Brahmamudi 8th January Episode:పుట్టింటా, అత్తింటి కావ్యకు అవమానం, అందరినీ కడిగేసిన స్వప్న..!

First Published Jan 8, 2024, 11:19 AM IST

మరోవైపు రాజ్యలక్ష్మి కూడా పుట్టింటికి రాకపోతే ఎలా అని సర్దిచెప్పబోతుంది. కానీ.. మూర్తి మాత్రం అంగీకరించడు. కనకం ప్రయత్నించాలని చూసినా మూర్తి అంగీకరించడు. కనకం ఆకాశానికి నిచ్చెనలు వేయడం వల్లే ఇదంతా జరిగిందని అంటాడు.  

Brahmamudi

Brahmamudi 8th January Episode: గత ఎపిసోడ్ లో స్వప్న.. రుద్రాణికి చుక్కలు చూపిస్తుంది. జ్యూస్ ఇవ్వమని... ఇచ్చిన తర్వాత చేతికి ఇవ్వమని.. తిప్పల మీద తిప్పలు పెడుతుంది. మరోవైపు కావ్య.. ఆఫీసుకు బ్రేక్ ఫాస్ట్ తీసుకొని వెళ్తుంది. అక్కడ రాజ్.. శ్వేతతో చనువుగా కనిపిస్తాడు. అంతకముందే లాయర్ తో రాజ్ విడాకుల గురించి మాట్లాడతాడు. అయితే.. అది నిజంగా రాజ్ తన విడాకుల గురించే మాట్లాడుతున్నాడో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. శ్వేతతో రాజ్ చనువుగా ఉండటం గురించి కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఆటోలో వెళ్తు అదే ఆలోచిస్తూ ఉంటే.. అప్పూ కూడా పరధ్యానంగా ఆటోకి అడ్డు వస్తుంది. కావ్య చూసి.. ఆటోలో తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. అక్కడ తల్లి, పెద్దమ్మతో ప్రేమగా మాట్లాడుతుంది. అప్పుడే మూర్తి కూడా అక్కడికి వస్తాడు. మరి.. నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Brahmamudi

ఇంటికి వచ్చిన కూతురితో ప్రేమగా మాట్లాడాల్సిందిపోయి.. ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు.  అది విని కావ్య షాకౌతుంది. వెంటనే కనకం.. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావ్ అని అడుగుతుంది. దానికి మూర్తి... ‘ దుగ్గిరాల కోడలు.. ఈ దిగువ మధ్యతరగతి ఇంటికి ఎందుకు వచ్చింది? అంత అవసరం ఏం వచ్చిందో తెలియడం లేదు.’ అంటాడు. వెంటనే కావ్య.. ఏమైంది నాన్న అని అడుగుతుంది. ‘మా ఇంట్లో బొమ్మలకు రంగులు వేస్తాం. ఆ రంగులు.. నీ బతుకుపై బురదలా పడుతోంది. మొన్న పెద్దదాని వల్ల, ఇప్పుడు దీని వల్ల . అవసరమా నీకు ఇదంతా..? ఆశపడి ఇది, అత్యాశపడి మీ అమ్మ. మళ్లీ మీ ఇంట్లో ఓ కుంపటి రాజేసి మరీ వచ్చారు. నిప్పుతో కడిగిన వంశం దుగ్గిరాల కుటుంబం. మళ్లీ ఈ గడపలో ఎందుకు కాలుపెట్టావమ్మా’ అని అడుగుతాడు. దానికా కావ్య.. ఇది తన పుట్టిల్లు అని.. జీవితాంతం ఈ ఇంటికి వచ్చే హక్కు తనకు ఉందని అంటుంది. కానీ, మూర్తి.. ఆ హక్కులేదంటాడు. ఆ హక్కుపోయిందని, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వేసిన రాకపోకల వారధి కూలిపోయిందని, ఆ బంగ్లాకీ, ఈ పేదంటికి ఉన్న దారి మూసిపోయిందంటాడు, పుట్టింటి నుంచి నువ్వు ఏమీ తీసుకెళ్లకపోయినా.. పుట్టింటి నుంచి పుట్టెడు దుఖం మాత్రం మోసుకెళుతున్నావ్,  ఈ ఆనవాయితీ ఇక పై కూడా కొనసాగితే, అది నీ కాపురానికి ముప్పు తెస్తుంది’ అని సర్దిచెబుతాడు. అలా ఏమీ జరగదు అని కావ్య అంటుంది.

Latest Videos


Brahmamudi

మరోవైపు రాజ్యలక్ష్మి కూడా పుట్టింటికి రాకపోతే ఎలా అని సర్దిచెప్పబోతుంది. కానీ.. మూర్తి మాత్రం అంగీకరించడు. కనకం ప్రయత్నించాలని చూసినా మూర్తి అంగీకరించడు. కనకం ఆకాశానికి నిచ్చెనలు వేయడం వల్లే ఇదంతా జరిగిందని అంటాడు.  ఇప్పటికే.. అప్పూని ఈ ఇంటి కోడలిని చేయాలని చూశారని చాలా మాటలు అన్నారని, ఇప్పుడు మళ్లీ ఈ ఇంటికి వచ్చావని తెలిస్తే , మళ్లీ ఎవేవో పథకాలు వేస్తున్నావ్ అంటారు అని అంటాడు. వాళ్లు అన్నా కూడా నిజం అనేది ఒకటి ఉంటుంది కదా నాన్న అని కావ్య అంటుంది. కానీ, మూర్తి ‘ఆ నిజం ఎవరికీ అవసరం లేదని  పెళ్లి మండపంలో అందరూ నిన్ను దోషిగా చేసినప్పుడు ఎవరికి పనికి వచ్చింది నిజం? కనీసం నిరూపించుకునే అవకాశం ఇవ్వలేదు. మీ అత్తగారు,చిన్నత్త దృష్టిలో నువ్వుదోషిగా మిగిలిపోయావ్ కదా? మళ్లీ నీకు ఆ అవసరం రాకూడదనే, నిన్ను ఈ ఇంటికి రావద్దు అంటున్నాను’ అని చెబుతాడు.

కావ్య మాత్రం.. వాళ్లు ఏదో  అన్నారని.. మిమ్మల్ని దూరం చేసుకోను అని తేల్చిచెబుతుంది. అత్తారిల్లు తనకు అర్హత అని, పుట్టిల్లు తాను పట్టిపెరిగిన ఇంటి హక్కు అని అంటుంది. వెంటనే అప్పూ.. కూడా వాళ్ల నాన్ని చెప్పిందే కరెక్ట్ అని, తమను కలవకపోవడమే మంచిది అని చెబుతుంది. వెంటనే కనకం రియాక్ట్ అవుతుంది. తప్పు ఏదైనా జరిగి ఉంటే.. అది తన వల్లే జరిగిందని,తాను ఆ ఇంటికి వెళ్లనని, కావ్యని కూడా రావద్దు అంటే జీవితాంతం ఆ ఇంట్లో జైల్లో మగ్గిపోయినట్లే మగ్గిపోవాలా అని కనకం ఇంట్లో వాళ్లను ప్రశ్నిస్తుంది. కావ్య కూడా.. తన పుట్టింటికి వస్తూనే ఉంటానని, తనను ఆపే హక్కు ఎవరికీ లేదు అని ఖరాఖండిగా చెబుతుంది. తర్వాత.. అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతుంది.

Brahmamudi

మరోవైపు కళ్యాణ్, అనామికల వ్రతం, కార్యానికి ముహూర్తం చూస్తూ ఉంటారు. పంతులుగారు కూడా అవి చూసి చెబుతారు. అప్పుడే కావ్య ఇంట్లోకి వస్తుంది. రావడం రావడమే... అపర్ణ ఫైర్ బ్రాండ్ లా మీదపడుతుంది. ఉదయం అనగా రాజ్ కి టిఫిన్ ఇస్తానని వెళ్లి.. ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది. తన పుట్టింటికి వెళ్లానని కావ్య చెబుతుంది. అంతే.. అందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేయడం మొదలుపెడతారు. ఆ ఇంటికి వెళ్లొద్దు అంటే ఎందుకు వెళ్తున్నావ్ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. ఎంత ధైర్యం ఉంటే అప్పూతో మాట్లాడతావ్ అని ధాన్యలక్ష్మి అడుతుంది. దానికి కావ్య.. అప్పూ తన చెల్లెలు అని చెబుతుంది. కానీ ధాన్యలక్ష్మి.. నీ చెల్లెలు నా కొడుకును మోసం చేయాలని చూసింది అని ఆరోపిస్తుంది. వెంటనే కళ్యాణ్.. అప్పూ తనని ఏమీ మోసం చేయలేదు అని సర్ది  చెబుతాడు. కానీ ధాన్యలక్ష్మి ఊరుకోదు. నువ్వు మనుషులు అందరూ మంచివారే అని అనుకుంటావ్ అని అంటుంది. కళ్యాణ్ వెంటనే.. అప్పూ నిజంగానే మంచిది అని చెబుతాడు, కానీ ధాన్యలక్ష్మి.,. నీ కవితలు ఉన్నంత స్వచ్ఛంగా మనుషులు ఉండరని, లోపలంతా కుళ్లు కుతంత్రాలే అంటుంది.

Brahmamudi

దానికి కావ్య.. నేనేం కుట్రలు చేశాను అని అడుగుతుంది. మరి ఆ ఇంటికి ఎందుకు వెళ్లావ్ అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఛాన్స్ దొరికిందని అపర్ణ కూడా కావ్యఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడే  ఆ విషయం  చెప్పానని, అప్పుడు.. ఎవరూ తన మాట వినలేదని , ఇప్పుడు అసలు రూపం బయటపడిందని అంటుంది. అసలు తాను  ఏం తప్పు చేశానని, అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని కావ్య అంటుంది. తన కన్నవాళ్ల ఇంటికి వెళితే తప్పేంటి అని అడుగుతుంది.

Brahmamudi

ఛాన్స్ దొరికింది కదా అని  అనామిక దూరిపోతుంది. కావ్యను అందరి ముందు బ్యాడ్ చేయాలని ఫిక్స్ అవుతుంది. ‘పెద్దవాళ్లు ఏదో ఆవేశంలో మాట్లాడతారని, దానికే నువ్వు అలా ఎదురుతిరిగి మాట్లాడతావా’ అని అంటుంది. ఆ బుద్ది తనకు ఉంటే.. నాకు ఇన్ని బాధలెందుకు అని అపర్ణ మళ్లీ రద్దాంతం చేస్తుంది. వెంటనే రుద్రాణి కూడా.. అనామిక.. గొప్ప ఇంటి నుంచి వచ్చింది కాబట్టి.. గొప్పగా ఆలోచిస్తుందని, కావ్య అలా కాదు కదా.. తన బుద్దే అలాంటిది అని  అంటుంది. ఆ మాటకు కావ్యకు బాగా కోపం వస్తుంది.  అవకాశం దొరికిందని నోరు జారితే ఊరుకోను అని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది. వెంటనే ధాన్యలక్ష్మి.. ఆ మాటనేను అడుగుతున్నాను.. ఆ ఇంటికి ఎందుకు వెళ్లావ్ అని అడుగుతుంది. 

అనుకున్నది జరగలేదు కదా, తన చెల్లెలిని ఓదార్చడానికి వెళ్లి ఉంటుంది అని రుద్రాణి అంటుంది. ముందు ప్లాన్ ప్రకారం నువ్వు ఈ ఇంటి కోడలివి అయ్యావ్, తర్వాత మీ అక్కను కోడలిని చేశావ్.. నీ చెల్లెలిని కూడా చేయాలని అనుకున్నావ్ , ముచ్చటగా ముగ్గురు ఈ దుగ్గిరాల ఇంటికి కోడళ్లు అవ్వాలని అనుకున్నారు.. కానీ అది జరగలేదని ఫీలౌతున్నారని.. వాళ్లను ఓదార్చడానికి వెళ్లావ్ కదా అని రుద్రాణి అంటుంది.  పనిలో పనిగా స్వప్నను కూడా తిడుతుంది.

Brahmamudi

తనని అన్నందుకు స్వప్న రియాక్ట్ అవుతుంది. ‘నిజం చెప్పాలంటే.. మీరు తప్పు చేశారని, ఏ తప్పు చేయని తనపై నిందలు వేశారని, గొడవలు చేసింది మీరు అని అంటుంది.  మధ్యలో రాహుల్ దూరితో.. రాహుల్ ని కూడా స్వప్న వాయిస్తుంది. అసలు మోసం చేసింది రాహుల్, రుద్రాణిలదే అని , నిజంగా తాము మోసం చేయాలి అనుకుంటే.. కళ్యాన్ పెళ్లి అనామికతో జరిగి ఉండేది కాదు అంటుంది. కళ్యాణ్.. కావ్య మాట అంటే ఎంత విలువ ఇస్తాడో మీకు అందరికీ తెలుసు. నిజంగానే మేం కళ్యాణ్ కి అనామికతో కాకుండా.. అప్పూతో పెళ్లి చేయాలి అని అనుకొని ఉంటే.. కావ్యకు ఎంత సేపు పడుతుంది..? కానీ.. కావ్య కూడా కళ్యాణ్ ఇష్టానికి ప్రేమకు అంతే విలువ ఇచ్చిందని, అందుకే.. కళ్యాణ్ ప్రేమ గెలిపించిందని, ఇంట్లో అందరినీ ఒఫ్పించి పెళ్లి వరకు తీసుకువెళ్లిందని అంటుంది. చెడగొట్టే ఉద్దేశమే ఉంటే, పెళ్లికి ముందు .. అప్పూ ప్రేమను చంపుకోమని చెప్పేది కాదని, అందరితో అప్పూ ప్రేమను నిలపెట్టేది. అసలు నాకు తెలీక అడుగుతాను... కావ్య ఈ ఇంటికి కోడలు అవ్వడానికి కారణం మీరే. నా జీవితం నాశనం చేయాలని చూసింది మీరే. సైలెంట్ గా కళ్యాణ్ పెళ్లి జరుగుతుంటే.. బయపెట్టింది మీరే. ఇందులో కావ్య చేసిన తప్పేంటి? నేను చేసిన అన్యాయం ఏంటి? ఇంకోసారి నా గురించి, నా చెల్లి గురించి ఏమైనా అంటే ఊరుకోను’ అని వార్నింగ్ ఇస్తుంది. 

Brahmamudi

స్వప్నను కావ్య కంట్రోల్ చేసి లోపలికి తీసుకువెళ్తుంది. అది కూడా రుద్రాణి తప్పుపట్టేలా చేస్తుంది. దీంతో.. ఇందిరాదేవి.. అందరికీ క్లాస్ పీకుతుంది. మీ గొడవలతో అనామిక సంతోషాన్ని చెడగొడుతున్నారు అని తిడుతుంది. అయితే.. తప్పంతా కావ్యదే అని, పుట్టింటికి ఎందుకు వెళ్లింది అని ధాన్యలక్ష్మి అంటుంది. అయితే అది కావ్య హక్కు అని, పుట్టింటికి వెళ్తుందని ఇందిరా దేవి సపోర్ట్ చేస్తుంది. ఈ ఇంట్లో కావ్య ఎలా ఉండాలో చెప్పండి కానీ, పుట్టింటి కి వెళ్లొద్దు అనే హక్కు మీకు లేదు అని కోడళ్లకు ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత.. వ్రతానికి సిద్ధం అవ్వమని చెబుతుంది.

కావ్య.. స్వప్నను లోపలికి తీసుకువచ్చి.. ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. స్వప్న ఊరుకోదు.  అణిగి మణిగి ఉంటే.. తొక్కేస్తూ ఉంటారని, మనం ఊరుకోకూడదు అని అంటుంది.పనిలో పనిగా ధాన్యలక్ష్మి పై కూడా స్వప్న విరుచుకుపడుతుంది. నీలాగా మెత్తగా ఉంటే కుదరదని, తనలాగా ఉండాలి అని చెబుతుంది. ఇప్పటి నుంచి ఇంట్లో అందరికీ సినిమా చూపిస్తానని.. వీళ్లకు తానే కరెక్ట్ అని  స్వప్న అంటుంది.

మరోవైపు రుద్రాణి... అపర్ణ, ధాన్యలక్ష్మి లకు స్వప్న, కావ్యలపై నూరిపోస్తుంది. అపర్ణ, రుద్రాణి లు తమ కోడళ్లు దారుణంగా ఉన్నారని ఫీలౌతూ ఉంటారు.. ధాన్యలక్ష్మి మాత్రం.. తన కోడలు అనామిక మాత్రం అలా కాదని, మంచిదని, తెలివైనదని అంటుంది. అయితే.. కావ్య అనామికను మార్చేస్తుంది అని వార్నింగ్ ఇస్తారు. ముగ్గురూ కలిసి.. కావ్య, స్వప్నలను ఇంట్లో నుంచి బయటకు గెంటడానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. తన కోడలి జోలికి వస్తే.. కావ్యను ఊరుకోను అని ధాన్యలక్ష్మి అంటుంది. మరోవైపు అపర్ణ కూడా.. కావ్యను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే టైమ్ దగ్గరపడిందని అంటుంది. వీళ్లిద్దరూ తన దారిలోకి రాకున్నా, కావ్యకు అడ్డు ఉన్నారు చాలు అని రుద్రాణి సంతోషిస్తుంది.

click me!