కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్: దీపను ఇంట్లోకి రావద్దన్న శివన్నారాయణ.. దీప మాటల్లో తప్పులేదన్న సుమిత్ర..

Published : Sep 26, 2025, 08:38 AM ISTUpdated : Sep 26, 2025, 08:44 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (సెప్టెంబర్ 26వ తేదీ) లో నాకు చెప్పేంత అనుభవం నీకు లేదు దీప అంటాడు దశరథ. దీప మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అంటుంది సుమిత్ర.. కోపంతో ఊగిపోతుంది జ్యోత్స్న. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూద్దామా...

PREV
14
నాకు అవమానం జరిగింది

కార్తీక దీపం 2 శుక్రవారం ఎపిసోడ్ లో అవన్నీ నాకు తెలీదు. ఏమైనా ఉంటే మీ నాన్నతో మాట్లాడుకో అని శౌర్యతో దీప అంటుంది. ఈలోపు అక్కడికి కార్తీక్ వస్తాడు. శౌర్య నేను స్కూల్ కు వెళ్లను నాన్న. నాకు అవమానం జరిగింది అంటుంది. ఇంతలో కార్తీక్ కు జ్యో ఫోన్ చేసి మన అగ్రిమెంట్ ప్రకారం రూ.10 కోట్లు క్యాష్ పంపిస్తావా? చెక్ పంపిస్తావా? అని అడుగుతుంది. శౌర్యతో మాట్లాడుతూనే జ్యో కు కౌంటర్ ఇస్తాడు కార్తీక్. 

మనం పడిపోతే నవ్వేవాళ్లు చాలామంది ఉంటారు. మనల్ని ఏడిపించి నవ్వుతారు. మనం నవ్వితే కడుపు మంటతో రగిలిపోతారు. ఒక దేవుడే అందరికీ నచ్చనప్పుడు.. నువ్వు నచ్చాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మూర్ఖుల గురించి పట్టించుకోకుండా మనం చేయాల్సిన పని చేసుకుంటూ పోవాలి అంటాడు కార్తీక్. ఆ తర్వాత శౌర్య స్కూల్ కు బయల్దేరుతుంది. కార్తీక్, దీప దశరథ ఇంటికి బయల్దేరుతారు.

24
ఇంట్లోకి రావద్దు

ఇంట్లోకి రావొద్దని శివన్నారాయణ వారిని ఆపేస్తాడు. మీరు ఇంట్లో పనిచేయాల్సిన అవసరం లేదంటాడు. నా భార్య తప్పు చేసిందని మీరు నమ్ముతున్నారా? అని కార్తీక్ శివన్నారాయణను ప్రశ్నిస్తాడు. నమ్ముతున్నానా లేదా అనే విషయం పక్కనపెడితే నా కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు అంటాడు ఆయన. మా పని మిమ్మల్ని చేసుకోనివ్వమని కార్తీక్, దీప అంటారు.

తర్వాత పారు వాళ్లకు ముందు రోజు జరిగిన విషయాన్ని చెబుతుంది. మీ వల్ల అది తన్నులు తింది. దశరథకు, సుమిత్రకు మధ్య గొడవ జరుగుతుంటే వాళ్ల నాన్నను జ్యోత్స్న చిన్న మాట అంది. సుమిత్ర చెంప పగలకొట్టింది. ఇదంతా మీ వల్లే అంటుంది పారు.

34
నాకు ఇంకోసారి సలహాలు ఇవ్వకు..

ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు దీప, కార్తీక్. ఏం తెలియనట్టు వెళ్లి మీ నాన్నకు ఓ కాఫీ ఇవ్వు అంటాడు కార్తీక్ దీపతో. కాఫీ తీసుకెళ్తుంది దీప. ఈ రోజు మీరు రారేమో అనుకున్నాను.. మా చెల్లి ఎలా ఉందమ్మా? అంటాడు దశరథ. మీలాగే ఉంది. మీకు నేను ఒక విషయం చెప్పొచ్చా అంటుంది దీప. తండ్రి లాంటి వ్యక్తి దగ్గర నువ్వు ఏదైనా చెప్పొచ్చు అంటాడు దశరథ.

నేను మిమ్మల్ని తండ్రి అనుకుంటే సుమిత్ర నా తల్లి అవుతుంది. అలాంటి వ్యక్తి భర్తకు ఎందుకు దూరంగా ఉండాలి? భార్యా భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తూనే ఉంటాయి వాటిని మర్చిపోవాలి అంటుంది దీప. నావల్ల సుమిత్రమ్మ బాధపడుతోంది. మీ మధ్య దూరం పెరుగుతోంది. అది నాకు ఇష్టం లేదంటుంది దీప. సుమిత్ర తప్పు చేసింది. నా కోపం భార్య చేసిన తప్పు మీద. భార్య మీద కాదు. తన మనసు బంగారం ఇప్పుడు మకిలి పట్టింది. దాన్ని పోగొట్టాలంటే ఈ బాధ భరించాల్సిందే అంటాడు దశరథ. ఈ విషయంలో తనకు మరోసారి సలహాలు ఇవ్వొద్దని అంటాడు.

44
దీప మాటల్లో తప్పులేదు

దశరథ, దీపల మాటలు పక్కనుంచి విన్న సుమిత్ర ఫీల్ అవుతుంది. వెనకాలే ఉన్న జ్యోత్స్న కోపంగా వచ్చి.. వెళ్లి దీపను ఎందుకు వచ్చావో అడుగు మమ్మీ. నా భర్తకు, నాకు గొడవలు ఎందుకు పెడుతున్నావో అడుగు అంటుంది. డాడీని ఎదురించి మాట్లాడటం నా తప్పే. అందుకు కారణం దీప కాదా? దీప వల్ల మీ మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసిన బావ.. దీపను ఇంటికి తీసుకువచ్చాడు. వాళ్లంతా ఒక్కటైపోయారు మమ్మీ అని జ్యోత్స్న అంటుంది. దానికి దీప మాట్లాడిన దాంట్లో తప్పులేదని సుమిత్ర అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories