Karthika Deepam 2 Today Episode: సూపర్ ట్విస్ట్-దొరికిపోయిన వైరా- తప్పు ఒప్పుకున్న కాశీ-జ్యో అరెస్ట్

Published : Dec 30, 2025, 08:16 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 30వ తేదీ)లో నిజం చెప్పలేను అని బాధపడ్డ దీప. ప్రూఫ్స్ తో దొరికిపోయిన వైరా. అందరిముందు జ్యోత్స్న పేరు చెప్పిన వైరా. జ్యోత్స్నను అరెస్టు చేసిన పోలీసులు. బ్రతిమాలిన పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో నువ్వే నా కూతురు అయితే బాగుండు అని బాధపడతాడు దశరథ. మీరు కూతురు విషయంలో ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతోంది. నేనే మీ కూతురు అని చెప్పి మీ బాధ అంతా పోగొట్టాలని ఉంది. కానీ చెప్పలేను అని మనసులో అనుకొని బాధపడుతుంది దీప. 

సుమిత్ర అమ్మగారికి ఏం కాదు.. మీరు కంగారు పడకండి అని చెప్తుంది. ఇంతలో సుమిత్ర అక్కడకు వచ్చి నాకు ఏమైంది అని అడుగుతుంది. ఆయన కోసమే హాస్పిటల్ కి వెళ్లాము. వచ్చాము. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్తుంది. నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు. కార్తీక్ ఎక్కడ అని అడుగుతుంది సుమిత్ర. బయటకు వెళ్లాడు అని చెప్తుంది దీప. బావ వెళ్లిన పని ఏమైందో అని మనసులో అనుకుంటుంది దీప.

28
కార్తీక్ కి వైరా ఆఫర్

మరోవైపు జ్యోత్స్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు వైరా. నేను అప్పుడే చెప్పాను కదా బాస్ ఆమె కరెక్ట్ కాదని.. మీరే వినలేదు అంటాడు వైరా అసిస్టెంట్. జ్యోత్స్న అలా మాట్లాడడానికి ఏదో కారణం ఉంది అంటాడు వైరా. ఇంతలో కాశీ లోపలికి వస్తాడు. రండి జీఎం గారు. అంతా ఓకేనా అని అడుగుతాడు. 

ఓకే అంటూ సీన్ లోకి ఎంట్రీ ఇస్తాడు కార్తీక్. నువ్వు ఎందుకు వచ్చావు అంటాడు వైరా. మీరు అందరికీ జాబ్ లు ఇస్తున్నారట కదా.. పీఏకే జీఎం పోస్టు ఇచ్చారంటే.. నాకు ఏ పోస్టు ఇస్తారో అంటాడు కార్తీక్. నిజంగా నువ్వు మీ తాతను వదిలేసి వస్తే నిన్ను నా సంస్థలకు అధిపతిని చేస్తా అంటాడు వైరా. చెడ్డోడి చేతిలో కత్తిలా ఉండడం కంటే మంచోడి చేతిలో కర్రలా ఉండడమే నాకు ఇష్టం అంటాడు కార్తీక్.

38
దొరికిపోయిన వైరా

మరెందుకు వచ్చావు అంటాడు వైరా.. మిమ్మల్ని తీసుకెళ్లడానికి అంటాడు కార్తీక్. ఎక్కడికి అంటాడు వైరా. చీకట్లో చేసిన పాపాలను వెలుగులో కడుక్కోవడానికి అంటాడు కార్తీక్. నేనేం తప్పు చేశాను అంటాడు వైరా. నువ్వు, కాశీ, నువ్వు కొనేసిన జ్యోత్స్న రెస్టారెంట్ ఎంప్లాయిస్ అందరూ ప్రూఫ్స్ తో సహా దొరికిపోయారు. 

ఇక నటించకు. పాపం కాశీ చెంపను చూస్తే నీకు ఇంకా ఏం అర్థం కాలేదా అంటాడు కార్తీక్. నువ్వు బెదిరిస్తే నేను భయపడను అంటాడు వైరా. నా కంపెనీ జోలికి వచ్చావు. వార్నింగ్ ఇచ్చి వదిలేశాను. ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికి వచ్చావు. ఇక వదిలేయడాలు లేవు అని వైరా కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్తాడు కార్తీక్.

48
వైరా కుట్రను బయటపెట్టిన కార్తీక్

పెద్దయ్య గారు మన ఇంటికి మీడియా వాళ్లు వచ్చారు అని చెప్తుంది దీప. వాళ్లు ఎందుకు వచ్చారు అనుకుంటూ బయటకు వస్తాడు శివన్నారాయణ. నేనే రమ్మని పిలిచాను అని వైరాను, కాశీని తీసుకొని వస్తాడు కార్తీక్. వాళ్లను చూసి జ్యోత్స్న మైండ్ బ్లాంక్ అవుతుంది. వీళ్లు దొరికిపోయారు అంటే నా పేరు కూడా చెప్పారా అని భయపడుతుంది జ్యోత్స్న.

జ్యోత్స్న రెస్టారెంట్ లో కుట్ర జరిగింది. వైరా, కాశీ, మరో ఇద్దరు ఎంప్లాయిస్ కలిసి ఫుడ్ కల్తీ చేశారు. ఆ తప్పును మా నాన్న శ్రీధర్ గారిపై వేశారు. అని మీడియా ముందు వివరిస్తాడు కార్తీక్. నిజం చెప్పు కాశీ అంటాడు కార్తీక్. నేను సీఈఓ శ్రీధర్ గారి దగ్గర పీఏగా చేస్తున్నాను. వైరా జీఎం పోస్ట్ ఆఫర్ చేశారు. అందుకే ఇలా చేశాను అంటాడు కాశీ. వైరా మాత్రం దీనికి కారణం నేను కాదు. వేరే ఉన్నారని చెప్తాడు.

58
జ్యోత్స్న అరెస్ట్

అంతలో పోలీసులు అక్కడికి వస్తారు. నేను తప్పు చేశా. కానీ అది నాతో ఒకరు చేయించారు అని జ్యోత్స్న పేరు చెప్తాడు వైరా. అంతా షాక్ అవుతారు. సీఈఓ పోస్టు తనకు దక్కలేదని.. వైరాతో కలిసి తన తండ్రిపై జ్యోత్స్న కుట్ర చేసింది అంటాడు కార్తీక్. తప్పు చేసింది ఎవరైనా శిక్ష తప్పదంటాడు శివన్నారాయణ. 

జ్యోత్స్నను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. నా మనుమరాలు తప్పు చేయలేదు తనని వదిలేయండని అరుస్తూ ఉంటుంది పారు. గ్రానీ ఎందుకు అరుస్తున్నావు అంటూ పారును కదిలిస్తుంది జ్యోత్స్న. నువ్వు అరెస్ట్ అయినట్లు ఊహించుకున్నానే అంటుంది పారు. సైలెంట్ గా ఉండు అంటుంది జ్యోత్స్న.

68
జ్యోత్స్న పేరు చెప్పిన వైరా

నీ వెనుక ఎవరో ఉన్నారని అన్నావు కదా వాళ్లెవరో చెప్పు అంటాడు కార్తీక్. జ్యోత్స్నపేరు చెప్తాడు వైరా. నా మనుమరాలిపైనే నిందేస్తావా అని వైరా చెంప పగలగొడుతాడు శివన్నారాయణ. నేను చెప్పేది నిజం. తనే నా దగ్గరకు వచ్చి ఇలా చేయమని నన్ను అడిగింది. అందుకే చేశాను అంటాడు వైరా. అతని మాటలు ఎవరూ నమ్మరు.

78
జ్యోత్స్నకు ఎలాంటి సంబంధం లేదు

నువ్వు మా శత్రువు అని అందరికీ తెలుసు. నేను కూడా నీలాగే మాట్లాడితే నీకు నాకు తేడా ఏముంది అంటుంది జ్యోత్స్న. పైగా వైరాకు వార్నింగ్ ఇచ్చినట్లు తను రికార్డు చేసుకున్న వాయిస్ ను అందరికి వినిపిస్తుంది. మనం పూర్తిగా మునిగిపోయాము కాశీ. ఇప్పటికైనా నిజం చెప్పు అంటాడు వైరా. జ్యోత్స్నకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అంటాడు కాశీ. ఈ ఇంట్లో నువ్వు ఉండాల్సిన దానివే జ్యోత్స్న. నువ్వే కరెక్ట్. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. అది నిజమే అంటాడు వైరా.

88
కాశీ మోసపోవడం ఇది రెండోసారి

నిజం చెప్పనందకు థ్యాంక్స్ రా తమ్ముడు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. వైరా, కాశీలను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కాశీని ఇరికించింది జ్యోత్స్ననే అని మనసులో అనుకుంటుంది పారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి. నాతో రండి జ్యోత్స్న గారు అంటాడు కార్తీక్. ఎందుకు అంటుంది జ్యోత్స్న. సీఈఓ గారిని తీసుకురావాలి అంటాడు కార్తీక్. 

నేను వస్తాను అంటాడు దశరథ. వద్దు జ్యోత్స్ననే వెళ్లనివ్వు అంటాడు శివన్నారాయణ. కాశీని ఇరికించి జ్యోత్స్న చాలా తెలివిగా తప్పించుకుంది. కాశీ జ్యోత్స్నను నమ్మి మోసపోవడం ఇది రెండోసారి అని మనసులో అనుకుంటుంది దీప. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories