కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్రను తీసుకెళ్తానన్న శివన్నారాయణ- అత్త ప్రాణాలతో ఉండదన్న కార్తీక్

Published : Oct 25, 2025, 07:52 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 25వ తేదీ)లో నా కోడలిని నాతో పాటు ఇంటికి తీసుకెళ్తానన్న శివన్నారాయణ. అత్త ప్రాణాలతో ఉండదన్న కార్తీక్. బాస్ తో మీటింగ్ ఉందని హడావిడి చేసిన కాశీ. బయట ఫ్రెండ్ తో కాశీని చూసిన శ్రీధర్. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

PREV
15
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 శనివారం ఎపిసోడ్ లో మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను. మీరు స్వార్థపరులు. మేము బాధపడుతున్నా.. సుమిత్ర ఇక్కడ ఉందనే విషయం మాకు చెప్పలేదు అంటాడు శివన్నారాయణ. నా కోడలిని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తాను అంటాడు. తీసుకెళ్తే అత్త శవాన్ని చూడాల్సి వస్తుందని అంటాడు కార్తీక్. వినడానికి మీకు, అనడానికి నాకు బాధగా ఉన్నా ఇదే నిజం తాత. అత్తను ఇంటికి తీసుకెళ్తే ప్రాణాలతో ఉండదు అని చెప్తాడు. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని అడిగితే.. జరిగిన విషయం చెప్తాడు. 

నువ్వు మమ్మల్ని స్వార్థపరులు అన్నావు కదా.. కుటుంబాన్ని కాపాడుకోవాలనే స్వార్థంతోనే మేము ఇలా చేయాల్సి వచ్చింది నాన్న అంటుంది కాంచన. మాకు మీరు ముఖ్యమే. వదినా ముఖ్యమే. మీకు చెప్తే వదిన ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటోంది. మేము ఏం చేయాలి నాన్న. ఎవరిని కాపాడుకోవాలి. వదిన ఇక్కడ ఉందని చెప్పలేదని మీరు ఎంత బాధపడుతున్నారో.. చెప్పలేకపోతున్నామని మేము అంతే బాధపడుతున్నామని ఏడుస్తుంది కాంచన.

25
క్షమాపణ కోరిన శివన్నారాయణ

పరిస్థితిని అర్థం చేసుకున్న శివన్నారాయణ కార్తీక్ కుటుంబాన్ని క్షమించమని అడుగుతాడు. పర్లేదు తాత గారు మనమంతా ఒక కుటుంబం.. మీరు ఒక మాట అంటే పడితే తప్పేముంది అంటుంది దీప. నేను ఒకసారి సుమిత్రను చూస్తాను అంటాడు శివన్నారయణ. వద్దు తాత. నీకు విషయం తెలుసని అత్తకు తెలిస్తే.. ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోతుంది. నువ్వు తెలియనట్లే ఉండు. అత్త మనసు మార్చి మన ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్తాడు కార్తీక్. సరే నువ్వు నాతోపాటు ఇంటికి రా.. అక్కడ మీ మామయ్య పరిస్థితి బాలేదని చెప్తాడు శివన్నారాయణ.

35
కాశీ హడావిడి

మరోవైపు అల్లుడు లేచాడా అని అడుగుతాడు శ్రీధర్. లేవడమేంటి ఆఫీస్ కి కూడా రెడీ అవుతున్నాడు అంటుంది కావేరి. బాస్ తో మీటింగ్ ఉందని త్వరగా వెళ్లాలని హడావిడి చేస్తుంటాడు కాశీ. అల్లుడు ఎంత మారిపోయాడు అనుకుంటాడు శ్రీధర్. హడావిడిగా బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేస్తాడు కాశీ. అది స్టార్ట్ కాదు. నేను అటువైపే వెళ్తున్నాను డ్రాప్ చేస్తాను పదా అంటాడు శ్రీధర్. వద్దు మామయ్య గారు నేను క్యాబ్ లో వెళ్తాను అని వెళ్లిపోతాడు కాశీ.  

45
కార్తీక్ ను వదిలేసి వెళ్తావా దీప?

సుమిత్ర మనసు మార్చే ప్రయత్నం చేస్తుంటారు కాంచన, దీప. భార్య భర్తల బంధం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.. ఎందుకంటే నా భర్త నన్ను మోసం చేశాడు. నా నమ్మకాన్ని ముక్కలు చేశాడు. కానీ నీ విషయం వేరు. మా అన్నయ్య చాలా మంచోడు. నీకోసం ఆలోచించే వ్యక్తి. నువ్వు లేకుండా ఎలా ఉంటున్నాడో.. ఎంత బాధపడుతున్నాడో ఆలోచించావా వదిన అంటుంది కాంచన. నేను లేకుంటేనే ఆయనకు సంతోషమని చెప్పాక కూడా నేను అక్కడ ఎలా ఉండగలను అంటుంది సుమిత్ర. కోపంలో అన్న మాటలకు మీరు ఇంకా ఎందుకు బాధపడుతున్నారు అంటుంది దీప. నీ భర్త నువ్వు లేకుండా సంతోషంగా ఉంటానని చెప్తే నువ్వు ఉంటావా?వెళ్లిపోతావా? అని దీపను ప్రశ్నిస్తుంది సుమిత్ర. వెళ్లిపోతాను అని చెప్తుంది దీప. నేను కూడా అదే చేశాను అంటుంది సుమిత్ర.

నేను మా బావను వదిలి వెళ్లిపోతానేమో కానీ.. మళ్లీ తిరిగి వస్తాను. ఎందుకంటే ఆ బంధంలో ఉన్న ప్రేమ అలాంటిది. మనం లేకుండా వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనే ఆలోచన మనల్ని వారికి దూరంగా ఉండనివ్వదు. మీరు దూరంగా ఉంటే దశరథ గారు ఎలా సంతోషంగా ఉంటారు. పోని మీరు సంతోషంగా ఉంటారా? ఆయన గురించి ఆలోచించకుండా ఉంటారా? అని అడుగుతుంది దీప. నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి. మొన్న జ్యోత్స్న వచ్చింది. చూడకుండా ఆపారు. ఈ రోజు మామయ్య గారు వచ్చారు. చూడకుండా ఆపారు. ఇలా ఎన్ని రోజులు ఆపగలరు. నేను ఎటైనా దూరంగా వెళ్లిపోతాను అంటుంది సుమిత్ర. నువ్వు అలా మాట్లాడకు వదినా అంటుంది కాంచన. నాన్న మాటలను గుర్తు చేసుకొని అమ్మ బాధపడుతోంది. ఆ బాధ నుంచి ఎలాగైనా బయటకు తీసుకురావాలి అని మనసులో అనుకుంటుంది దీప.

55
అడ్డంగా దొరికిపోయిన కాశీ

పని మీద బయటకు వచ్చిన శ్రీధర్..  ఫ్రెండ్ తో కలిసి బయట టైంపాస్ చేస్తున్న కాశీని చూస్తాడు. అదేంటి అల్లుడు గారు ఆఫీసులో మీటింగ్ ఉందని ఇంట్లో నుంచి అంత హడావిడిగా బయటకు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడని అనుకుంటాడు. కారులోనే కూర్చొని కాశీని చూస్తూ ఫోన్ చేస్తాడు. మా మామయ్య ఫోన్ చేస్తున్నారు సైలెంట్ గా ఉండు అని ఫ్రెండ్ తో చెప్తాడు కాశీ. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మామయ్య గారు అంటాడు. అల్లుడు గారు మీరు అని శ్రీధర్ అనబోతుండగా.. హా నేను ఆఫీస్ లో బిజీగా ఉన్నాను. ఏదైనా మాట్లాడాలా అంటాడు కాశీ. 

ఆ మాటకు షాక్ అవుతాడు శ్రీధర్. ఒకే మీరు పని కానివ్వండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శ్రీధర్. నాకు జాబ్ రావడం అబద్దమని తెలిస్తే ఘోరంగా తిడుతారని మనసులో అనుకుంటాడు కాశీ. తెలిసిందిలే అల్లుడు. నేనే అనుకుంటే నువ్వు నాకన్నా ముదురులా ఉన్నావు. ఉండు చెప్తా నీ సంగతీ.. అని కాశీని ఫోటో తీసుకుంటాడు శ్రీధర్. పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందని ఈ మామయ్యనే మోసం చేస్తావా? ఈ మాత్రం దానికి ఇంటి దగ్గర హడావిడి ఒకటి. ఇంటికి రా చెప్తా నీ సంగతి అని.. శ్రీధర్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories