Karthika Deepam 2 Today Episode : బాంబ్ పేల్చిన దాసు, షాక్ లో శివన్నారాయణ ఫ్యామిలీ, జ్యో రహస్యం బయటపడిందా ?

Published : Jan 14, 2026, 09:12 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 14వ తేదీ)లో జ్యో మీద కాంచనకి అనుమానం వస్తుంది. అసులు ఆమె సుమిత్ర కన్నకూతురేనా అని కార్తీక్ ను అడుగుతుంది. మరో వైపు జ్యో కుట్రలకు ఎండ్ కార్డ్ వేయాలని దాసు ప్రయత్నిస్తుంటారు. మొత్తానికి అసలు నిజం బయటపడిందా?  

PREV
16
జ్యోత్స్న మీద కాంచనకు అనుమానం..

అసలు జ్యోత్స్న మా అన్న,వదినల కూతురేనా అని అనుమానపడుతుంది కాంచన. ఆ ఇద్దరి పోలికలు ఆమెలో లేవు, తల్లికి అలా ఉంటే కొంచెం కూడా బాధలేదు. ఎవరైనా కొత్తవాళ్లు చూస్తే దీపనే సుమిత్ర కన్న కూతురు అనుకుంటారు. ఆ బాధ జ్యోత్స్నకు లేదు. నాకెక్కడో అనుమానంగానే ఉందిరా... అని కాంచన కార్తీక్ తో అంటుంది. ఇంకా వదినకు నిజం చెప్పలేవు కదా అని అడగుతుంది కాంచన. లేదమ్మ రేపు చెప్పాలి అంటాడు కార్తీక్. దీప నువ్వు కూడా ప్రిపేర్ గా ఉండు.. అత్తకు నిజం చెప్పినప్పుడు నువ్వు ఏడిస్తే ఇబ్బంది అవుతుంది. అత్తను కంట్రోల్ చేయలేము అంటాడు కార్తీక్.

26
కాశీని మరోసారి మాయ చేసిన జ్యోత్స్న

మరోవైపు కాశీని కలిసి.. మాయమాటలు చెపుతుంటుంది జ్యోత్స్న. తమ్ముడు నాకు చాలా బాధగా ఉందిరా అంటూ నటిస్తుంటుంది. కానీ కాశీ మాత్రం జ్యోపై కోపంగా ఉంటాడు. నన్ను చాలా ప్లాన్డ్ గా కేసులో ఇరికించి నువ్వు మాత్రం సైడ్ అయిపోయావ్ కదా అంటాడు. నేనేం చేశాను రా.. అంతా వైరా కదా చేసింది అని జ్యో అంటుంది. నువ్వు చెప్పకుండానే వైరా ఫుడ్ కల్తీ చేస్తాడా? అని కాశీ రివర్స్ లో ప్రశ్నిస్తాడు. మరి అంతా తెలిసి నువ్వు ఎందుకు మీడియా ముందు చెప్పలేదని జ్యోత్స్న అడుగుతుంది. నీ పేరు చెప్పినా నాకు శిక్ష తప్పదు. అదే చెప్పకుండా ఉంటే నా కోసం నిలబడతావని అనుకున్నా. కానీ ఇలా హ్యాండిస్తావని అనుకోలేదు అంటాడు కాశీ.

ఎవర్రా వదిలేసింది.. నేనా నువ్వా.. ఆఫీస్ లో స్కామ్ చేసిన ఫైల్స్ నాకు ఇవ్వమంటే సర్ ప్రైజ్ ఇస్తా అన్నావ్. నువ్వు మీ బావ ముందు నోరు జారకుండా ఉండుంటే.. కంపెనీకి నువ్వే జీఎంగా ఉండేవాడివి. అసలు నీకు బెయిట్ ఎలా వచ్చింది అనుకుంటున్నావు.. అని జ్యో అడుగుతుంది. మా మామగారు ఇచ్చారు అని కాశీ అంటాడు. కాదు మా తాతతో మాట్లాడి నీకు కోర్టు బెయిల్ ఇప్పించింది నేనే అంటుంది జ్యోత్స్న. నమ్మమంటావా.. అని కాశీ అడుగుతాడు.. నమ్మాలి తమ్ముడు. కావాలంటే మీ మామయ్య అడుగు అని జ్యో అబద్ధం చెప్తుంది. తన భార్య గురించి బాధపడుతుంటాడు కాశీ..

36
జ్యో కి షాక్ ఇచ్చిన కాశీ..

వదిలేయ్ రా తమ్ముడు.. నీకేం తక్కువ. ఈ కేసు నుంచి బయటపడ్డాక మనమే ఓ రెస్టారెంట్ పెడదాం.. న్వవే సీఈవో అని ప్రేమగా మాట్లాడుతూనే.. ఫైల్స్ ఎక్కడున్నాయని జ్యోత్స్న అడుగుతుంది. ఇంకెక్కడి ఎవిడెన్స్.. మామయ్యకు దొరికిపోయాయి కదా అని కాశీ అంటాడు. జ్యోత్స్న కు భూమి కంపించినంత పని అవుతుంది. ఇంత పెద్ద విషయం అంత చిన్నగా చెపుతున్నావేరా.. అని జ్యో టెన్షన్ పడుతూ ఉంటుంది. భయపడకు అక్కా.. బయటపెట్టేవాళ్లే అయితే.. ఇప్పటికే ఏదో ఒకటి చేసేవాళ్లు కదా.. రిలాక్స్ గా ఉండమని కాశీ చెప్తాడు. మన విషయాలు బావకు చెప్పకు. నీకు మళ్లీ పెళ్లి చేస్తానని జ్యో అంటుంది.

46
అసలు నిజం తెలుసుకున్న దాసు..

జ్యోత్స్న, కాశీ మాటలన్నీ దాసు వింటాడు. కాశీ మీద అనుమానంతోనే కొడుకుని ఫాలో అవుతూ వస్తాడు దాసు. జ్యో వెళ్లగానే కోపంగా వచ్చి కాశీ చెంప చెళ్లుమనిపిస్తాడు దాసు. తోడేళ్లతో స్నేహం చేసి నువ్వు ఓ గుంటనక్కలా తయారయ్యావ్. జ్యోత్స్న నిన్ను అవసరానికి వాడుకుంటుంది. ఈ కేసులో నిన్ను ఇరికించింది కూడా ఆమెనే. అమెను నమ్మి మోసపోతున్నావు రా అని కొడుకి నచ్చచెపుతాడు దాసు. కానీ తండ్రి మాటలు కాశీ లెక్క చేయడు. నువ్వు కుటుంబాన్ని పట్టించుకుని ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా అంటాడు. చేతగాని తండ్రి చెపితే వినాల్సిన అవసరం లేదు అంటాడు కాశీ. 

జ్యోత్స్న గురించి శివన్నారాయణ దగ్గర నిజం చెప్పమని దాసు అంటాడు. నీలాంటి చేతగాని తండ్రి సహాయం నాకు అవసరం లేదు. నాకో అక్క పుట్టి చచ్చిపోయిందని చెప్తుంటావ్ కదా. నీలాంటి వాడికి కూతురుగా ఉండటం కంటే చావడం మంచిదని ఆమె చనిపోయి ఉంటుంది అని తండ్రిని అవమానించేలా మాట్లాడుతాడు కాశీ. ఇన్నాళ్లు మమ్మల్ని పట్టించుకోలేదు.. ఇప్పుడు కూడా అలాగే ఉండు. నీ బతుకు నువ్వు బతుకు. నా బతుకు నేను బతుకుతాను.. నా కంటికి జ్యోత్స్న అక్క తప్ప ఎవరూ కరెక్ట్ గా కనిపించడం లేదని చెప్పి కాశీ వెళ్లిపోతాడు.

56
దాసు కాళ్లు పట్టుకుని జ్యో ప్రయత్నం..

ఇదంతా చూసిన దాసుకు ముందున్న ప్రమాదం కనిపిస్తుంది. ఇక ఆలస్యం చేస్తే.. మొదటికే మొసం వస్తుందని.. కార్తీక్ కు కాల్ చేస్తాడు. నేనిచ్చిన మాటకు కట్టుబడి ఉండలేను. జ్యోత్స్న నా కూతురే అన్న నిజాన్ని శివ నారాయణతో చెప్పేస్తానని దాసు కార్తీక్ తో అంటాడు. ఇక వాళ్లను క్షమించడం నా వల్ల కాదంటాడు. ఇది టైమ్ కాదని కార్తీక్ చెప్పినా దాసు వినకుండా కాల్ కట్ చేస్తాడు. కార్తీక్ దగ్గరకు వెళ్తే.. ఆపడానికి ప్రయత్నిస్తాడు.. ఇప్పుడే ఈ నిజం వాళ్లకు తెలియాల్సిందే అని వెంటనే దాసు శివన్నారాయణ ఇంటికి బయలుదేరుతాడు. 

కానీ మధ్యలో జ్యోత్స్న తండ్రిని అడ్డుకుంటుంది. ఏంటి నాన్న నిజం చెప్పడానికి వచ్చావా? అని అడుగుతుంది. నీకెలా తెలుసు అని దాసు అడుగుతాడు. నేను తెలివైనదాన్ని.. నువ్వు కాశీతో మాట్లాడటం చూశానని చెప్తుంది. తండ్రినే చంపాలనుకున్నదానివి, తమ్ముడిని వదులుతావా.. నీకు మనుషులు అవసరం లేదు.. సొంత వాళ్లను కూడా వస్తువుల్వా వాడుకుంటున్నావు, వాడిని ఒక ఆయుధంలా తయారు చేసి పాడు చేస్తున్నావని.. జ్యో పై ఫైర్ అవుతాడు దాసు. 

నీలాంటి పాపాత్మురాలు ఈ ఇంటి వారసురాలిగా ఉండటానికి పనికిరాదు. అందుకే ఇప్పుడే నిజం చెప్పాలని వచ్చానని దాసు అంటాడు. నువ్వు నిజం చెప్పావంటే నేను చస్తానని జ్యో బెదిరిస్తుంది. అందరిని చంపాలని చూసే నువ్వు.. చస్తాను అంటే నమ్మమంటావా.. ఆ పని నువ్వు చేయలేవు.. నిన్ను నువ్వు ఏం చేసుకోలేవు అంటాడు. దాసు కాళ్లు పట్టుకుంటుంది జ్యో.. నిజం చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ దాసు వినిపించుకోకుండా.. ఇంట్లోకి వెళ్లి అందరినీ పిలుస్తాడు.

66
బాంబ్ పేల్చిన దాసు, రహస్యం బయటపడిందా?

ఇంట్లోకి వెళ్లి వదినా అని గట్టిగా పిలుస్తాడు దాసు. అందరు వస్తారు. నీకు ఇంత పెద్ద వ్యాధి వచ్చిందని బాధపడాలో లేక నీకు మంచి జరుగుతుందని ఆనందపడాలో అర్థం కావడం లేదు వదినా. కొన్నేళ్ల క్రితం అన్యాయం జరిగింది అంటాడు దాసు.. నాకు కూతురు పుట్టినప్పుడే సైదులు గాడు చచ్చిపోయాడు. ఈ ఇంటి వారసురాలు చావు నుంచి తప్పించుకుని బతికి దూరంగా వెళ్లిపోయింది అని అంటాడు. నా కూతురు నా కళ్ల ముందే ఉంది కదా అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న నీ కూతురు కాదు అని షాకింగ్ విషయం బయటపడతాడు దాసు. మరి ఆమె ఎవరి కూతురు అని దాసు అన్న అడుగుతాడు.. జ్యోత్స్న నా కూతురని నిజం చెప్పేస్తాడు దాసు. దాంతో ఈ రోజు కార్తీక దీపం ఎపిసోడ్ ముగుస్తుంది. అసలు ఇదంతా నిజమేనా..? అసలు విషయం బయటపడిందా? లేక ఎవరైనా ఇది కలకంటున్నారా అనేది.. రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories