జన నాయగన్ సినిమా లీక్ వివాదంలో దళపతి విజయ్ కు సపోర్ట్ గా నిలిచారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఈసినిమాకు సబంధించిన కీలక సన్నివేశాలు లీక్ అవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత 30 ఏళ్లుగా తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు దళపతి విజయ్. ఇక సినిమాలను వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో 'జననాయగన్' తన చివరి సినిమా అని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ సినిమా మాత్రం రిలీజ్ అవ్వలేదు. సెన్సార్ సమస్య వల్ల సినిమా రిలీజ్ అగిపోయినా.. రాజకీయ కారణాలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
26
బాలకృష్ణ సినిమాకు రీమేక్..
ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. ఇది బాలకృష్ణ హీరోగా తెలుగులో హిట్టయిన 'భగవంత్ కేసరి'కి రీమేక్. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ మీనన్, మమితా బైజు, నిరళ్గల్ రవి వంటి భారీ తారాగణం ఉంది. విజయ్‌కు ఇష్టమైన అనిరుధ్ సంగీతం అందించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటించారు.
36
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ..
దళపతి విజయ్ నటించిన జన నాయగన్ సినిమా లీక్ వివాదం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో సినీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిణామంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ.. చిరు ఓ పోస్ట్ పెట్టాడు.
సోషల్ మీడియాలో చిరంజీవి ఏమన్నారంటే..? '' సినిమా నిర్మాణం అనేది నమ్మకం, సమష్టి కృషి, ఎన్నో కలల సమాహారం.. ‘జన నాయగన్’ వంటి భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సన్నివేశాలు లీక్ కావడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇలాంటి ఘటనలు ఒక సినిమాకే కాదు, మొత్తం చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపుతాయి.ఈ తరహా లీకులు సృజనాత్మకతను దెబ్బతీసే ప్రమాదం ఉంది.సినిమా కోసం కష్టపడే వందలాది మంది శ్రమ వృథా కాకుండా ఉండేందుకు పైరసీని అరికట్టాల్సిన అవసరం ఉంది'' అని చిరంజీవి అన్నారు.
56
ఇండస్ట్రీ సీరియస్ గా తీసుకోవాలి
మెగాస్టార్ ఇంకేమన్నారంటే? ''ఈ ఘటనను సినిమా ఇండస్ట్రీ అంతా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈ నష్టాన్ని తగ్గించేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు తమ పూర్తి సపోర్ట్ ఉంటుంది.సినీ పరిశ్రమలో ఉన్న ప్రతిఒక్కరూ సినిమాను గౌరవించి, పరిరక్షించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. చివరగా, “పైరసీని చంపేద్దాం.. సినిమాను బతికిద్దాం” అంటూ తన సందేశాన్ని ముగించారు.
66
వాయిదా పడుతూ..
ప్రస్తుతం ఈ లీక్ ఘటనపై సినీ వర్గాలు, అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి 'జననాయగన్' సినిమా గత ఏడాది దీపావళికే విడుదల కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ ఏడాది పొంగల్‌కి వాయిదా వేశారు. జనవరి 9న రిలీజ్ అని ప్రకటించడంతో టికెట్ బుకింగ్స్ కూడా జోరుగా సాగాయి.
అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.కానీ సెన్సార్ సమస్య వల్ల రిలీజ్ ఆగిపోయింది. ఇక ఎలక్షన్ కోడ్ వల్ల రిలీజ్ అవుతుందో లేదో అన్న అనుమానంలో మూవీ టీమ్ ఉన్నారు.