయిందట. మరో పది రోజుల్లో సీరియల్ కి శుభం కార్డు పడనుందట. అర్ధాంతరంగా సీరియల్ ని క్లోజ్ చేయడం ఫ్యాన్స్ తట్టుకోలేక పోతున్నారు. 

Latest Videos

click me!