Karthika Deepam 2 Today Episode: తాళి కడతావా, గన్‌తో కాల్చుకోమంటావా? కార్తీక్‌కి జ్యో బెదిరింపు

Published : Apr 11, 2026, 09:02 AM IST

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 11వ తేదీ)లో తాళి కడతావా లేకుంటే గన్‌తో కాల్చుకోమంటావా అని కార్తీక్ ని బెదిరించిన జ్యో. స్వప్న, కాశీల మధ్య చిన్న వాదన. జ్యోను అనుమానించిన దశరథ, శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో కార్తీక్ చేతిలో తాళి పెట్టి, దీన్ని నా మెడలో కట్టి... నన్నే నీ పెళ్లి రోజు బహుమతిగా స్వీకరించు బావ అంటుంది జ్యోత్స్న. షాక్ అవుతాడు కార్తీక్. నన్ను పెళ్లిచేసుకొని నీ భార్యగా దీపకు పరిచయం చేయమని చెప్తుంది జ్యో. ఇదంతా ఇప్పటికి ఇప్పుడు ప్లాన్ చేయలేదు. నేను నైటే ప్లాన్ చేసుకున్నాను. 

అందుకే నీ కోసం మంచి చీర కట్టుకొని పెళ్లికూతురిలా రెడీ అయి వచ్చాను అంటుంది జ్యోత్స్న. ఇక ఆపుతావా అని కార్తీక్ గట్టిగా అంటాడు. ఇది డ్రామా కాదు బావ అంటుంది జ్యో. డ్రామా కాకపోతే బాగోతం... బాగోతం కాకపోతే వీధి నాటకం. ఇలాంటివి మాట్లాడేముందు ఒళ్లు దగ్గపెట్టుకుంటే మంచిదని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. 

28
కార్తీక్ ని బెదిరించిన జ్యో

కారు కీస్ చేతికి ఇచ్చి నేను వెళ్లిపోతున్నాను అని వెళ్లబోతాడు కార్తీక్. అప్పుడే కారులో నుంచి గన్ తీసి.. గురి పెట్టుకొని తాళి కడతావా గన్ తో కాల్చుకోమంటావా అని బెదిరిస్తుంది జ్యోత్స్న. నాకు ఏమైనా అయితే మా మమ్మీ బ్రతకదు. అప్పుడు నువ్వు దీపను ఎవరి కూతురని పరిచయం చేస్తావు అని కార్తీక్ ని బెదిరిస్తుంది జ్యోత్స్న. కార్తీక్ రిక్వెస్ట్ చేసినా వినదు. తాళి కట్టను అని కార్తీక్ తేల్చి చెప్పడంతో ట్రిగర్ నొక్కుతుంది. గన్ పేలుతుంది.

38
కాశీ, స్వప్న వాదన

మరోవైపు కారు తూడుస్తూ ఉంటాడు కాశీ. కాఫీ తాగుతూ బయట వచ్చి కూర్చొంటుంది స్వప్న. కావేరి వచ్చి కాశీకి కూడా కాఫీ ఇస్తుంది. కాశీ వచ్చి స్వప్న దగ్గరలో కూర్చొని ఏం చదువుతున్నావు అడుగుతాడు. జీవితాన్ని చదువుతున్నాను అంటుంది స్వప్న. ఏం చదివినా చివరికి కథ సుఖాంతం కావాల్సిందే అంటాడు కాశీ. నువ్వు ఎన్ని నవలలు చదివినా గొడవ పడని జంట ఉండదు... ఒకరి తప్పులను మరొకరు క్షమించుకోవడమే జీవితం అంటాడు కాశీ. తప్పులను క్షమించవచ్చు, కానీ మోసాలను క్షమించకూడదు అని కాసేపు వాదించుకుంటారు స్వప్న, కాశీ.

