కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోను మంచిదానిలా నటించమన్న పారు- సుమిత్ర, దశరథలకు కార్తీక్ సర్‌‌ప్రైజ్

Published : Nov 01, 2025, 08:01 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 1వ తేదీ)లో నాకు ఎవ్వరిమీద ప్రేమ లేదంటుంది జ్యోత్స్న. మంచిదానిలా నటించు చాలు అంటుంది పారు. దీప లేకపోతే నా శవం చూడాల్సి వచ్చేది అంటుంది సుమిత్ర. అత్తమామలకు సర్ ప్రైజ్ ఇస్తాడు కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

PREV
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావా అంటుంది జ్యోత్స్న. ఏంటి చేసేది గాడిద గుడ్డు అంటుంది పారు. మీ అత్త ఇంటికి పోలీసులను తీసుకెళ్తావా అంటుంది పారు. తాత వంతు అయిపోయింది. నువ్వు స్టార్ట్ చేశావా అంటుంది జ్యోత్స్న. నీకు దీపపై అనుమానం వస్తే నాకు చెప్పాలి కదా అంటుంది పారు. చెప్తే ఏం చేసేదానివి అంటుంది జ్యోత్స్న. అది మనకు ఎలా ఉపయోగపడేదో ఆలోచించేదాన్ని అంటుంది పారు. 

సరే అవన్నీ వదిలేయ్ కిందికి వెళ్దాం పదా అంటుంది పారు. నేను రాను అంటుంది జ్యోత్స్న. మీ మమ్మీ వచ్చిందే మాట్లాడవా.. నువ్వు ఇలా వచ్చేస్తే తను ఏమనుకుంటుంది అంటుంది పారు. నాకు ఎవరిమీద ప్రేమ లేదు. నేను రాను అంటుంది జ్యోత్స్న. ప్రేమ లేకపోయినా సరే.. మంచిదానిలా నటించు. ఇప్పుడు నువ్వు మీ అమ్మను గుండెలకు హత్తుకొని ఏడిస్తే.. నువ్వు చేసిన తప్పులన్నీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అంతా మరిచిపోతారు అంటుంది పారు. పదా నేను కింద ఒక డ్రామా స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఇద్దరు కిందికి వెళ్తారు.

27
ఆ ఇంటికి మనం ఎందుకు వెళ్లకూడదు?

మరోవైపు సుమిత్ర అత్తకోసం నాన్న, అన్నయ్య ఎక్కడ వెతుకుతున్నారో అంటూ ఫోన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది స్వప్న. ఏమైంది ఎందుకంత సంతోషంగా ఉన్నావని అడుగుతుంది కావేరి. అత్త ఇంటికి వచ్చిందట మమ్మీ.. ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారట అని చెప్తుంది స్వప్న. అవునా అంటూ వస్తాడు కాశీ. మనం కూడా వెళ్దాం అంటాడు. వద్దు అంటుంది కావేరి. ఎందుకమ్మా మనం కూడా ఆ ఫ్యామిలీనే కదా.. ఎందుకు వెళ్లొద్దు అని అడుగుతుంది స్వప్న. ఎవరైనా పిలిస్తేనే వెళ్లడానికి ఆలోచిస్తాం. అలాంటిది పిలువకుండా ఎలా? వద్దు అంటుంది కావేరి.

డాడీ నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గరినుంచి నువ్వు చాటుగానే ఉంటున్నావు. డాడీ ఆ ఫ్యామిలీకి ఇచ్చిన ప్రాధాన్యం ఈ ఫ్యామిలీకి ఇవ్వరు ఎందుకమ్మ అంటుంది స్వప్న. మీ నాన్నకు భార్యా, కొడుకు ఉన్నారని తెలిసినా నేను పెళ్లి చేసుకున్నాను. కానీ కాంచన అక్క అలా కాదు. ఇంకో ఆడదానికి అన్యాయం జరగొద్దని తన భర్తనే నాకు ఇచ్చేసింది. అలాంటి మనిషి కోసం ఏమైనా చేయొచ్చు తప్పులేదు అంటుంది కావేరి. నాకు తెలుసమ్మా.. నేను నువ్వు ఏం చెప్తావో చూడాలనే అన్నాను. నాకు కూడా వెళ్లాలని లేదు. కానీ అన్నయ్య మెసేజ్ చేశాడు. రాలేమని చెప్పేశాను అంటుంది స్వప్న.

37
పారు డ్రామా

కిందికి వచ్చి డ్రామా స్టార్ట్ చేస్తుంది పారు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దగ్గరినుంచి నీ కూతురు సరిగ్గా తిన్నదే లేదు. ఏడుస్తూనే ఉంది. నీకోసం వెతుకుతాను అంటే వాళ్ల తాత వద్దన్నాడు. ఏం చేయాలో తెలియక వాళ్ల నాన్నమ్మ ఫోటో దగ్గరికి వెళ్లి మా మమ్మీ క్షేమంగా రావాలని దండం పెట్టుకునేది అని చెప్తుంది పారు. పక్కనుంచి సెటైర్లు వేస్తుంటాడు కార్తీక్. ఇప్పుడు కూడా పైకి వెళ్లి వాళ్ల నానమ్మ ఫోటోకు థాంక్స్ చెప్తుంటే... అని ఏదో చెప్పబోతుంది పారు. నువ్వు వెళ్లి తీసుకొచ్చావు కదా అంటాడు కార్తీక్. నీకెలా తెలుసురా.. చూసినట్లే చెప్తున్నావు అంటుంది పారు. చూడకపోయినా కొన్ని విషయాలు తెలుస్తాయి పారు అంటాడు కార్తీక్.

47
చనిపోవడానికి వెళ్లాను

అసలు ఈ రెండు రోజులు నువ్వు ఎక్కడికి వెళ్లావు చెల్లెమ్మ అని అడుగుతాడు శ్రీధర్. నేను చనిపోవడానికే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాను అంటుంది సుమిత్ర. అందరూ షాక్ అవుతారు. నేను వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు నా నగలపై ఆశపడ్డారు. వారు నాపై దాడి చేసే సమయంలో దీప నన్ను కాపాడింది. ఆ రోజు దీప కాపాడి ఇంటికి తీసుకెళ్లకపోతే మీరు నా శవాన్ని చూడాల్సి వచ్చేది అంటుంది సుమిత్ర. వదినా నువ్వు అలా మాట్లాడకు అంటుంది కాంచన. ఉన్నదే చెప్తున్నాను అంటుంది సుమిత్ర.

57
అందుకే పోలీసులను తీసుకెళ్లాను

ఇప్పుడు అర్థమైందా తాత. దీపను నేను ఎందుకు అరెస్ట్ చేయించాలి అనుకున్నానో అంటుంది జ్యోత్స్న ఆవేశంగా. మమ్మీని ఇంట్లోనే పెట్టుకొని నేను వెళ్లినప్పుడు కనిపించకుండా చేశారు. పైగా వెతుకుతున్నట్లు నాటకమాడారు అంటుంది జ్యోత్స్న. దీప నన్ను దాచిపెట్టిందని నేను చెప్పానా జ్యోత్స్న అంటుంది సుమిత్ర. 

మరి నిన్ను ఇంట్లోనే పెట్టుకొని మాతో ఎందుకు చెప్పలేదు అంటుంది జ్యోత్స్న. దానికి కారణం నేనే. దీప దగ్గర నేను మాట తీసుకున్నాను. నా గురించి ఆ ఇంట్లో చెప్తే.. నా శవాన్ని చూడాల్సి వస్తుందని బెదిరించాను. దీప అన్నింటిని మౌనంగా భరించింది. మంచి చేసి కూడా మీ ముందు దోషిలా నిలబడింది. అది నాకు ఇష్టం లేదు. మీరు దీపను ఏం అనవద్దు. ఏమైనా అనాలి అనుకుంటే నన్ను అనండి అంటుంది సుమిత్ర. 

అందుకేనా ఆ రోజు నన్ను బయటి నుంచి బయటికే పంపించారు అంటాడు శ్రీధర్. అవునంటాడు కార్తీక్. అర్థమైంది కదా జ్యోత్స్న. నా భార్యపై కేసు పెట్టినందుకు ఇప్పుడు సారీ చెప్పు అంటాడు శ్రీధర్.  

67
క్రిడిట్ మొత్తం మీ మనుమరాలిదే

సారీలు ఎందుకులే మాస్టారు అంటాడు కార్తీక్. ఒకప్పుడు అత్తను కాపాడే సమయంలో దీప తలకు గాయమైంది. అత్త దీపను చేరదీసింది. ఆశ్రయమిచ్చింది. కూతురిలా ఆదరించింది. ఇప్పుడు అత్త తలకు గాయమైంది. దీప చేరదీసింది. కంటికి రెప్పలా చూసుకుంది. తన రుణాన్ని ఇలా తీర్చుకుంది అంటాడు కార్తీక్. ఏది ఏమైనా నీకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పాలిరా అంటాడు శివన్నారాయణ. 

నాదేం లేదు. క్రెడిట్ మొత్తం మీ మనుమరాలిదే తాత అంటాడు కార్తీక్. నేనేం చేశాను అంటుంది జ్యోత్స్న. నువ్వు కాదు దీప చేసింది అంటాడు కార్తీక్. నువ్వు మనుమడివైనంత మాత్రాన దీప మనుమరాలు అవుతుందా? అంటుంది పారు. నిన్ను మా తాత పెళ్లి చేసుకుంటే నువ్వు మాకు అమ్మమ్మ కాలేదా అంటాడు కార్తీక్. సరే భోజనం చేద్దాం పదండి అంటాడు శివన్నారాయణ.

77
సుమిత్ర, దశరథలకు కార్తీక్ సర్ ప్రైజ్

అంతకంటే ముందు మనం ఒక పని చేయాలి అంటాడు కార్తీక్. ఏంటని అడుగుతారు అంతా. అత్తయ్య, మామయ్యలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాలి అంటాడు కార్తీక్. అందరూ చెప్పబోతుండగా ఇంత సింపుల్ గా కాదు. నేనొక ప్లాన్ చేశాను.. మీరు పట్టుబట్టలతో రావాలని అత్తమామలకు చెప్తాడు. వాళ్లు తయారై వచ్చాక వారితో కేక్ కట్ చేయిస్తాడు. అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మామయ్య అంటే కార్తీక్ కి ఎంత ఇష్టమో అంటాడు శివన్నారాయణ. ఇవన్నీ వాడు నాకోసం చేయట్లేదు. వాళ్ల అత్తకోసం చేస్తున్నాడు అంటాడు దశరథ. చిన్నప్పుడు నేను అత్త దగ్గరే పెరిగాను. కన్నతల్లినే మర్చిపోయేంత  ప్రేమనిచ్చిన మా అత్తకు నేను ఎంతో రుణపడిపోయాను అని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories