
రేఖ మందు తాగుతూ పదే పదే గత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకుంటుంది. ఇంతలో భ్రమరాంబ వచ్చి రేఖ చేతిలో మందు బాటిల్ లాక్కుంటుంది. నీకేమైంది రేఖ...ఎందుకు టెన్షన్ పడుతూ తాగతున్నావ్ అని అడుగుతుంది. ఆ అబ్బాయి వచ్చినప్పటి నుంచి కంగారు పడుతున్నావ్, అసలు ఆ అబ్బాయికి, నీకు సంబధమేంటీ అని ప్రశ్నిస్తుంది. కొన్నేళ్ల క్రితం చనిపోయినవాడు కళ్లముందు కనిపిస్తే భయపడనా అంటుంది రేఖ. దుగ్గిరాల వారసుడు స్వరాజ్ ను మా అమ్మ చంపేసిందని చెప్తుంది. యాక్సిడెంట్ లో అంతా చనిపోతే వాడెలా బతుకుతాడని భ్రమరాంబ అంటుంది. ఒకే పోలికలతో ఎలా ఉంటాడని అడుగుతుంది. అయినా ఒకవేళ వాడు బతికినా, వాడు ఒక్కడే ఏం చేస్తాడు అని భ్రమరాంబ అంటుంది.
ఏం మాట్లాడుతున్నావ్ వదిన, రాజ్ మేనల్లుడు అంటే ఈ ఇంటికి మరో వారసుడు అవుతాడు, ఇప్పటి వరకు మనకు ఒకరే శత్రువు, ఇప్పుడు వాడు కూడా తోడైతే ఇద్దరితో పోరాడాల్సి ఉంటుంది. ఇందుకు బావగా అండగా నిలబడితే మన పరిస్థితి అంతే అంటుంది రేఖ. ఇక భ్రమరాంబ కంగారుపడి..ఇన్నేళ్లు పడిన శ్రమ వృథానేనా, ఆస్తి మన చేతికి రాదా అని అడుగుతుంది. ఇది నా ఊహ మాత్రమే. ముందు వాడు నిజమా, అబద్ధమా అన్నది తెలుసుకోవాలని రేఖ అంటుంది. ఇన్ని రోజులుగా ఎందుకు ఇంటికి రాలేదు, ఎందుకు దూరంగా ఉన్నాడు అని రేఖ అంటే...అలా అయితే వాడు నిజమైన వారసుడు కాదేమో అని భ్రమరాంబ అంటుంది. అలా అని కొట్టిపారేయలేం. వాడు చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాడు, వాడి ఫ్యామిలీ ఏంటో తెలుసుకోవాలి, అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటానని రేఖ అంటుంది.
ఇక రాజు...నిద్రలో మళ్లీ ఉలిక్కిపడి లేస్తాడు. వ్యాన్ కాలిపోయినట్లు కల వచ్చింది. అక్కడే ఉన్న వాళ్ల అమ్మా, నాన్న మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ల పనిలో వాళ్లుంటారు.ఏంటీ నేను ఇంత కంగారుపడితే...మీరు అసలు పట్టించుకోరు అని రాజు అడుగుతాడు.నీకొచ్చే ఫాంటసీ కలలకు మేం చేస్తాం, మంటలు వచ్చాయని, లక్ష్మీ దేవి కలలో కనిపించందని చెప్తావ్, మాకు ఇది మామూలేగా అని వాళ్ల నాన్న అంటాడు. ఈసారి కూడా అదే కల వచ్చింది. వ్యాన్ కాలిపోయినట్లు, ఎవడో ఒకడు ఎగురుకుంటూ పడ్డట్టూ వచ్చాడని రాజు చెప్తాడు.
ఒకే కల వారంలో మూడుసార్లు రావడం అనుమానంగా ఉందని వాళ్ల అమ్మ అంటుంది. వాడికి చిన్నప్పుడు జరిగిన విషయాలు గుర్తుకువస్తున్నాయని వాళ్ల నాన్న అంటాడు. మనకు వాడు దొరికిన విషయం వాడికి చెప్పకుండా దాచడం తప్పేమో అనిపిస్తుందని లక్ష్మీ అంటుంది. నాకు అలానే అనిపిస్తుంది. కానీ ఒక వేళం నిజం చెప్తే..వాళ్ల కోసం వెళ్తాడు. వాళ్లు బతికిలేకపోతే ఆ బాధను జీవితాంతం మోయాలి వాడు అని రాజు నాన్న అంటాడు. వాడికి సంబంధించి వాళ్లు ఎవరో ఒకరు బతికే ఉంటారని లక్ష్మీ అంటుంది.
ఇంతలో రేఖ రాజు వాళ్ల ఇంటికి వస్తుంది. రాజు వాళ్ల నాన్నమీద అరుస్తుంటాడు.మొక్కల మీద నీళ్లు పోస్తుంటే నా బండి మీద మట్టి పడుతోందని అరుస్తాడు. జనాభా లెక్కల పేరుమీద ఒక వ్యక్తిని రాజు వాళ్ల ఇంటికి పంపిస్తుంది. అతను చెప్పిందంతా వినేలా బ్లూటూత్ పెట్టుకుంటుంది.
జనాభా లెక్కల పేరుమీద డిటెయిల్ అడుగుతాడు. ఈ అబ్బాయి ఎవరు అని అడిగితే....ఎక్కడో రోడ్డు మీద దొరికితే తెచ్చుకున్నానని అంటాడు. రేఖ కంగారుపడుతుంది. అదేంటీ అని ఆ వ్యక్తి అడిగితే...లేకపోతే ఏంటీ, వాడు నా కన్న కొడుకు, నా కష్టార్జితం అని చెప్తాడు. అన్ని విషయాలు అడుగుతాడు. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, మీ నాన్న, మీ తాతయ్య అందరూ ఇక్కడే పుట్టారా అని అడుగుతాడు. వీళ్లు చెప్పినదాన్ని బట్టి చూస్తే అసలు వీడికి, వాడికి పోలిక లేదని అనుకుంటుంది రేఖ.
ఇటు ఐశ్వర్య...రాకేష్‍కు డబ్బులివ్వలేక నానా అవస్థలు పడుతుంది. ఇంతలో మళ్లీ రాకేష్ ఫోన్ చేసి తిడతాడు. మరో రెండు రోజుల్లో ఇవ్వకపోతే మీ ఆంటీని కలుస్తానని రాకేష్ బెదిరిస్తాడు. రాకేష్‍ను టైం ఇవ్వమని ఐశ్వర్య బతిమాలుతూ ఉంటుంది. ఐశ్వర్య మాటలన్నీ...వెనుకనుంచి ఇందు అంటుంది. ఐశ్వర్య వెనక్కి తిరిగి ఇందును చూసి కంగారు పడుతుంది. నువ్వేం చేస్తున్నావ్ ఐశ్వర్య...నువ్వు చేసిన దొంగతనానికి, నామీద నింద ఎందుకు వేశావ్ అని ఇందు అడుగుతుంది. నేను నెక్లెస్ తీసాక, ఇంకో నెక్లెస్ నువ్వే తీసుంటావని అనిపించింది. అందుకే నీమీద చెప్పానని చెప్తుంది. నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడమేంటీ, ధైర్యంగా నువ్వు చెప్పలేకపోయావంటే...నువ్వు ఏదో తప్పు చేస్తున్నావని అర్థమైందని ఇందు అంటుంది. ఇంక ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి..మీ అమ్మ లాగే నువ్వు కూడా తయారయ్యావని ఐశ్వర్య అంటుంది. మీ అమ్మ కూడా ఆస్తి లాక్కుని, మా అమ్మకు చిల్లర వేసిందని ఐశ్వర్య అంటుంది. నువ్వు రేఖ మాయలో ఉన్నావ్, ఏదో ఒకరోజు నువ్వే నా దగ్గరకు వచ్చి తప్పు చేశావని బాధపడతావ్ అని ఇందు అంటుంది. చావనైనా చస్తాను గానీ, నీ దగ్గరకు రాను అని ఐశ్వర్య అంటుంది.
మరోవైపు రెస్టారెంట్ దగ్గరకు వెంకీ, నందు వస్తారు. రోజాను ఇంప్రెస్ చేసి నా లవ్ సక్సెస్ చేయాలని వెంకీ అంటాడు. నిన్ను వదిలించుకోవడానికైనా మీ ప్రేమ గెలిపిస్తా అని నందు అంటుంది. ఇద్దరు కలిసి రోజా దగ్గరకు వెళ్తారు..ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.