48
దశరథ, శివన్నారాయణ డౌట్

మరోవైపు కార్తీక్, దీపలను విడదీయడానికి జ్యోత్స్న కావాలనే కార్తీక్ ని తీసుకొని బయటకు వెళ్లిందా అని అనుమానపడతాడు దశరథ. ఇంతలో శివన్నారాయణ వచ్చి కూడా జ్యో గురించి అలాగే అనుమానపడతాడు. అప్పుడే వచ్చిన సుమిత్ర దీప, కార్తీక్ లను దూరం చేయాల్సినంత అవసరం జ్యోత్స్నకు ఏంటీ అని అడుగుతుంది. నిజానికి దీప, జ్యోత్స్న బాగా కలిసిపోయారు అంటుంది. జ్యోత్స్న ఒకవేళ కావాలని తప్పు చేస్తే నేనే క్షమించను అంటుంది సుమిత్ర.

58
స్వప్న మనసులో ఏముంది?

స్వప్న స్వప్న అంటూ పిలుస్తూ ఇంట్లోకి వస్తాడు కాశీ. లోపలికి వచ్చేముందు కాలింగ్ బెల్ కొట్టాలని తెలియదా.. అని సీరియస్ అవుతుంది స్వప్న. నేను ఎప్పుడు నీ సంతోషమే కోరుకుంటాను అందుకే నీకోసం వసంత్ ని తీసుకొచ్చాను అని చెప్తాడు కాశీ. షాక్ అవుతుంది స్వప్న. నీకోసం గాజులు తెచ్చాను నేనే వేస్తాను అంటాడు వసంత్. 

గతంలో స్వప్న కాశీతో గాజులు వేయించుకొని, ఆడవాళ్లు భర్తతోనే గాజులు వేయించుకుంటారని చెప్పి ఉంటుంది. ఆ మాటలను గుర్తు చేసుకొని.. నీ మనసులో ఏముందో ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటాడు కాశీ. వసంత్ గాజులు వేయబోతుంటే, ఈ రోజు మంచిరోజు కాదు తర్వాత వేసుకుంటాను అని చెప్తుంది స్వప్న. వసంత్ వెళ్లిపోతాడు. కాశీకి చిన్న హోప్ వస్తుంది.

68
కాంచన కోపం

మరోవైపు దీప, కాంచన మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజు పెళ్లి రోజు అని తెలిసినా అది వాడ్ని తీసుకొని వెళ్లడం ఏంటి? ఈ టైం అయినా రాకపోవడం ఏంటి? దానికి అంటే బుద్ధి లేదు సరే... వీడికైనా ఉండాలి కదా.. ఎక్కడున్నాడో ఫోన్ చేసి రమ్మను అని అంటుంది కాంచన.

78
కార్తీక్ సీరియస్

మరోవైపు గన్ పేలినప్పుడు జ్యో చేతిని పైకి అనడంతో పైవైపు పేలుతుంది గన్. కాస్త ఉంటే బుర్ర పేలిపోయేది. నీకు ఏమైనా మతిపోయిందా అని జ్యోపై సీరియస్ అవుతాడు కార్తీక్. నీ కళ్లముందు ఒక ప్రాణం పోతుంటే నువ్వు చూడలేవు బావ అంటుంది జ్యోత్స్న.

ఇక్కడ ఎవ్వరైనా ఇంకొకరిపై ప్రేమతోనే బతుకుతున్నారు. నీకోసం బతికే వాళ్లలో సుమిత్ర, దశరథ మామయ్యే కాదు దాసు మామయ్య కూడా ఉన్నాడు. నువ్వు మంచిగా మారి ఏ రోజుకైనా తన దగ్గరికి వస్తావని ఎదురుచూస్తున్నాడు అని చెప్తాడు కార్తీక్. అవన్నీ కాదు.. నువ్వు తాళి కడతావా లేదా అని అడుగుతుంది జ్యోత్స్న.

88
జ్యోత్స్న చిరాకు

ఇంతలో దీప కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేసి బావ రాడు.. నా దగ్గరే ఉంటాడు పంపను అని అంటుంది జ్యోత్స్న. నువ్వు అసలు ఆడదానివేనా అని అడుగుతుంది దీప. కోపంగా ఫోన్ కట్ చేస్తుంది జ్యోత్న్స. నీకు ఇలా కాదు అని తాళి తీసుకొని దూరంగా పడేస్తాడు కార్తీక్. గన్ తీసుకొని నేనే నిన్ను ఇంట్లో నుంచి తీసుకొచ్చాను. నేనే సేఫ్ గా దిగబెడతాను అని జ్యోత్స్నను బలవంతంగా కారు ఎక్కిస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories