
కార్తీక దీపం 2 గురువారం ఎపిసోడ్ లో శివన్నారాయణతో పాటు గుడికి వెళ్లివస్తున్న పారు.. అసలు నీకు కారు నడపడం వచ్చా కార్తీక్ అని అడుగుతుంది. నువ్వు డ్రైవర్ వేనా? కారు ఎలా నడుపుతున్నావు అంటుంది. వాడు బాగానే నడుపుతున్నాడు నువ్వు సరిగ్గా కూర్చో అంటాడు శివన్నారాయణ. కార్తీక్ ని పిలిచి.. దాసు దగ్గరికి వెళ్దాం అంటుంది పారు. అదే విషయాన్ని శివన్నారాయణతో చెప్తాడు కార్తీక్. సరే వెళ్దాములే అంటాడు శివన్నారయణ. సడెన్ గా కారు ఆపుతాడు కార్తీక్. ఎందుకు ఆపావు అంటుంది పారు. దాసు మామయ్య ముందే ఉన్నాడు అంటాడు కార్తీక్. అప్పుడే జ్యో తన తలపై దాసు చేయి పెట్టి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు నాన్న అంటూ ఒట్టువేయించుకుంటుంది. అది చూసిన శివన్నారాయణ షాక్ అవుతాడు.
మనువరాలి పని అయిపోయిందని పారు మనసులో అనుకుంటుంది. భలే దొరికావు జ్యోత్న్స అని కార్తీక్ అనుకుంటాడు. అందరూ కారు దిగి వాళ్ల దగ్గరకు వెళ్తారు. వారిని చూసిన జ్యోత్న్స షాక్ అవుతుంది. దొరికిపోయానని కంగారు పడుతుంది. నువ్వెందుకు ఇక్కడకు వచ్చావు అంటాడు శివన్నారాయణ. దాసుతో ఒట్టు వేయించుకొని మరీ ఏం అడుగుతున్నావు. అసలు నిజం ఏంటి అని అడుగుతాడు. ఏం లేదు తాత అంటుంది జ్యో. నువ్వు చెప్పు దాసు అంటాడు శివన్నారాయణ. ఇదే అదనుగా జ్యోతో కాసేపు ఆడుకుంటాడు కార్తీక్. కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది పారు. ఏం లేదు సార్.. ఏదైనా సాయం కావాలంటే నన్ను తప్పకుండా అడగమని లేకపోతే నా మీద ఒట్టేనని జ్యోత్స్న అంటోందని దాసు చెబుతాడు.
శివన్నారాయణకు దాసు మాటలు అంత నమ్మకంగా అనిపించవు. నువ్వు ఆఫీసుకు వెళ్లావనుకుంటున్నాను. ఇక వచ్చిన పని అయిపోయింది కదా వెళ్తాం పదా అంటాడు శివన్నారాయణ. వాళ్లతో కలిసి బయలుదేరుతుంది జ్యోత్స్న. నీ అదృష్టం బాగుంది జ్యోత్స్న.. కాస్తలో తప్పించుకున్నావు. కానీ ఎప్పుడూ ఇలాగే ఉండదు. ఈ నిజం త్వరలోనే బయటపడుతుంది అని.. అనుకుంటాడు దాసు.
దాసు బాబాయితో జ్యో ఏం మాట్లాడడానికి వచ్చిందని అడుగుతుంది దీప. ఇంకేముంది నిజం ఎవ్వరితో చెప్పొద్దు నాన్న అని చెప్పడానికి వచ్చింది అంటాడు కార్తీక్. అమ్మ నాన్నలను కలపాలి అనుకుంటే ఇంకేదో జరుగుతోంది అంటుంది దీప. నేను ఉన్నా కదా అన్నీ చూసుకుంటాను అంటాడు కార్తీక్. అందరి గురించి పట్టించుకుంటావు కానీ నా గురించి మాత్రం పట్టించుకోవు అంటాడు రొమాంటిక్ గా. నేను నీ పక్కనే ఉన్నాను బావ అంటుంది దీప. నా పక్కన ఉండటం వేరు. నాలో ఉండటం వేరు అంటాడు కార్తీక్. నేను నీలోనే ఉన్నా బావ అని తన దగ్గరకు జరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి నుదుటిపై మరొకరు ముద్దు పెట్టుకుంటారు.
అక్కడ జరిగిన విషయాన్ని దశరథతో చెబుతాడు శివన్నారాయణ. జ్యోత్న్స దాసును కలవాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటాడు. రేపు బోర్డు మీటింగ్ ఉంది కదా.. ఇక నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పి వెళ్లిపోతాడు. తండ్రి మాటలు విన్న దశరథ నువ్వు చెప్పింది నిజమే నాన్న. జ్యోత్స్న ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలియదు అని అనుకుంటాడు. గతంలో జ్యో.. దాసును చంపడానికి ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు.
మరోవైపు మీరు ఎందుకు అక్కడకు వచ్చారు గ్రానీ… కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని అని జ్యో..పారుపై మండిపడుతుంది. బావ, దీపలకు నా జన్మరహస్యం తెలుసేమో అని నాకు డౌట్ వస్తోంది అంటుంది. అందుకు వాడికి ఏం తెలియదు నిన్న ఆటపట్టించడానికి అలా మాట్లాడాడు అంటుంది పారు. నా కొడుకు మంచోడు కాబట్టి నిజం చెప్పలేదు అంటుంది. నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని బయటపడినా నీకు నష్టం జరగవద్దు అంటే ఒక పని చేయాలి అంటుంది. ఏంటని అడిగితే పెళ్లి చేసుకో అని చెబుతుంది. బావను తప్ప నేను ఇంకొకర్ని పెళ్లి చేసుకోను అంటుంది జ్యో. ముందు నేను నా పదవిని కాపాడుకోవాలని చెప్పి వెళ్లిపోతుంది.
మరుసటి రోజు బోర్డు మీటింగ్ జరుగుతుంటుంది. గత 5 నెలల నుంచి మన కంపెనీ ప్రాఫిట్స్ చాలా తగ్గాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ అయ్యాయి. ఆన్ లైన్ మార్కెటింగ్ లో మన రెస్టారెంట్స్ కి ఉన్న రేటింగ్ తగ్గుతూ ఆర్డర్స్ కూడా తగ్గాయి. ఫుడ్ సరిగ్గా లేదని సోషల్ మీడియాలో ఎవ్వరో వీడియో పెట్టడం.. అది వైరల్ కావడం వల్ల చాలా డ్యామెజ్ జరిగిందని దశరథ అంటాడు. ఈ నష్టాల్లో నుంచి కంపెనీని సేవ్ చేయడానికి సీఈవో గా నేనొక నిర్ణయం తీసుకున్నానని జ్యోత్న్స అనడంతో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.