ఇక మిగిలిన నాలుగు నెలల్లో తమిళ సినిమా ఎక్కువ హిట్ సినిమాలు ఇస్తేనే ఇండస్ట్రీ పెద్ద నష్టం నుండి బయటపడగలదు. ఈ నాలుగు నెలల్లో దసర, దీపావళి, క్రిస్మస్ సీజన్లు వస్తున్నాయి కాబట్టి, కొత్త సినిమాలు భారీగాా విడుదల కానున్నాయి. దీపావళికి ప్రదీప్ రంగనాథన్ నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటివరకు పరాజయం చూడని ప్రదీప్, మరో రెండు హిట్లు ఇస్తే, అది ఆయన కెరీర్ కు మాత్రమే కాదు, తమిళ సినిమాకు కూడా పాజిటీవ్ గా మారే అవకాశం ఉంది. . కార్తి, శివకార్తికేయన్, సూర్య సినిమాలు కూడా ఈ సమయంలోనే విడుదల కానున్నాయి కాబట్టి తమిళ సినిమా ఈ నాలుగు నెలల్లో కోలుకుంటుందో లేదో చూడాలి.