ఐ బొమ్మ రవి ఏం చదువుకున్నాడో తెలుసా? టాలీవుడ్ కు చెమటలు పట్టించిన వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే?

Published : Nov 16, 2025, 02:51 PM IST

ఐ బొమ్మ పైరసీ సైట్ ద్వారా టాలీవుడ్ ను ముప్పుతిప్పలు పెట్టిన ఇమ్మడి రవిని రీసెంట్ గా అరెస్ట్ చేశారు పోలీసులు. ఎక్కడో విదేశాల్లో ఉంటూ.. తెలుగు పరిశ్రమను ఇబ్బంది పెట్టిన రవి ఏం చదువుకున్నాడో తెలుసా? గతంలో అతను ఏం చేసేవాడు? 

PREV
13
ఐ బొమ్మ ఇమ్మడి రవిని అరెస్ట్

రీసెంట్ గా ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వారి దర్యాప్తును వేగవంతం చేశారు. కూకట్‌పల్లి రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్‌ నుండి రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని ఇంట్లో ఉన్న కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు వంటి కీలక ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. రవికి సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో ఉన్న 3 కోట్ల డబ్బును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇప్పటికే ఐ బొమ్మ, బప్పమ్ వెబ్‌సైట్లు బ్లాక్ చేశారు.

23
ఆన్‌లైన్ బెట్టింగ్ తో సంబంధాలు..?

పైరసీ మాత్రమే కాదు.. రవికి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌తో కూడా సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆ వైపునుంచి కూడా విచారణ చేస్తున్నారు. రవి ఇటీవల పోలీసులకు సవాలు విసిరినట్టు వైరల్ అయిన స్క్రీన్ షాట్స్ తో.. పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. అంతే కాదు తాను పట్టుబడనన్న ధీమాతో ఉన్న రవి.. విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెచి ఉన్న పోలీసులు.. కూకట్ పల్లిలో అతన్ని ఆరెస్ట్ చేశారు. ఇక నెదర్లాండ్స్ నుండి కూకట్‌పల్లికి రావడానికి గల కారణాలను కూడా అధికారులు విచారిస్తున్నారు. అరెస్ట్ చేసిన తరువాత రవిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, పోలీసులు మరో 7 రోజుల కస్టడీని కోరారు. ఐ బొమ్మ ద్వారా నెలకు 35–40 లక్షల మంది సినిమాలు చూస్తున్నారు. ఈ భారీ ట్రాఫిక్‌ను ఉపయోగించుకుని.. కొన్ని బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయేందుకు రవి ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమోషన్ల ద్వారా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్లు దర్యాప్తులో తేలింది

33
ఇమ్మడి రవి చదువు, బ్యాక్ గ్రౌండ్..

ఐబొమ్మతో.. పైరసీకి పాల్పడ్డ ఇమ్మడి రవి ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి, హైదరాబాద్‌లో ER Infotech పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించాడు. ఈమధ్యలో కొంత కాల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేశాడని సమాచారం. ఇంజనీర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఇమ్మడి రవి కొంత కాలానికి నెదర్లాండ్స్ , కరేబియన్ దీవులకు వెళ్లి Cloud Fare, OTT సర్వర్లను హ్యాక్ చేసి పైరసీ నెట్‌వర్క్ నడిపినట్లు పోలీసులు గుర్తించారు. పైరసీ చేసిన సినిమాలను ఐ బొమ్మ, బప్పమ్, ఐ విన్, బప్పమ్ టీవీ వంటి సైట్లలో అప్‌లోడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఐ బొమ్మలో సినిమాలు చూసే ప్రేక్షకులను బెట్టింగ్ యాప్‌ల వైపు వెళ్లేలా.. ప్లాన్స్ కూడా అమలు చేసినట్టు తెలుస్తోంది. అతనికి ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరింత లోతుగా దర్యప్తు చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories