
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో తులసికోట వద్ద దీపం పెట్టి తల్లి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటుంది దీప. కార్తీక్ అక్కడికి వచ్చి అత్తయ్య, మామయ్య హాల్లో లేరు. నువ్వు చూశావా అని అడుగుతాడు. లేదు అంటుంది దీప. నాన్న కేసు విషయంలో పడి అత్త ఆరోగ్యం గురించి ఆలోచించలేదు. ఇప్పుడు గుర్తొస్తే భయమేస్తోంది. డాక్టర్ ఏం చెప్తారో.. రిపోర్ట్స్ లో ఏం వస్తుందో అంటాడు కార్తీక్. ఇంతలో దశరథ అక్కడకు వస్తాడు.
హాస్పిటల్ కి వెళ్దాం కార్తీక్ అంటాడు దశరథ. ఒక్కడినే వెళ్దాం అనుకున్నాను. కానీ తోడుంటే బాగుండు అనిపించింది అంటాడు. సరే మామయ్య వెళ్దాం అంటాడు కార్తీక్. అమ్మకు ఏం కాదు మీరు ధైర్యంగా వెళ్లి రండి అని చెప్తుంది దీప. వాళ్లు బయల్దేరగానే తులసికోటలో వెలిగించిన దీపం ఆరిపోతుంది. అది చూసి కంగారు పడుతుంది దీప.
కార్తీక్, దశరథ హాస్పిటల్ కి వెళ్తారు. స్పెషలిస్ట్ రూమ్ లోకి వెళ్లి తనని తాను పరిచయం చేసుకుంటాడు దశరథ. ఆ తర్వాత కార్తీక్ తన మేనల్లుడు అని డాక్టర్ కి పరిచయం చేస్తాడు. నా భార్యకు ఏమైందని దశరథ కంగారుగా అడుగుతుండటంతో.. డాక్టర్ కావాలనే తనని బీపీ చెక్ చేయించుకోమని బయటకు పంపిస్తుంది. కార్తీక్ ని మాత్రం అక్కడే ఉండమంటుంది. మా అత్తకు ఏమైంది డాక్టర్.. ఇబ్బంది ఏం లేదు కదా అంటాడు కార్తీక్. ఉంది.. సుమిత్ర గారికి మేజర్ ప్రాబ్లమే ఉంది అంటుంది డాక్టర్.
మరోవైపు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు పారు, జ్యోత్స్న. కాశీ విషయం ఏం చేశావు అంటుంది పారు. మనం అనుకోగానే జైలు నుంచి బయటకు రావడం కష్టం అంటుంది జ్యోత్స్న. కానీ నువ్వు అనుకోగానే వాడు లోపలికి వెళ్లాడు కదా అంటుంది పారు. ఎవరైనా వింటారు చిన్నగా మాట్లాడు గ్రానీ అంటుంది జ్యోత్స్న. ఆ మాయలోడు ఇంట్లో లేడులే అంటుంది పారు. ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలి గ్రానీ అంటుంది జ్యోత్స్న. చప్పట్లు కొట్టి దీపను కాఫీ తీసుకురమ్మని పిలుస్తుంది పారు.
కాఫీ కప్ పట్టుకొని దీప రాగానే.. కళ్లు ఏంటి అలా ఉన్నాయి. నా మనుమడిని జైలుకు పంపించి.. అంతా సంతోషంగా వింధు భోజనం చేశారు కదా నిద్ర మంచిగానే పట్టి ఉండాలే అంటుంది పారు. కాఫీ తీసుకోండి అంటుంది దీప. మీకు ఎలాగు బుద్ధి లేదు. ఆ స్వప్నకు ఏమైంది. అది కూడా మొగుడ్ని వదిలేసిందా అంటుంది పారు. వాడు కాకపోతే ఇంకొకడు అని దీప చెప్పిందేమో అంటుంది జ్యోత్స్న. అమ్మాయి గారు అని కోపంగా అరుస్తుంది దీప. ఏంటే ఎగిరిపడుతున్నావు అని కాఫీ కప్ ని లాక్కుంటుంది పారు. కప్ కింద పడి పగిలిపోతుంది. ఎంత పొగరే నీకు అని పారు, దీప మీదకు వెళ్తుంది.
పారిజాతం అని గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ. కాఫీ కప్ ఎలా కిందపడిందో నేను చూశాను. మనుమడి మీద అంత ప్రేమ ఉంటే నువ్వు కూడా వెళ్లి రెండు రోజులు పోలీస్ స్టేషన్ లో ఉండిరా అంటాడు శివన్నారాయణ. ఇంతలో సుమిత్ర అక్కడకు వచ్చి.. కడుపుతో ఉన్న పిల్లవి... ఇలాంటి పనులన్నీ చేయకు. వంట చేయి. అదికూడా ఇబ్బంది అయితే నాకు చెప్పు. నేను హెల్ప్ చేస్తాను అంటుంది సుమిత్ర.
కడుపుతో ఉన్న అమ్మాయితో సేవలు చేయించుకునేవాళ్లకు ఉండాలి బుద్ధి అంటాడు శివన్నారాయణ. దీప చీపురు పట్టుకొని వచ్చి కిందపడింది క్లీన్ చేయాలి అనుకుంటుంది. కానీ పారుతో క్లీన్ చేయిస్తాడు శివన్నారాయణ. దీని జోలికి పోయిన ప్రతిసారి దానిపని నేను చేయాల్సి వస్తుంది అంటుంది పారు. మనకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. అది దానికి తెలుసు. అందుకే అది లోలోపల ఏడుస్తోంది. ఏం జరుగుతుందో కనిపెట్టాలి అంటుంది పారు.
మరోవైపు మా అత్తయ్యకు సమస్య అన్నారు. ఏంటో చెప్పలేదు అని అడుగుతాడు కార్తీక్. సుమిత్ర గారికి బ్లెడ్ క్యాన్సర్ అంటుంది డాక్టర్. షాక్ అవుతాడు కార్తీక్. నోటమాట రాక సైలెంట్ అయిపోతాడు. గురువు గారు చెప్పిన గండం ఇదేనా అని అంతకు ముందు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు.
మీరు కంగారు పడకండి సుమిత్ర గారికి ట్రీట్ మెంట్ చేస్తే తగ్గే దశలోనే వ్యాధి ఉంది. కానీ ధైర్యంగా తాను ముందుకు రావాలి. ఈ విషయం చెప్తే ఆవిడ ఎలా తీసుకుంటారో మనకు తెలియదు. కానీ పేషెంట్ ని ట్రీట్ మెంట్ కి ప్రిపేర్ చేసే బాధ్యత మీదే. ఈ విషయం ఇంట్లో అందరితో చెప్పండి. మందులతో పాటు మానసిక బలం కూడా ముఖ్యమే అంటుంది డాక్టర్. ఏడుస్తూనే ఓకే చెప్తాడు కార్తీక్.
ఇంతలో దశరథ వచ్చి.. నా బీపి నార్మల్ గానే ఉంది డాక్టర్ అని చెప్తాడు. ఓకే మంచిది ఇక మీరు వెళ్లండి అంటుంది డాక్టర్. అదేంటీ నా భార్యకు ఏమైందో చెప్పనేలేదు అంటాడు దశరథ. ఏం కాలేదు అంటాడు కార్తీక్. మరి నన్ను హాస్పిటల్ కి ఎందుకు పిలిపించారు అని అడుగుతాడు.
అత్తకు ఏం కాలేదని చెప్పడానికే నిన్ను పిలిపించారు. మనం వెళ్దాం పదా మామయ్య అంటాడు కార్తీక్. తను చెప్తోంది నిజమే. కార్తీక్ మీతో అంతా చెప్తాడు అంటుంది డాక్టర్. మనం బయటకు వెళ్లి మాట్లాడుకుందాం పదా మామయ్య అని దశరథను తీసుకెళ్తాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.