కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 24వ తేదీ)లో బిడ్డ క్షేమంగా ఉందని స్వీట్స్ పంచిన అనసూయ. జ్యో డౌట్. వీడియో ద్వారా దీపను చూపించిన పారు. కడుపులో బిడ్డ ఉందా? లేదా అన్న పారు. కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో దీప కడుపులో బిడ్డ క్షేమంగా ఉందని తెలియడంతో అనసూయ స్వీట్స్ పంచుతుంది. ఇంతలో శౌర్య స్కూల్ నుంచి వచ్చి.. అమ్మ మీరెప్పుడు వచ్చారు? బేబీ ఎలా ఉందని అడుగుతుంది. బాగుందని చెప్తుంది దీప. తర్వాత దీప నెమ్మదిగా నడుస్తుంటే దాన్ని వీడియో ద్వారా జ్యోత్స్నకు చూపిస్తుంది పారు. దీప కూడా నాలాగే ఎందుకు నడుస్తుంది అని డౌట్ పడుతుంది జ్యోత్స్న.
27
స్వప్నకు మరో పెళ్లి
మరోవైపు దాసు, శ్రీధర్ ఇంటికి వెళ్లి స్వప్న, కాశీ, కావేరీలకు స్వీట్స్ ఇస్తాడు. సుమిత్ర వదిన క్షేమంగా ఇంటికి వచ్చిందని, దీప కడుపులో బిడ్డ కూడా క్షేమంగా ఉందని చెప్తాడు. అంతా సంతోషపడతారు. అంతేకాదు ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉందని చెప్తాడు దాసు. ఏంటి మామయ్య అని అడుగుతుంది స్వప్న. నీకు మరో పెళ్లి చేయబోతున్నాము. మంచి సంబంధం చూశాము. ఆ అబ్బాయి ముందుగా నీతో మాట్లాడాలి అన్నాడు. రేపు ఇక్కడకు వస్తాడు అని చెప్తాడు దాసు. షాక్ అవుతారు అంతా. స్వప్నకు పెళ్లి ఏంటి నాన్న అంటాడు కాశీ. నువ్వు సైలెంట్ గా ఉండు అంటాడు దాసు. నువ్వు రెడీగా ఉండమని స్వప్నతో చెప్తాడు.
37
దొరికిపోయిన పారు
మరోవైపు వీడియో క్వాలిటీ బాగా వచ్చిందా అని జ్యోత్స్నను అడుగుతుంది పారు. అంతలో శివన్నారాయణ అక్కడికి వస్తాడు. షాక్ అవుతుంది పారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది పారు. వాళ్ల గొంతు విని కార్తీక్ బయటకు వస్తాడు. ఏంటీ పారు చాటుగా నిలబడి వీడియో తీస్తున్నావా అని అడుగుతాడు కార్తీక్. నేనెందుకు వీడియో తీస్తాను అంటుంది పారు. ముగ్గురూ లోపలికి వెళ్తారు.
దీప కడుపులో బిడ్డ క్షేమంగా ఉందని తెలిసి సంతోషిస్తాడు శివన్నారాయణ. ఇటు రా దీప అని దీపను చేయిపట్టి లాగుతుంది పారు. అమ్మా అని అరుస్తుంది దీప. మనిషిని చూస్తే అర్థం కావడం లేదా నీరసంగా ఉందని అంటాడు కార్తీక్. బిడ్డ క్షేమంగా ఉంటే దీప ఎందుకు నీరసంగా ఉంది? తనకు ఆపరేషన్ కాలేదు కదా? ఒకవేళ బిడ్డను వదిలించుకున్నా కూడా ఉందని అబద్ధం చెప్తున్నారా అని అడుగుతుంది పారు. దాంతో అందరికీ మళ్లీ అనుమానం మొదలవుతుంది.
అంతా దీప, కార్తీక్ లను నిలదీస్తారు. దీప నీరసంగా ఉంది నిజమే, కానీ బిడ్డ క్షేమంగానే ఉంది. మేము ఆపరేషన్ కి వెళ్లేటప్పుడు దీప కింద పడిందని అబద్ధం చెప్తాడు కార్తీక్. ఆ తర్వాతే మేము బిడ్డను వద్దనుకునే నిర్ణయం మార్చుకున్నామని కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు కార్తీక్.
57
జ్యోత్స్న అనుమానం
మరోవైపు నేనే సుమిత్ర కూతురు అయితే దీప ఎందుకు అలా నడుస్తోంది. నా వెనకాల ఏం జరిగింది? అయినా నా జాగ్రత్తలో నేను ఉన్నాను. నిజాలు ఎలా తేల్చాలో నాకు తెలుసు అని ఎవరికో కాల్ చేసి రిపోర్ట్స్ రెడీ అయ్యాయా అని అడుగుతుంది. రెడీ అవుతున్నాయని అవతలి వ్యక్తి చెప్తాడు. రిపోర్ట్స్ వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. సుమిత్ర కూతురు ఎవరో అని అనుకుంటుంది జ్యోత్స్న.
67
నిజంగా కాపలా కాశావా?
తర్వాత పారు, జ్యోత్స్న దగ్గరికి వచ్చి నీ అనుమానాలన్నీ తీరాయా అని అడుగుతుంది. నాకు ఏ అనుమానం లేదు అంటుంది జ్యోత్స్న. నీకు ఏ అనుమానం లేకపోతే దీప దగ్గరికి నన్ను ఎందుకు పంపిస్తావు అంటుంది పారు. నిజం చెప్పు, నువ్వు దీప గది ముందు నిజంగా కాపలా కాశావా? నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు అంటుంది జ్యోత్స్న. 5 నిమిషాలు పక్కకుపోయాను అంతే అంటుంది పారు. జీవితాలు మారిపోవడానికి ఆ 5 నిమిషాలు చాలు అంటుంది జ్యోత్స్న.
77
జ్యో గురించే నా భయం
మరోవైపు దీప, కార్తీక్ లు మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న గురించే నా భయం. తన డౌట్ ఇంకా పోలేదు అంటుంది దీప. తను సుమిత్ర కూతురు అనే అనుకుంటోంది, మన బిడ్డ ఆయుష్షు గట్టిగా ఉంది. ఇక ఆ బిడ్డను భూమి మీదకు రాకుండా ఎవరు ఆపలేరు. నువ్వు దేని గురించి ఆలోచించకు, హ్యాపీగా ఉండు అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.