తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సక్సెస్ ఫుల్ గా 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 9వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ సెప్టెంబర్ 7 వ తేదీ గ్రాండ్ గా లాంఛ్ చేశారు. అయితే.. అన్ని సీజన్ల కంటే.. ఈ సీజన్ చాలా డిఫరెంట్ గా సాగుతోంది. గతంలో కూడా కామనర్స్ సీజన్ లోకి అడుగుపెట్టారు.
24
తెలుగు అమ్మాయి..
కానీ వాళ్లకు ఎలాంటి పరీక్షలు పెట్టకుండానే అడుగుపెట్టారు. కానీ.. ఈ సారి మాత్రం.. స్పెషల్ గా కామనర్స్ కోసం అగ్ని పరీక్ష అనే కార్యక్రమాన్ని పెట్టి మరీ సెలక్ట్ చేశారు. మొత్తం ఆరుగురు కామనర్స్ ఈ బిగ్ బాస్ 9 హౌస్ లో అడుగుపెట్టగా.. అందులో ఓ డాక్టర్ పాప కూడా ఉంది.. తనే ప్రియ శెట్టి.
34
రాయలసీమ బిడ్డగా...
అగ్ని పరీక్ష సమయంలోనే తన ఆట తీరు, మాట తీరుతో ఆకట్టుకున్న ప్రియ శెట్టి.. మన రాయలసీమ అమ్మాయి. చిన్న తనం నుంచి యాక్టర్ కావాలనే కోరిక ఉన్నా.. ఫ్యామిలీ కోసం డాక్టర్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఈ అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది.
మొత్తం 13 మంది కామనర్స్ లో ఎక్కువ ఓట్లు రావడంతో.. ప్రియ శెట్టి ని హౌస్ లోకి పంపించినట్లు.. హోస్ట్ నాగార్జున చెప్పారు. ఇక ప్రియ.. పేరుకు డాక్టర్ అయినా.. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. రీల్స్ చేస్తూ.. తన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. మరి, ఈ బిగ్ బాస్ జర్నీలో మన తెలుగు అమ్మాయికి.. మన మందరం కలిసి సపోర్ట్ చేద్దాం..