Films Clash At The Box Office : బాలయ్య అఖండ2 తో పాటు మలయాళం, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పదికి పైగా సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. ఇంతకీ ఆ సిమాలేంటంటే?
మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బాలకృష్ణ, మమ్ముట్టి, రణబీర్ కపూర్ వంటి స్టార్ల సినిమాలు ఒకే రోజున విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది.
25
బాలకృష్ణ అఖండ 2
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2' సినిమా డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలయ్య అఘోరాగా మరోసారి కనిపించనుండటంతో.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు
35
ఆసక్తి రేపుతున్న మమ్ముట్టి కళంకావల్
మమ్ముట్టి, వినాయకన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన 'కళంకావల్' చిత్రంపై మలయాళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది డిసెంబర్ 5న విడుదల కానుంది. ఏడు పదులు దాటిన వయస్సులో కూడా తగ్గేది లేదంటున్నాడు మమ్ముట్టి.
రణబీర్ కపూర్ 'ధురందర్', కార్తి 'వా వాతియార్' వంటి పెద్ద చిత్రాలు కూడా డిసెంబర్ 5న విడుదలవుతున్నాయి. ఈ సినిమాల రిలీజ్ పాన్-ఇండియా స్థాయిలో పోటీని మరింతగా పెంచబోతోంది.
55
యాక్షన్, థ్రిల్లర్, హారర్ సినిమాలు
'అఖండ 2' యాక్షన్, 'ధురందర్' స్పై థ్రిల్లర్, 'ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ 2' హారర్.. ఇలా విభిన్న జానర్ల సినిమాలు ఒకే రోజున ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంత పోటీని తట్టుకుని నిలబడే సినిమాలు ఏవి? భారీ అంచనాలు ఉన్న అఖండ 2 లాంటి సినిమాలు రిజెల్ట్ ఎలా ఉండబోతోంది అనేది చూడాలి.