ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఒక సరికొత్త కెరటంలా దూసుకొచ్చాడు మెగాస్టర్ చిరంజీవి. అప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలను తన దూకుడుతో భయపెట్టాడు. చిరంజీవి వల్ల కాస్త టెన్షన్ పడ్డ హీరోలు ఎవరు?
ఏదో ఒక చిన్న పాత్ర ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి..ఆ తరువాత సంచలనంగా మారిన హీరో మెగాస్టార్ చిరంజీవి. విలన్ గా ఒక సినిమాలో నటించి, చిన్నగా హీరో అవతారం ఎత్తాడు చిరంజీవి. కాస్త పాపులారిటీ రాగానే.. అందరికంటే ప్రత్యేకంగా తనను తాను చూపించుకుని, ఇండస్ట్రీలో ఎదుగుతూ వచ్చాడు. సినిమాల్లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన కొణిదెల శివవంకరవరప్రసాద్.. సుప్రీం హీరోగా, మెగాస్టార్ చరిత్ర సృష్టించాడు. అప్పటి వరకూ ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న కృష్ణకు కూడా చిరంజీవి షాక్ ఇచ్చాడు.
25
చిరంజీవి కొత్తగా చూపించిన టాలెంట్..
చిరంజీవి ఇండస్ట్రీలో ఎదగడానికి ఆయన టాలెంట్ కారణం. ఆడియన్స్ పల్స్ పట్టుకుని దూసుకుపోయాడు చిరు. మరీ ముఖ్యంగా అప్పటి వరకూ టాలీవుడ్ లో డాన్స్ అద్భుతంగా చేయగల హీరో లేడు. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా లేవు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల ఫైట్లు డిఫరెంట్ గా ఉండేవి. డాన్స్ విషయంలో అక్కినేని నాగేశ్వరావు కాస్త ముందడుగు వేస్తే.. దాన్ని పీక్స్ లోకి తీసుకెళ్లారు మెగాస్టార్. మైఖేల్ జాక్సన్ స్టెప్పులను తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేసింది చిరంజీవే. అంతే కాదు యాక్షన్ సీన్స్ లో కొత్త ఒరవడి సృస్టించిన హీరోగా కూడా చిరంజీవి సక్సెస్ అయ్యాడు. అటు డాన్స్ దుమ్మురేపుతూ.. ఇటు ఫైట్స్ ను కూడా దంచికొట్టాడు చిరంజీవి. చాలా తక్కువ టైమ్ లోనే సుప్రీం హీరోగా టాలీవుడ్ లో ఎదిగాడు. బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ వారసులు ఇండస్ట్రీలో ఉన్నా.. తన మార్క్ ను ప్రత్యేకంగా చూపించుకోగలిగాడు చిరంజీవి.
35
స్టార్ హీరోలను భయపెట్టిన మెగాస్టార్
చిరంజీవి 80 వ దశకంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి హీరోలు మంచి ఫామ్ లో ఉన్నారు. ఎవరికి తగ్గ సినిమాలు వారు చేసుకుంటున్నారు. కృష్ణ తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాలకు పెట్టింది పేరు. యాక్షన్ సీక్వెన్స్ లు మొదలు పెట్టింది కూడా కృష్ణనే. డూప్ లేకుండా ఫైట్లు చేసేవారు కృష్ణ. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఊపు నడిచే టైమ్ లో.. ఖైదీ లాంటి సినిమాలతో చిరంజీవి కెరటంలా వచ్చి విజృంబించాడు. చిరంజీవి, డాన్స్, ఫైట్లు.. టోటల్ గా ఆయన దూకుడు చూసి కృష్ణ ఆలోచనలో పడ్డాడట. కృష్ణతో పాటు ఇతర హీరోలు కూడా కాస్త టెన్షన్ పడ్డారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ వెల్లడించారు. ఆ డాన్స్ లు, ఫైట్ లు, ఎమోషనల్ గాచిరంజీవి చూపించే యాక్టింగ్ ఆయన్ను ఈస్థాయిలో నిలబెట్టిందని మురళీ మోహన్ అన్నారు.
ఇక చిరంజీవి దూకుడు తట్టుకోడానికి కృష్ణ మరో ప్రయోగం చేశాడు. భారీ బడ్జెట్ తో, తానే స్వయంగా డైరెక్ట్ చేస్తూ, నిర్మించి, డబుల్ రోల్ చేస్తూ.. సింహాసనం సినిమాను తెరకెక్కించారు. ఈసినిమా ఆ కాలంలో చరిత్ర సృస్టించింది. కృష్ణకు మరో పదేల్లు తిరుగులేని కెరీర్ ను అందించింది. కానీ అటు చిరంజీవి దూకుడు మాత్రం అలానే కొనసాగింది.
55
మెగాస్టార్ చిరంజీవి సినిమాలు
ఒక్క సారి అలా స్టార్ట్ అయిన చిరంజీవి కెరీర్.. నిర్విరామంగా దూసుకుపోయింది. మధ్య మధ్యలో చిన్నా చితకా ప్లాప్ లు వచ్చినా.. మెగాస్టార్ చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్లు, బ్లాక్ బస్టర్స్ గా నిలిచినవే. ఒక్క కోదండరామిరెడ్డి డైరెక్షన్ లోనే 23 సినిమాలు చేశారు చిరంజీవి. ఆయన కెరీర్ ను నిలబెట్టింది కూడా ఆ దర్శకుడే. చిరంజీవి డాన్స్, గ్రేస్, ఇప్పటికీ 70 ఏళ్ళ వయస్సులో కూడా కొనసాగుతోంది. 156 సినిమాలు కంప్లీట్ చేసినా.. ఆయన జోష్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్న చిరంజీవి.. అనిల్ రావిపూడితో మన శంకరవరప్రసాదు గారు మూవీ చేస్తున్నాడు. ఈసినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇది కాకుండా బాబీ డైరెక్షన్ లో మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.