కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 31వ తేదీ)లో కార్తీక్ కుటుంబంపై విపరీతమైన ప్రేమ చూపిస్తుంది పారు. దీప చావుకు ప్లాన్ చేస్తుంది జ్యో. పార్టీకి దీప రాదు అంటాడు కార్తీక్. జ్యోకు ఎదురు తిరుగుతుంది పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో దీపే తన మనుమరాలు అనుకొని ప్రేమ కురిపిస్తుంది పారిజాతం. కాంచన, అనసూయ, పారు ప్రవర్తన చూసి షాక్ అవుతారు. ఒక్కసారిగా నీలో ఇంత మార్పు ఏంటి పారు అని అడుగుతాడు కార్తీక్.
దీప నాకు మనుమరాలు లాంటిది, ఎందుకు ఆడిపోసుకుంటావని నా అంతరాత్మ నన్ను తిట్టింది రా.. అందుకే తప్పు సరిదిద్దుకుందామని వచ్చాను అని చెప్తుంది పారు. ఇన్నాళ్లు నిజం తెలియక మిమ్మల్ని దూరం పెట్టాను. ఇకపై మీకు నేనున్నాను అనే ఫీలింగ్ వచ్చేలా మాట్లాడుతుంది పారు. కుబేర ఫోటో చూస్తూ తన మనుమరాలిని కాపాడి పెంచి, పెద్ద చేశాడని అతనికి థాంక్స్ చెప్తుంది.
27
దీపకు నిజం చెప్పిన కార్తీక్
పారు ఇంటికి వెళ్తావా.. లేక తాతకు ఫోన్ చేయమంటావా అంటాడు కార్తీక్. వెళ్తాను లేరా నువ్వు ఒకడివి అనుకుంటూ వెళ్లిపోతుంది పారు. మా పిన్నికి ఏమైందిరా అని అడుగుతుంది కాంచన. ఏంలేదు లే అమ్మ అంటాడు కార్తీక్. ఏంటి బావ ఇదంతా అని అడుగుతుంది దీప. నిన్ను ఉదయం తిట్టింది కదా.. అందుకే నువ్వే దాసు మామయ్య కూతురు అని మామయ్యతో అబద్ధం చెప్పించాను అంటాడు కార్తీక్. నువ్వు ఎంజాయ్ చెయ్ అని చెప్తాడు.
37
దీప చావుకు కుట్ర
మరోవైపు ఏదో మాట్లాడాలి అన్నావు కదా ఏంటి అని అడుగుతాడు శివన్నారాయణ. మమ్మీ ఆరోగ్యంగా ఇంటికి వచ్చిన సందర్భంగా మనకు కావాల్సిన వాళ్లను పిలిచి గెట్ టు గెదర్ పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడు మన కుటుంబాల మధ్య ఉన్న చిన్న చిన్న అభిప్రాయభేదాలు కూడా తొలగిపోతాయి అని చెప్తుంది జ్యోత్స్న. పెళ్లి గురించి కూడా ఆలోచించు అంటుంది సుమిత్ర. దాని గురించి కూడా రేపే చెప్తాను అంటుంది జ్యోత్స్న. రేపు మీకు ఓ సర్ ప్రైజ్ ఉంది అంటుంది జ్యోత్స్న. ఏంటది అని అడుగుతాడు దశరథ. నీ కూతురు చావు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
చాలా హ్యాపీగా ఇంటికి వస్తుంది పారు. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావని అడుగుతాడు శివన్నారాయణ. వాకింగ్ కు వెళ్లానని చెప్తుంది పారు. మరి ఇక్కడికి వెళ్లింది ఎవరు అని కార్తీక్ ఇంట్లో పారు చేసిన హడావిడి వీడియోను చూపిస్తాడు శివన్నారాయణ. ఆ మాయలోడు నీకు వీడియో తీసి పెట్టాడా అని అంటుంది పారు. అంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. ఆ ఇంటికి ఎందుకు వెళ్లావు అని అడుగుతాడు శివన్నారాయణ. జ్యోత్స్న అందరినీ అవమానించింది. అందుకే ఓదార్చడానికి వెళ్లాను అని చెప్తుంది పారు.
57
దీప స్పెషల్ గెస్ట్
రేపు మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉందని కార్తీక్ తో చెప్తుంది జ్యోత్స్న. మీరంతా రావాలి. దీపను స్పెషల్ గా ఇన్వైట్ చేశానని చెప్పు అంటుంది జ్యోత్స్న. చిన్న మరదలు పెద్ద ప్లానే వేసిందని మనసులో అనుకుంటాడు కార్తీక్.
67
జ్యోకు ఎదురు తిరిగిన పారు
ఆ ఇంటికి ఎందుకు వెళ్తావు, నువ్వు అక్కడికి వెళ్తే నేను తప్పు చేసినట్లు నువ్వు సాటింపు వేసినట్లే కదా అని పారిజాతంపై సీరియస్ అవుతుంది జ్యోత్స్న. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా ఇష్టం, నేను దీప దగ్గరకు ఎప్పుడైనా వెళ్తాను, ఎన్నిసార్లు అయినా వెళ్తాను. నాకు టైం వచ్చింది. ఇక నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అంటుంది పారు. గ్రానీకి ఏమైందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
77
కాంచన డౌట్
మరోవైపు కాంచన, అనసూయ వాళ్లంతా మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్లీ పార్టీ అని పిలిచి ఏ గొడవ చేస్తుందో.. జ్యోత్స్న వల్ల ఆ ఇంటికి వెళ్లాలంటేనే భయం వేస్తోంది అంటుంది కాంచన. వీలునామా గురించి ఏదో గొడవ జరిగింది కదా.. మళ్లీ దాని గురించి మాట్లాడ్డానికే ఈ పార్టీ ఏర్పాటు చేసి ఉంటుంది అంటుంది అనసూయ. అలాంటిది ఏం ఉండదులే అమ్మ. నువ్వు టెన్షన్ పడకు. తాత నిన్ను రమ్మన్నాడు కదా, వెళ్లకపోతే బాగోదు అంటాడు కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరయల్ ఎపిసోడ్ ముగుస్తుంది.