Naga Panchami 8th January Episode: పాముగా మారి మోక్షను చుట్టేసిన పంచమి.. కాటేస్తుందా..?

First Published Jan 8, 2024, 12:32 PM IST

 నాతో ఉండేటట్లయితేనే నన్ను కాపాడు లేకుంటే వద్దు అని మోక్ష అడుగుతాడు. పంచమి సమాధానం చెప్పదు. తాను కాలాన్ని మాత్రమే నమ్ముతానని, దైవం ఏది చేయాలనుకుంటే అదే జరుగుతుంది అని పంచమి అంటుంది. 

Naga panchami

Naga Panchami 8th January Episode: పంచమి పాముగా మారిపోతుంది. అది చూసి మోక్ష కంగారుపడతాడు. ఏమైంది ఏమైంది అని అడుగుతాడు. అలా అడిగిన కాసేపటికే మామూలుగా మారుతుంది. నీలో పాము లక్షణాలు కనిపించాయి అని మోక్ష అంటే.. అవునని, పాము ఆత్మ తనలో చేరిందని పంచమి చెబుతుంది. ఫణీంద్ర నాగదేవతను ఒప్పించాడని, అందుకే తాను పాముగా మారానని పంచమి అంటుంది. మరోవైపు ఫణీంద్రతో నాగదేవత మాట్లాడుతుంది. పంచమి శక్తులు ఇఛ్చానని, పని పూర్తి చేసుకొని రమ్మని చెబుతుంది.

తనకు పాము శక్తులు వచ్చాయి కాబట్టి.. ఎలాగైనా తాను మోక్షను కాపాడగలను అని పంచమి సంతోషిస్తుంది. తాను బతికిన తర్వాత..తనను వదిలివెళ్లొద్దని మెక్ష అడుగుతాడు. ‘ నువ్వు లేకుండా ఆ ప్రాణాలు నాకు దక్కినా అవసరం లేదు’ అని మోక్ష ఎమోషనల్ గా మాట్లాడతాడు. అయితే.. తాను ఇక్కడే ఉంటే మీరు ప్రాణాలతో ఉండరని, కచ్చితంగా తాను  నాగలోకం వెళ్లాల్సిందే అని పంచమి అనుకుంటూ ఉంటుంది.

Naga panchami

కానీ మోక్షలో అనుమానం మొదలౌతుంది. నాగదేవత నీకు శక్తులు ఇచ్చింది అంటే.. నువ్వు నాగలోకానికి వెళ్లిపోతావని అనిపిస్తోంది. నాతో ఉండేటట్లయితేనే నన్ను కాపాడు లేకుంటే వద్దు అని మోక్ష అడుగుతాడు. పంచమి సమాధానం చెప్పదు. తాను కాలాన్ని మాత్రమే నమ్ముతానని, దైవం ఏది చేయాలనుకుంటే అదే జరుగుతుంది అని పంచమి అంటుంది.  ప్రస్తుతం మీ ప్రాణాలు కాపాడటమే మన ముందు ఉన్న లక్ష్యం అని, దాని కోసం దైవం మనకు సహకిరస్తోందని పంచమి అంటుంది.
 

Latest Videos


Naga panchami


ఫణీంద్ర పాముగా మారడం గురించే జ్వాల ఆలోచిస్తూ ఉంటుంది. తాను చూసిన వ్యక్తి పాము అంటే.. పంచమి కూడా పామే అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో చిత్ర వచ్చి.. జ్వాలను భయపెడుతుంది. అప్పుడే మళ్లీ మనిషి పాముగా మారడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాల్సింది అని చిత్ర.. చాలా వెటకారం చేస్తుంది. ఆ మాటలకు జ్వాలకు కాలిపోతుంది. తర్వాత.. పంచమి కూడా మనిషిలా మారే పామేనని.. అలా ఆమె మారడం తాను చూస్తే చాలు అని జ్వాల అనుకుంటూ ఉంటుంది. తనకు  ఓ ఐడియా ఉందని, దానితో తన జీవితం మార్చుకుంటాను అని జ్వాల అనుకుంటూ ఉంటుంది

Naga panchami

మరోవైపు పంచమి, మోక్షలు ఓ చోట కూర్చొని ఉంటారు.‘ శివయ్య. నా భర్త ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాను. ఏ పొరపాటు జరిగినా అది నా పాపమే అవుతుంది. ఎలాగైనా నా భర్తను నాగమనిని తెచ్చి కాపాడుకునేలా చేయి స్వామి.  నువ్వే నా భర్తను కాపాడాలి. నా భర్త కళ్లు తెరచి చూడగానే, నేను అది కళ్లారా చూసి నాగలోకానికి వెళ్లిపోతాను. లేదంటే నా భర్త పాదాల దగ్గరే తల పగలకొట్టుకొని చచ్చిపోతాను’ అని పంచమి అనుకుంటూ ఉంటుంది.

