ఒక్క ఛాన్స్ కోసం మహేష్ ఆఫీస్ చుట్టు తిరిగాడు, ప్రస్తుతం 100 కోట్ల సినిమా చేసిన యంగ్ హీరో ఎవరు?

Published : Oct 26, 2025, 02:08 PM IST

ఒకప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయడంకోసం ఆఫీస్ చుట్టు తిరిగాడు. కానీ అవకాశం రాలేదు.. కానీ ప్రస్తుతం హీరోగా మారి వంద కోట్ల కలెక్షన్ మూవీ చేశారు. ఇంతకీ ఆ హీరో ఎవరు?

PREV
15
సూపర్ స్టార్ తో సినిమా ఛాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతీ ఒక్క దర్శకుడికి ఉంటుంది. కానీ అంతదరికి ఆఛాన్స్ రాదు కదా? కొంత మంది మాత్రం తమ కథలతో మెప్పించి సినిమా ఛాన్స్ లు కొట్టేశారు..కానీ కొంతమందికి అసలు మహేష్ ను కలిసే ఛాన్సే రాలేదు. అలా అని వారి జీవితం అక్కడితో ఆగిపోలేదు. ఇతర ప్రయత్నాల ద్వారా సినిమాలు చేసి.. గొప్ప స్థాయిలోకి ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. వారిలో తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ కూడా ఉన్నారు.

25
మారుమోగుతోన్న ప్రదీప్ పేరు

ప్రస్తుతం సినిమాలో ప్రదీప్ రంగనాథన్ పేరు మారుమోగుతోంది. దర్శకుడిగా మొదలైన ఆయన ప్రయాణం, ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తన కెరీర్‌లో తొలి మూడు సినిమాలతోనే 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన అరుదైన నటుడిగా ప్రదీప్ రంగనాథన్ రికార్డు సృష్టించాడు. ప్రదీప్ మొదట దర్శకుడిగా రంగప్రవేశం చేశాడు. జయం రవి హీరోగా తెరకెక్కిన “కోమలి”. చిత్రం ఆయన మొదటి సినిమా. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. సినిమా కథ, ఎమోషన్, సోషల్ మెసేజ్ కలయికగా ఉండటంతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

35
మహేష్ కోసం రాసుకున్న కథ

అయితే ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేసిన కోమలి సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రదీప్ రంగనాథన్ మొదట ఈ స్క్రిప్ట్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడట. కథ కూడా మహేష్ ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాడట. అంతే కాదు ఆ కథ పట్టుకుని మహేష్ బాబు ఆఫీస్ చుట్టూ ఎన్నో రోజుల పాటు తిరిగాడట. కథ చెప్పే అవకాశం కోసం చాలా ప్రయత్నించినా, మహేష్ బాబును కలిసే అవకాశం రాలేదట. కనీసం ఆయన ఆఫీస్ నుంచి స్పందన కూడా రాకపోవడంతో నిరాశ చెందిన ప్రదీప్, తర్వాత జయం రవి ఆఫీస్ నుంచి వచ్చిన కాల్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

45
మారిపోయిన ప్రదీప్ లైఫ్

కోమలి సినిమా విజయం ప్రదీప్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. తర్వాత ఆయన దర్శకత్వం నుండి నటన వైపు అడుగుపెట్టాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి చేసిన “లవ్ టుడే” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా యూత్ లో భారీగా క్రేజ్ ను సాధించింది. పెద్ద హిట్‌గా నిలిచి, 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత వచ్చిన “డ్రాగన్”. “డ్యూడ్” సినిమాలు కూడా వరుస బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇలా మొదటి మూడు సినిమాలతోనే 100 కోట్ల మార్క్‌ను దాటిన హీరోగా ప్రదీప్ రంగనాథన్ కొత్త రికార్డు నెలకొల్పాడు.

55
ప్రదీప్ రంగనాథన్ సినిమాలు

ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న తాజా చిత్రం “లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ”. ఈ సినిమాను నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా కృతి శెట్టి నటిస్తుండగా, సంగీతం అనిరుద్ రవిచందర్ అందిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్ అండ్ కామెడీ థీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబుతో అవకాశం పోయినా.. అక్కడితో ఆగిపోకుండా.. తన టాలెంట్ ను నిరూపించుకుని స్టార్ గా నిలిచాడు ప్రదీప్ రంగనాథన్.

Read more Photos on
click me!

Recommended Stories