Guppedantha Manasu 8th January Episode:వసుధార ఆచూకీ కనిపెట్టేసిన భద్ర.. రిషిని చూసేస్తాడా?

First Published Jan 8, 2024, 8:59 AM IST

కాలేజీలో సమస్య వస్తుందేమో అని.. ఎందుకైనా మంచిదని.. ఫణీంద్రకు సమాచారం అందించమని చెబుతాడు. దానికి వసు సరే అంటుంది. తర్వాత.. మహేంద్ర అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు.
 

Guppedantha Manasu

Guppedantha Manasu 8th January Episode:వసుధార.. రిషిని క్షేమంగా తన తండ్రి చక్రపాణి ఇంటికి చేర్చింది. తాను కూడా అక్కడే ఉంటూ.. క్షేమంగా రిషిని చూసుకుంటూ ఉంటుంది. మహేంద్ర కూడా వచ్చి.. తన కొడుకును చూసుకుంటాడు.  అదే సమయానికి మహేంద్రకు భద్ర నుంచి ఫోన్ వస్తుంది. సర్ మీరు ఎక్కడ ఉన్నారు అని భద్ర అడుగుతాడు. మహేంద్ర సమాధానం చెప్పేలోగా... వసుధార ఆ ఫోన్ లాగేసుకుంటుంది. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. 

Guppedantha Manasu

 ఏమైందని మహేంద్ర అడిగితే.. రిషి సర్ ఇక్కడ ఉన్నారనే విషయం  ఎవరికీ తెలియకూడదు అని చెబుతుంది, దీంతో.. మహేంద్ర సరే అంటాడు. ఆ తర్వాత భద్ర మరోసారి మహేంద్రకు ఫోన్ చేస్తాడు. అప్పుడు సిగ్నల్ లేదని.. తాను పనిమీద బయటకు వచ్చానని.. వసుధార ఏమైనా అక్కడికి వచ్చిందా అని ఏమీ తెలియనట్లు మహేంద్ర అడుగుతాడు. ఆయనకు కూడా వసు గురించి తెలీదేమో అని నమ్మిన భద్ర.. తాను వసుధార గురించి మొత్తం వెతికానని.. ఆచూకీ దొరకలేదని చెబుతాడు. దీంతో.. మహేంద్ర.. సరే.. వసు గురించి ఏమైనా తెలిస్తే.. వెంటనే నాకు చెప్పు అని అంటాడు.

Latest Videos


Guppedantha Manasu

ఆ తర్వాత మహేంద్ర రిషి దగ్గరకు వెళ్లి తాను బయలుదేరుతున్నాను అని చెబుతాడు. రిషికి చాలా జాగ్రత్తలు చెబుతాడు. తాను ఉన్నానని బాగా చూసుకుంటాను అని వసుధార చెబుతుంది, కానీ.. మహేంద్ర మాత్రం తన బాధను వివరిస్తాడు. ఈ జీవితంలో తనకు మిగిలింది కేవలం రిషి మాత్రమేనని... అతనికి ఏదైనా జరిగితే తట్టుకోలేనని అంటాడు. ఇప్పటికే జగతిని కోల్పోయి సగం చచ్చిపోయానని.. మందుకు బానిసగా మారిపోయానని, కానీ మీరే నన్ను దాని నుంచి బయటపడేశారని మహేంద్ర చెబుతాడు. చాలా  జాగ్రత్తలు చెప్పి... ఆ తర్వాత మహేంద్ర బయలుదేరతాడు. వసుధారను కూడా రమ్మని అడుగుతాడు. కానీ... ఆమె రిషి కోలుకునేవరకు రాను అని తేల్చి చెబుతుంది. కాలేజీలో సమస్య వస్తుందేమో అని.. ఎందుకైనా మంచిదని.. ఫణీంద్రకు సమాచారం అందించమని చెబుతాడు. దానికి వసు సరే అంటుంది. తర్వాత.. మహేంద్ర అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే.. కాలేజీలో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. వసుధార కాలేజీని సరిగా పట్టించుకోవడం లేదని బోర్డు సభ్యులు అంటారు. ఎప్పుడంటే అప్పుడు కాలేజీకి రాకుండా ఎక్కడెక్కడికో పోతోందని, రిషి సర్ ఉన్నప్పుడు, జగతి మేడమ్ ఉన్నప్పుడు కాలేజీ చాలా బాగుండేదని బోర్డు సభ్యులు భావిస్తారు. మళ్లీ ఇప్పుడు కూడా వసుధార కనిపించడం లేదని, ఫోన్ కూడా కలవడం లేదని... మీరు అంగీకరిస్తే.. శైలేంద్రను ఎండీ చేద్దాం అని వారంతా ఫణీంద్రను అడుగుతారు. అది విని శైలేంద్ర సంబరపడేలోగా.. ఫణీంద్ర వద్దు అంటాడు. ఈ విషయంలో వసుధార మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన అంటాడు. ఒకసారి వసుధారకు ఫోన్ చేస్తాను అంటాడు. ఫోన్ కలవడం లేదు కదా డాడ్ అని శైలేంద్ర అడ్డుపుల్ల వేయబోతాడు. కానీ.. ఫణీంద్ర ఇఫ్పుడు కలుస్తుందేమో ప్రయత్నిద్దాం అని అంటాడు.

Guppedantha Manasu

వెంటనే వసుధారకు ఫోన్ చేసి..స్పీకర్ లో పెడతాడు. అప్పుడు వసుధార.. తాను తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నానని చెబుతుంది. తన తండ్రి చక్రపాణి ఆరోగ్యం బాలేదని.. కొద్ది రోజులు రాలేను అని చెబుతుంది. ఆమె చెప్పేదంతా.. ఫణీంద్రతోపాటు... శైలేంద్ర.. ఇతర బోర్డు మెంబర్స్ కూడా వినేస్తారు. దీంతో.. ఫణీంద్ర విన్నారు కదా.. త్వరలోనే వసుధార వచ్చేస్తుంది.. ఇక్కడితో మీటింగ్ అయిపోయింది అనేస్తాడు. కానీ.. వసు చెప్పేది అబద్ధం అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. అది నిజమో కాదో తెలుసుకోవడానికి.. వసు తండ్రిని చూసి వద్దామా అని తండ్రిని అడుగుతాడు.

నిజంగా వాళ్ల నాన్న ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉందేమో.. ఒక్కసారి వెళ్లి పలకరించి వద్దాం అని అడుగుతాడు. దానికి ఫణీంద్ర అంగీకరించడు. ఏమీ అవసరం లేదు అంటాడు. దీంతో... శైలేంద్ర చాలా ఫ్రస్టేట్ అవుతాడు. వెంటనే... భద్రకు ఫోన్ చేసి వసుధార సమాచారం మొత్తం చెబుతాడు. వసు తన తండ్రి ఇంటికి వెళ్లిందని.. అక్కడ రిషి కూడా ఉన్నాడేమో అని తనకు అనుమానంగా ఉందని.. మొత్తం చూసి కనుక్కొని రమ్మని చెబుతాడు. సరే అని భద్ర... డైరెక్ట్ గా వసు ఉన్న ఇంటికి వెళతాడు.

Guppedantha Manasu

డోర్ బెల్ మోగడంతో వసుధార వచ్చి  ఓపెన్ చేస్తుంది. చూసేసరికి భద్ర కనపడతాడు. షాకౌతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావ్  అని సీరియస్ అవుతుంది. అసలు.. నేను ఇక్కడ ఉన్నాను అని నీకెలా తెలుసు అని అడుగుతుుంది. తెలుసుకున్నాను అంటాడు.  తర్వాత.. ఇంటికి వెళదాం రమ్మని వసుని భద్ర అడుగుతాడు. కానీ అందుకు వసు అంగీకరించదు. అయితే... మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ ఛేసి ఇక్కడ ఉంచారని తనకు అనుమానంగా ఉందని, లోపల ఎవరెవరు ఉన్నారో అని రిషి ఉన్నాడేమో చూడాలి అని అనుకుంటాడు. కానీ.. వసు లోపలికి రావడానికి ఒప్పుకోదు. సరిగ్గా అదే సమయంలో  లోపలి నుంచి రిషి దగ్గుతాడు

Guppedantha Manasu

అది విని.. లోపల ఎవరో ఉన్నారు నేను చూడాలి అని లోపలికి వస్తాడు. అదే సమయానికి చక్రపాణి దగ్గుకుంటూ వసమ్మా అనుకుంటూ వస్తాడు. ఇతను ఎవరు అని వసు ని అడిగితే. వాళ్ల నాన్న అని చెబుతుంది. చక్రపాణి భద్ర గురించి అడిగితే.. డ్రైవర్ అని చెబుతుంది. భద్ర మాత్రం. డ్రైవర్ కమ్ సెక్యూరిటీ అని చెబుతాడు. తర్వాత.. తనతోపాటు రమ్మని మళ్లీ అడుగుతాడు. వసు తనకు పని ఉందని రాను అని చెబుతుంది. మహేంద్ర సర్ కి ఫోన్ చేసి... నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయమని చెబుతాను అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో.. వద్దు అని చెప్పేసి భద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

తర్వాత.. వసు తాను ఇక్కడ ఉన్న విషయం భద్రకు ఎవరు చెప్పారు అని తెలుసుకోవడానికి  వెంటనే మహేంద్రకు ఫోన్ ఛేస్తుంది. అయితే.. మహేంద్ర తాను చెప్పలేదని.. వాడికి ఎలా తెలిసిందో.. తాను కనుక్కుంటాను అంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. 

click me!