అప్పుడే మోక్ష వచ్చి.. ఏదో ఒకటి మాట్లాడు పంచమి అని అడుగుతాడు. ‘మనం ఏది మాట్లాడుకున్నా ఈ రాత్రి వరకే. నన్ను మళ్లీ కలుస్తాననే ఆశ నీలో ఉన్నా. నాకు మాత్రం ఇదే చివరి రోజు అనిపిస్తోంది. మళ్లీ నేను కళ్లు తెరుస్తాననే నమ్మకం లేదు. నా కోసం నువ్వు ఆందోళన పడకు. ఈరోజు కాకపోయినా.. వారంలో అయినా నేను చనిపోవాల్సిందే’ అని మోక్ష అంటాడు. కానీ అలా మాట్లాడొద్దని పంచమి వారిస్తుంది. కానీ.. తనకు ఇంతకు మించి వేరే మార్గం కనపడటం లేదు అని పంచమి అంటుంది. అయితే కీడు ఎంచి మేలు ఎంచాలని.. నేను బతికితే సరే.. లేకపోతే నీ పరిస్థితి ఏంటి.. పంచమి అని మోక్ష అడుగుతాడు. నేను లేకుండా నువ్వు ఇంట్లో ఉండలేవు. పాముగా మారితే.. నిన్ను నువ్వు కాపాడుకోలేవు. నీ గురించి అంతా తెలుసు కాబట్టి.. మీ అమ్మగారి దగ్గరకు వెళ్లు పంచమి. అక్కడ నాగ సాధువు ల వద్దకు వెళ్లు అని చెబుతాడు.

Naga panchami

కానీ, పంచమి మాత్రం.. తాను నాగలోకానికి వెళ్లక తప్పదని, అలా ఒప్పుకుంటేనే మోక్షను బతికించడానికి ఫణీంద్ర ఒప్పుకున్నాడని పంచమి మనసులో అనుకుంటుంది. ఆ విషయం తెలియని మోక్ష.. తాను నేను బతికుంటే.. నువ్వు నా కళ్ల ఎదుట ఉంటే చాలు ప్రేమగా చూసుకుంటాను, మనకు పిల్లలు కూడా అవసరం లేదు అని మోక్ష చెబుతూ ఉంటాడు. పంచమి మాత్రం.. మిమ్మల్ని కాపాడి.. నాగలోకానికి వెళ్లక తప్పదు అని అనుకుంటూ ఉంటుంది. మీరు బతికితే.. నేను నాగలోకానికి వెళ్లాలి. మీకు ఏదైనా అయితే.. నేను ప్రాణాలు వదిలేయాలి.. ఎలా చూసినా ఇదే మన చివరి రోజు అని పంచమి మనసులో అనుకుంటుంది. తర్వాత శివయ్యను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

Naga panchami

మరోవైపు మేఘన(కరాళి)... కాళికామాతకు పూజలు చేస్తుంది. కాళీమాత ప్రత్యక్షమౌతుంది. ఎందుకు పిలిచావ్ అని అడుగుతుంది. నాగ మణి భూలోకానికి రాబోతుందని, దాంతో తన కోరిక తీరబోతుందని కరాళి చెబుతుంది. కానీ.. ఆ నాగమణిని ఎవరూ కదిలించలేరు అని కాళీమాత చెబుతుంది. కానీ.. పంచమి తీసుకువస్తుందని, దానిని సొంతం చేసుకోవడానికి తాను ప్రయత్నిస్తున్నాను అని కరాళీ చెబుతుంది. కానీ.. ఆ నాగమణిని తట్టుకొనే శక్తిని ఇవ్వమని కాళీమాతను అడుగుతుంది. అందుకే.. కాళీమాత సరేనని చెబుతుంది.

Naga panchami


ఇక, పంచమి మోక్ష.. తాము అనుకున్న సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఫనీంద్ర వచ్చి  వాళ్లకు కనపడతాడు. నాగదేవత నీకు ఇష్ట రూప శక్తులు ప్రసాదించిందని పంచమికి ఫణీంద్ర చెబుతాడు. ఇక నుంచి.. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాముగా, మనిషిగా మారవచ్చని చెబుతాడు. కావాలంటే ప్రయత్నించమని కూడా చెబుతాడు.  ఎలా చేయాలో కూడా చెబుతాడు. పంచమి పాముగా మారడానికి భయపడుతుంటే.. ఫణీంద్ర ఏమీ కాదని ధైర్యం చెబుతాడు. మోక్ష కూడా.. పంచమికి ధైర్యం చెబుతాడు. వెనకడుగు వేయవద్దని చెబుతాడు. అంతేకాదు.. ఏ రూపంలో ఉన్నా నువ్వు నా భార్యవేనని, నన్ను కాటేసినా నేను ఎక్కడికి వెళ్లను అని మోక్ష చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Naga panchami

కమింగ్ అప్ లో పంచమి పూర్తిగా నిజమైన పాములా మారుతుంది. మోక్ష పాముని చూసి భయపడకుండా.. ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. పంచమి కూడా మెక్షను చట్టేస్తుంది.

click me!