66 ఏళ్ల నాగార్జునతో రొమాన్స్ కు.. రెడీ అంటోన్న 50 ఏళ్ల హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Oct 31, 2025, 02:20 PM IST

66 ఏళ్ల నాగార్జునతో రొమాన్స్ కు రెడీ అంటోంది 50 ఏళ్ల హీరోయిన్. టాలీవుడ్ మన్మధుడు తన ఫస్ట్ క్రష్ అంటోంది బ్యూటీ. ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే అస్సలు వదలుకోను అంటున్న సీనియర్ బ్యూటీ ఎవరు?

PREV
16
66 ఏళ్ల మన్మధుడు

66 ఏళ్ళ వయసులో కూడా కింగ్ నాగార్జున క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. యంత్ హీరోలకు కూడా షాక్ ఇస్తూ.. దూసుకుపోతున్నాడు మన్మధుడు. ఈ వయస్సులో కూడా అమ్మాయిల మనసు దోచుకుంటున్నాడు నాగార్జున. ఫిట్ నెస్ విషయంలో కానీ, గ్లామర్ విషయంలో కానీ.. తగ్గేదేలేదంటున్నాడు కింగ్. ఈక్రమంలో నాగార్జున మీద క్రష్ ఉన్న హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. ఆయనతో సినిమా అంటే.. ఇప్పటికీ సై అంటున్నారు. ఇక 50 ఏళ్ళ వయసులో కూడా ఓ హీరోయిన్ నాగార్జునతో రొమాంటిక్ సీన్లు చేయడానికి రెడీ అంటోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? నాగార్జునతో ఒక సినిమాలో నటించిన కస్తూరి.

26
నాగార్జునపై క్రష్ ఉందన్న హీరోయిన్

సీనియర్ నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలలో మెరిసింది. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ.. ఎక్కువగా బుల్లితెర కార్యక్రమాల్లలో కనిపిస్తోంది. సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. కెరీర్ లో బిజీగా కొనసాగుతుంది కస్తూరి. అప్పుడప్పుడు ఏదో ఒక కామెంట్ చేసి.. కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేస్తోంది సీనియర్ నటి. 50 ఏళ్లు దాటిన ఈనటి ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయింటేన్ చేస్తోంది. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న కస్తూరి.. కింగ్ నాగార్జునపై తనకున్న క్రష్ ను నిస్సంకోచంగా బయటపెట్టారు. నాగార్జునపై కస్తూరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

36
రెండు రోజులు చేయి కడగలేదు..

కస్తూరి మాట్లాడుతూ, “నేను చదువుకునే రోజుల్లోనే నాగార్జున అంటే విపరీతమైన ఇష్టం ఉండేది. అది ఇప్పటికీ అలాగే కొనసనాగుతోంది. ఆయన సినిమాలు మిస్ కాకుండా చూసేదాన్ని. నేను స్కూల్ లో ఉన్నప్పుడు యాంకరింగ్ చేసేదాన్ని. అప్పుడు గీతాంజలి క్రేజ్ బాగా ఉండేది. ఒకసారి ఆయన్ను కలిసే అవకాశం దొరికింది. ఆయన్ను కలిసినప్పుడు.. నేను వేసుకున్న డ్రెస్, ఆయన వేసుకున్న షర్ట్ కలర్ కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. నాగార్జునతో షేక్‌హ్యాండ్ దొరికింది. అది నా జీవితంలో మర్చిపోలేను.. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత, ఆ చేయిని రెండు రోజుల పాటు కడగలేదు. ‘ఇది నాగార్జున టచ్ చేసిన చేయి’ అంటూ నా స్నేహితులందరికీ చూపించి ఆనందపడ్డాను,” అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు కస్తూరి.

46
నాగార్జునతో రొమాన్స్ కు రెడీ..

కస్తూరి మాట్లాడుతూ.. “మా జనరేషన్‌కి నాగార్జున కేవలం ఒక హీరో మాత్రమే కాదు, చాలామంది అమ్మాయిలకు ఒక పెద్ద క్రష్‌. ఆయన యంగ్ లుక్‌, చార్మ్‌ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వయసు పెరిగినా ఆయనలో ఉన్నఅట్రాక్షన్ మాత్రం అస్సలు తగ్గలేదు,” అంటూ నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించింది కస్తూరి. అంతే కాదు ఆయనతో రొమాంటిక్ సీన్స్ చేయడానికి అవకాశం వస్తే చేస్తారా అని యాంకర్ అడిగని ప్రశ్నకు.. '‘నాగార్జున తో రొమాంటిక్ సీన్‌ అది బెస్ట్ థింగ్. అలాంటి అవకాశం వస్తే వదులుకుంటానా? ఆయన చాలా ప్రొఫెషనల్‌, జెంటిల్మెన్‌. ఆయనతో నటించడం ఏ హీరోయిన్‌ అయినా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. అందుకు నేను ఎప్పుడైనా సిద్ధమే,’” అని అన్నారు.

56
వైరల్ అవుతున్న కస్తూరి కామెంట్స్

నాగార్జున పై కస్తూరి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు “ఇది నిజమైన ఫ్యాన్ మూమెంట్‌”, “నాగార్జున మ్యాజిక్‌ ఇప్పటికీ అలాగే ఉంది” అంటూ కామెంట్ చేస్తున్నారు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన కస్తూరి.. తెలుగులో మాత్రం చాలా తక్కువ సినిమాలు చేసింది. నాగార్జునతో ఆమె అన్నమయ్య సినిమాలో నటించింది. 

66
నాగార్జునతో ఒక సినిమాలో

కస్తూరి తెలుగు కన్నా.. తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ..పొలిటికల్ గా యాక్టీవ్ గా ఉంది. కాంట్రవర్షియల్ కామెంట్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది కస్తూరి.

Read more Photos on
click me!

Recommended Stories