Karthika Deepam 2 Today Episode: దశరథ, కాంచనల మధ్య దూరం పెంచిన పారు- కాంచన ఎమోషనల్-నోరు జారిన జ్యో

Published : Mar 14, 2026, 08:06 AM IST

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 14వ తేదీ)లో దశరథకు నిజం ముందే తెలుసన్న పారు. దశరథను అసహ్యించుకున్న కాంచన. అందరూ తనని మోసం చేశారని ఏడుపు. దీపే సొంత కూతురని నోరు జారిన జ్యో. పారుకు మొదలైన అనుమానం. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. 

PREV
15
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్‌ శనివారం ఎపిసోడ్‌లో దీప బిడ్డను వదులుకోవాలి అనుకున్న విషయం దశరథకు ముందే తెలుసు అని చెప్తుంది పారిజాతం. ఆ రోజు దీప, కార్తీక్, దశరథ మాట్లాడుకుంటుంటే నేను పొడిపొడిగా ఉన్నాను. ఆ విషయం కాంచనతో కూడా చెప్పాను అంటుంది పారు. 

ఆ మాట కార్తీక్ ని అడిగితేనే బిడ్డ వల్ల తల్లికి ప్రమాదమని చెప్పాడు అంటుంది కాంచన. నిన్ను కొడుకు, కోడలే కాదు మీ అన్న కూడా భలే మోసం చేశాడు అంటుంది పారిజాతం. దశరథ, కాంచనను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు.

25
నేనొక ఓడిపోయిన మనిషిని

కాంచన మాత్రం దశరథను నువ్వు మాట్లాడకు అన్నయ్య. నన్ను చెల్లెమ్మ అని పిలవకు అంటుంది. ఏం తెలియనట్లు భలే నటించావు అన్నయ్య. నీ నటనకు నా జోహార్లు అంటుంది. నీ చేతిలో నా కోడలు చేయి పెట్టి బిడ్డ జాగ్రత్త అన్నయ్య అని చెప్పినప్పుడైనా నీకు నిజం చెప్పాలి అనిపించలేదా?

ఒక మోసపోయిన ఆడదానిలా నేను ఈ రోజు నా పుట్టింట్లో చచ్చిపోయినట్లే లెక్క అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కాంచన. కూతురుగా ఓడిపోయాను, చెల్లిగా ఓడిపోయాను, భార్యగా ఓడిపోయాను, తల్లిగా ఓడిపోయాను, అత్తగారిలా కూడా ఓడిపోయాను. నేను ఒక ఓడిపోయిన మనిషిలా మిగిలిపోయాను అని శ్రీధర్ ని తీసుకొని ఏడుస్తూ అక్కడినుంచి వెళ్లిపోతుంది కాంచన.

35
స్వప్నకు రెడ్ రోజ్ ఇచ్చిన కాశీ

మరోవైపు కాశీ, స్వప్న మాట్లాడుకుంటూ ఉంటారు. స్వప్నకు పాత విషయాలు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు కాశీ. అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నచ్చితే కలవడం, నచ్చకుంటే విడిపోవడం, ఇదే నాకు తెలిసిన జీవితం అంటుంది స్వప్న. మరి అత్తయ్య అడిగినప్పుడు నీ పాపిటలో పెట్టుకున్న సింధూరం ఎందుకు చెరిపేయలేదు అంటాడు కాశీ. సైలెంట్ గా ఉంటుంది స్వప్న.

ఎందుకంటే నువ్వు నన్ను నీ మాటల్లోంచి మాత్రమే తీసేశావు. మనసులో నుంచి కాదు అంటాడు. ఈ రోజు పెళ్లి రోజు అనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నువ్వు తెలుసని ఒప్పుకోవు. ఎనీ వే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని రోజ్ ఫ్లవర్ స్వప్నకు ఇచ్చి వెళ్లిపోతాడు కాశీ. తనకు తెలియకుండానే ఫ్లవర్ తీసుకున్న స్వప్న.. తర్వాత గుర్తొచ్చి పడేస్తుంది.

45
జ్యోత్స్న వల్లే ఇదంతా..

మరోవైపు దీప బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ వచ్చి ఓదారుస్తాడు. దశరథ్ వచ్చి మీరు ఆ హాస్పిటల్‌కి ఎందుకు వెళ్లారు. ఇంత జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు అంటాడు. జ్యోత్స్నకు మన మీద అనుమానం వచ్చింది. అందుకే తాతను లాక్ చేసి ఇదంతా చేసింది అంటాడు కార్తీక్. మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. దీపను తీసుకొని హాస్పిటల్ కి వెళ్లు అంటాడు దశరథ. ఒకసారి అమ్మను చూసి వెళ్తాను అంటుంది దీప. వీళ్ల మాటలను చాటుగా వినే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్న. కార్తీక్ చూడటంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

55
నోరు జారిన జ్యోత్స్న

దీపకు ఎంత ధైర్యం, ఎంతకు తెగించిందే. అంతమంది ముందు కొంచెం కూడా భయం లేకుండా సమాధానం చెప్పింది. అయినా దాని గుట్టు భలే బయటపెట్టావే అని జ్యోత్స్నను పొగుడుతుంది పారిజాతం. నువ్వే ఆ రోజు అన్నావుగా దీపకు బిడ్డను కనడం ఇష్టం లేదని.. ఆ మాటను నేను గట్టిగా నమ్మాను. అందుకే ఇదంతా చేశాను అంటుంది జ్యోత్స్న. 

దీప గురించి దశరథ ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదే అంటుంది పారు. ఎంతైనా సొంత కూతురు కదా అని నోరు జారుతుంది జ్యోత్స్న. ఏమన్నావే.. మళ్లీ చెప్పు అంటుంది పారు. దీపను మా డాడీ సొంత కూతురులా చూసుకుంటాడు కదా అన్నాను అని కవర్ చేస్తుంది జ్యోత్స్న.

కాంచనను ఇంకాస్త రెచ్చగొడితే దీపను ఇంటికి రానివ్వదు. తల్లికి, భార్యకు మధ్యలో కార్తీక్ గాడు నలిగిపోతాడు అంటుంది పారు. అంతదాకా వస్తే బావ దీప దగ్గరే ఉంటాడు అంటుంది జ్యోత్స్న. ఇంత జరిగినా నాకు కావాల్సిన నిజం రాలేదు, చెప్పించే వరకు వదిలిపెట్టను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. మనం గొడవను మళ్లీ మొదలు పెట్టాలి అంటుంది జ్యోత్న్స. దీని కోపం చూస్తుంటే దీపపై ఏదో గట్టిగానే పెట్టుకుంది అనుకుంటుంది పారు. నాకు తెలియకుండా ఇంట్లో ఇంకా ఏమైనా జరుగుతోందా అని డౌట్ పడుతుంది పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories