Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్లోకి జబర్దస్త్ యాంకర్.. మైండ్ బ్లాక్ చేస్తున్న లేటెస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్

First Published | Aug 12, 2024, 10:59 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో జబర్దస్త్ యాంకర్ అడుగుపెడుతుందన్న వార్త  కాకరేపుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ లవర్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. లేటెస్ట్ లిస్ట్ ఏమిటో చూద్దాం.. 
 

Bigg Boss Telugu

బిగ్ బాస్ తెలుగు 8కి అంతా సిద్ధం. తాజాగా మూడో ప్రోమో కూడా విడుదల చేశారు. ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. త్వరలో అధికారికంగా డేట్ ప్రకటిస్తారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ రెండో ఆదివారం ప్రారంభం కానుందట. అంటే వచ్చే నెల 8న లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. 

Bigg boss telugu 8

ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి చేశారట. ఎంపికైన సెలెబ్రిటీలకు మెయిల్స్ పంపుతూ ఇంటర్వ్యూలు చేస్తున్నారట. పారితోషికం ఎంత అనేది ప్రధాన అంశం. ప్రక్రియ అంతా ముగిశాక కూడా రెమ్యునరేషన్ విషయంలో తేడా వస్తే ఆ సెలెబ్రిటీని పక్కన పెట్టేసే అవకాశం ఉంది. 


Bigg boss telugu 8

కాగా లేటెస్ట్ లిస్ట్ లో ఓ సంచలన సెలబ్రిటీ పేరు తెరపైకి వచ్చింది. జబర్దస్త్ మాజీ యాంకర్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడుతుందట. ఆమె ఎవరో కాదు సౌమ్య రావు. ఈ కన్నడ భామ ఏడాదికి పైగా జబర్దస్త్ లో యాంకరింగ్ చేసింది. అనసూయ జబర్దస్త్ వదిలేశాక కొన్నాళ్ళు రష్మీ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా ఉన్నారు. అనంతరం జబర్దస్త్ యాంకర్ గా సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చారు. 
 

కారణం తెలియదు కానీ కొన్నాళ్లకు సౌమ్య రావు జబర్దస్త్ నుండి తప్పుకుంది. అనంతరం సిరి హన్మంత్ రావడమైంది. సౌమ్య రావు ప్రస్తుతం కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో సందడి చేస్తుంది. ఈమె బిగ్ బాస్ షోకి ఎంపికయ్యారంటూ ప్రచారమవుతోంది. మరి సౌమ్య రావు హౌస్లోకి వస్తే తన మార్క్ గేమ్ తో అలరించడం ఖాయం. అయితే ఆమెకు భాష మైనస్. సౌమ్య రావుకు తెలుగు అంతగా రాదు. 
 

కాగా యాష్కీ గౌడ, బంచిక్ బబ్లు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, సీరియల్ నటుడు సెల్వరాజ్, హీరో ఆదిత్య ఓం, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, వేణు స్వామి, తేజస్విని గౌడ, అంజలి పవన్, జబర్దస్త్ పవిత్ర, అబ్బాస్, కిరాక్ ఆర్పీ, ఏక్ నాథ్ హారిక, ప్రేరణ బిగ్ బాస్ తెలుగు 8కి ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని ప్రచారమవుతోంది.

Latest Videos

click me!