Karthika Deepam 2 Today Episode:దీప‌ అనాథ కాదన్న దశరథ-షాక్ అయిన జ్యో-దశరథ ఎమోషనల్-జ్యో డౌట్ క్లియర్?

Published : Feb 25, 2026, 08:25 AM IST

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 25వ తేదీ)లో కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో దీపను అనాథ అన్న జ్యో. దీపకు అమ్మా నాన్న ఉన్నారన్న దశరథ. షాక్ అయిన జ్యో. దశరథను నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

PREV
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో చెప్పు డాడీ.. నీ కూతురు అత్త ఇంటికి కోడలు ఎలా అయింది? బావ నా మెడలో తాళి కట్టకుండా ఇది ఎలా జరిగిందని దశరథను ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. ఒకవేళ మా డాడీ కూతురు ఈ ఇంటి కోడలు కావాలంటే ఏం జరిగి ఉండాలి అనసూయ గారు అని అడుగుతుంది జ్యోత్స్న. దీప, దశరథ గారి కూతురు అయినా అయ్యి ఉండాలి. లేదా దీపను దశరథ గారు దత్తత అయినా తీసుకొని ఉండాలి అంటుంది అనసూయ. విన్నావ డాడీ. ఇప్పుడు చెప్పు నీ కూతురు అత్త కోడలు ఎలా అయింది? బావ ఓ అనాథ మెడలో తాళి కడితే అత్త కోరిక తీరినట్లు ఎలా అవుతుందని అడుగుతుంది జ్యోత్స్న.

27
దీప అనాథ కాదు..

దీప అనాథ కాదు అని గట్టిగా చెప్తాడు దశరథ. దీపకు అమ్మానాన్న ఉన్నారు. ఎక్కడో ఒక చోట బతికే ఉన్నారు అంటాడు దశరథ. షాక్ అవుతుంది జ్యోత్స్న. నా చెల్లి కోరిక ఎలా నెరవేరిందని అడిగావు కదా.. చెప్తాను ఆగు అంటాడు దశరథ. ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి మామయ్య అంటాడు కార్తీక్. మీ అమ్మానాన్న నా కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. అంటే వాళ్ల కూతురిని చెల్లి ఇంటికి కోడలిగా ఇచ్చినట్లే కదా అంటాడు కార్తీక్. మా అమ్మ కోరిక నీ కూతురిని నా ఇంటి కోడలు చేయమని... జ్యోత్స్నను చేయమని కాదు అని కౌంటర్ ఇస్తాడు కార్తీక్. మీ అమ్మానాన్న బతికే ఉన్నారని మా డాడీ అన్నాడు కదా.. ఎక్కడున్నారు? అసలు వాళ్లు ఎవరో నాకు తెలియాలి అంటుంది జ్యోత్స్న.

37
డ్రైవర్ లాగే ఉండు..

మరోవైపు సోఫాలో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది స్వప్న. కాశీ వచ్చి దిల్లు అని పిలవగానే డ్రైవర్లు, ఓనర్లను ఎలా పిలుస్తారో అలా పిలవమని అంటుంది స్వప్న. ఏదో చదువుతున్నట్లు ఉన్నావు అంటాడు కాశీ. నీ ప్రేమలో పడి చదువు వదిలేశాను. ఇప్పుడు నీ ప్రేమను వదిలేశాను. మళ్లీ చదివి మంచి డిగ్రీ సంపాదించి, బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను అంటుంది స్వప్న. బిజినెస్ చేయాలంటే ఎంతో ఓపిక ఉండాలి అది నీకు లేదు అన్నట్లు మాట్లాడుతాడు శ్రీధర్. కాశీతో నువ్వు ఇక్కడే పడుకోమని చెప్తాడు. ఎందుకు అని అడుగుతుంది స్వప్న. తను ఇక్కడ ఉండే నీకు వచ్చే సమస్య ఏంటని తెలివిగా స్వప్న నోరుమూయిస్తాడు శ్రీధర్.

47
దశరథ ఎమోషనల్

చెప్పు డాడీ దీప అమ్మనాన్న ఎవరు? ఎక్కడున్నారు అంటుంది జ్యోత్స్న. దీప అమ్మా నాన్న బ్రతికే ఉన్నారని తను నమ్ముతోంది. ఆ నమ్మకాన్ని మేము కూడా నమ్ముతున్నామని చెప్తాడు దశరథ. కుబేర ఫోటో దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటాడు. అనసూయను పిలిచి మీ తమ్ముడు దీపను ఎలా చూసుకునేవాడో నాకు చెప్తారా అని అడుగుతాడు. నా తమ్ముడికి పిల్లలు లేరు. ఒక రోజు సిటీ నుంచి వస్తుంటే.. ఎవరో బిడ్డను బస్టాండ్ లో వదిలి వెళ్లారంటా.. ఆ బిడ్డ ఏడుపు విని చేతుల్లోకి తీసుకున్నాడు.

దొరికిన బిడ్డను ఇంటికి తీసుకొచ్చి అపురూపంగా పెంచుకున్నాడు. దీప అంటే నా తమ్ముడికి ప్రాణం అని దశరథతో చెప్తుంది అనసూయ. నీ తమ్ముడు దేవుడమ్మా.. నీ తమ్ముడు బతికి ఉంటే కాళ్లు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకునేవాణ్ని అని దశరథ ఎమోషనల్ అవుతాడు. డౌటే లేదు డాడీకి నిజం తెలిసిపోయింది. తన కూతురిని కుబేర పెంచాడు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

57
దశరథ ప్రవర్తనలో ఏదో మార్పు

దశరథ నువ్వు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు అని అడుగుతాడు శివన్నారాయణ. కుబేర ఆ రోజు దీపను బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయి ఉంటే దీప మనకు దక్కేది కాదు కదా అంటాడు దశరథ. కార్తీక వచ్చి దశరథను కంట్రోల్ చేసి, బయటకు తీసుకెళ్తాడు. మమ్మీకి మెడిసిన్ ఇచ్చే టైం అయింది నేను వెళ్తున్నాను అని తాతతో చెప్పి వెళ్లిపోతుంది జ్యోత్స్న.

అన్నయ్య నాకు కొత్తగా కనిపిస్తున్నాడు నాన్న అంటుంది కాంచన. గుడికి వెళ్లి వచ్చిన దగ్గరి నుంచే దశరథ ప్రవర్తనలో మార్పు వచ్చింది అంటాడు శివన్నారాయణ. కూతురు గురించి తెలిసిన సంతోషంలో ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది దీప.

67
నిజం అందరికీ తెలియాలి

మరోవైపు నిజం చెప్పనని నీ కూతురికి మాటిచ్చావు మామయ్య అని దశరథకు గుర్తుచేస్తాడు కార్తీక్. నా మాట నేనే వెనక్తి తీసుకుంటాను. నా కూతురిని పెంచి పెద్ద చేసిన కుబేరకు చేతులు ఎత్తి నమస్కారం పెట్టడం తప్పా నేను ఏం చేయగలను అని బాధపడతాడు దశరథ. నా కూతురు ఇంకా కష్టపడటం నాకు ఇష్టం లేదురా.. అందరిని గుడ్డిగా నమ్మి.. నేనే నా కూతురిని దూరం చేసుకున్నా, కష్టాలపాలు చేశా అని అంటాడు దశరథ. కుబేర చనిపోయాక నా కూతురి జీవితం రోడ్డు మీద పడింది. అందరూ మోసం చేశారు. ఆరేళ్ల కూతురిని వదిలేసి చావలేక బతకలేక నా కూతురు ఎంత నరకం అనుభవించిందో అని ఏడుస్తాడు దశరథ.

77
జ్యోత్స్నకు అన్నీ తెలుసు

ముందు మనం అత్తను కాపాడుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఏం చెప్పిన నేను వింటాను. కొద్ది రోజులు ఈ నిజం దాచడమే మంచిది అంటాడు కార్తీక్. సుమిత్రకు ఏం కాదురా.. నేను తనతో అన్ని ఓపికగా చెప్తాను. జ్యోత్స్న దీపను అనాథ అంటుంటే, కాదు నా కూతురే అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది అంటాడు దశరథ. జ్యోత్స్న ఏం అమాయకురాలు కాదు అన్నీ తెలిసే అలా మాట్లాడుతోంది అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories