Illu Illalu Pillalu April 13 Episode: నర్మద కాపురంలో చిచ్చుపెట్టిన భాగ్యం వల్లీ, లారీ గురించి ఆరాతీస్తున్న నర్మద

Published : Apr 13, 2026, 09:21 AM IST

Illu Illalu Pillalu  April 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి, భాగ్యం.. నర్మద కాపురంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తారు. నర్మద లారీ ఎవరిదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి 

PREV
13
రామరాజు ఇంటికి ప్రేమ తల్లి

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో ప్రేమకు ధీరజ్ టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. ఇద్దరూ కాసేపు సరదాగా పోట్లాడుకుంటారు. అదే సమయానికి ప్రేమ తల్లి రేవతి,నాన్నమ్మ శారదమ్మ వస్తారు. వారిద్దరిని అలా చూసి చూడముచ్చటైన జంట అని మెచ్చుకుంటారు. రేవతి కూతురి యోగక్షేమాలు అడుగుతుంది. అదే సమయానికి రామరాజు, తిరుపతి కూడా ఇంట్లోకి వస్తారు. ఆ తర్వాత రేవతి, శారదమ్మ తిరిగి ఇంటికి వెళ్లి పోతారు. సరిగ్గా గుమ్మం దగ్గరకి వెళ్లేసరికి భద్రావతి ఎక్కడికి వెళ్లారని కోపంగా అడుగుతుంది. ఇక చెప్పకతప్పక ప్రేమను చూడడానికి రామరాజు ఇంటికి వెళ్ళామని చెబుతారు. మొదట భద్రావతి కోపంగా మాట్లాడినా.. తర్వాత ప్రేమ గురించి అడిగి తెలుసుకుంటుంది.

23
నర్మద కాపురంలో చిచ్చు

ఇక ఇక్కడి నుంచి ఎపిసోడ్ నర్మద దగ్గరికి మారుతుంది. నర్మద.. ప్రేమకు యాక్సిడెంట్ చేసిన లారీ ఎవరిదో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదని కావాలనే చేసినట్టు ఉందని ప్రేమ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆర్టీవో ఆఫీస్ లో తనకు తెలిసిన ఫ్రెండ్ కు ఫోన్ చేసి లారీ నెంబర్ ఇచ్చి దాని ఓనర్ ఎవరు, నడిపిన డ్రైవర్ ఎవరో తెలుసుకోమని చెబుతుంది. ఇక ఇక్కడి నుంచి సీన్ ఇడ్లీ బాబాయి, వల్లి, భాగ్యం దగ్గరికి మారుతుంది. ఈ ముగ్గురు కూడా నర్మద తాకట్టు పెట్టిన నగల దుకాణం దగ్గరికి వస్తారు. ఆ నగల దుకాణం వ్యాపారితో నర్మద, సాగర్ పై లేనిపోనివి చెబుతారు. వారికి మీరు పది లక్షల నగలు మాత్రమే తీసుకొని 20 లక్షల క్యాష్ ఇచ్చారని.. కానీ వాళ్ళు మీ అప్పు తీర్చలేరని లేనిపోనివి చెబుతారు. దీంతో ఆ నగల వ్యాపారి భయపడిపోతూ ఉంటాడు. నర్మదకు నగలపై అప్పు ఇచ్చే ముందు రామరాజుకు చెప్పారా? అని కూడా అడుగుతారు దాంతో ఆ వ్యాపారి ఆలోచనలో పడతాడు. వీళ్లు ముగ్గురు షాపు నుంచి బయటకు వచ్చి ఆనంద పడిపోతూ ఉంటారు. నర్మదా కాపురం తగలబడిపోవడం గ్యారంటీ అని భాగ్యం అంటుంది.

33
ధీరజ్ కు నిజం తెలిసిపోతుందా?

ఇక్కడి నుంచి సీన్ ప్రేమ, ధీరజ్ దగ్గరికి మారుతుంది. ప్రేమగా తన భార్యకు జ్యూస్ అందిస్తాడు. ధీరజ్ ను చూసి ప్రేమ మురిసిపోతూ ఉంటుంది . ధీరజ్ మాత్రం ప్రేమపై చిర్రుబుర్రులాడుతూనే ఉంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ధీరజ్ కు ప్రేమ చేసిన తప్పేమీ లేదని తెలుస్తుంది. చందు వచ్చి ఇంట్లో గొడవలకు, అమూల్య జీవితం పాడవ్వడానికి ప్రేమ కారణం కాదని చెబుతాడు. తన భార్య వల్లియే ఈ పనులన్నీ చేసిందని అంటాడు. దీంతో ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

Read more Photos on
click me!

Recommended Stories