బాహుబలి తరువాతా కొంత కాలం ఇబ్బందికర పరిస్థితిని ఫేస్ చేసిన ప్రభాస్.. ఇప్పుడిప్పుడే వరుస హిట్లతో..మళ్లీ మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఈటైమ్ లో మళ్లీ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడట యంగ్ రెబల్ స్టార్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. దాదాపు అరడజన్ సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసించబోతున్నాడు రెబల్ స్టార్. బాహుబలి తరువాత వరుసగా మూడు ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేసిన ప్రభాస్.. ఆతరువాత సలార్, కల్కీ సినిమాలతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఫౌజీ, రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి పెద్ద ప్రాజెక్టులు ఉండగా, వీటితో పాటు కొత్త కథలు కూడా వింటూ ఉన్నాడని సమాచారం
24
ప్రభాస్ రిస్క్ చేయబోతున్నాడా?
ఈమధ్యనే మంచి ఫామ్ లోకి వచ్చాడు.. ఇక వరుసగా హిట్లు కొడతాడు అని ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నటైమ్ లో.. షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రభాస్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ డైరెక్ట్ చేయబోతున్నాడని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అతను మరెవరో కాదు ప్రేమ్ రక్షిత్. RRR సినిమాలో ఆస్కార్ సాధించిన నాటునాటు పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్. సీనియర్ డ్యాన్స్ మాస్టర్ గా ఉన్న ప్రేమ్ రక్షిత్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన డైరెక్షన్ లో ప్రభాస్ నటించబోతున్నాడట.
34
ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?
నాటు నాటు పాటతో అంతర్జాతీయ గుర్తింపును అందుకున్న ప్రేమ్ రక్షిత్ ప్రస్తుతం దర్శకత్వ వైపు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈక్రమంలో ప్రేమ్ రక్షిత్ ఇప్పటికే ప్రభాస్‌కు ఒక కథ చెప్పినట్లు తెలుస్తోంది. కథపై ప్రభాస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఆయన స్పందన కోసం ప్రేమ్ రక్షిత్ ఎదురుచూస్తున్నాడని టాలీవుడ్ టాక్. ఈ వార్తలు అధికారికంగా ఎక్కడా ధృవీకరించకపోయినా, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగా ఇవి నిజమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రేమ్ రక్షిత్ కెరీర్ ప్రభాస్ సినిమాతోనే మొదలైంది. ఆయన కొరియోగ్రాఫర్‌గా మొదట పని చేసిన సినిమా ఛత్రపతి. ఆ తర్వాత బిల్లా, డార్లింగ్, బాహుబలి వంటి చిత్రాల్లో కూడా ప్రభాస్‌తో కలిసి పనిచేసి మంచి గుర్తింపును సంపాదించాడు ప్రేమ్.
డాన్స్ మాస్టర్ డైరెక్షన్ లో ప్రభాస్ రెండు సినిమాలు
టాలీవుడ్‌లో డ్యాన్స్ మాస్టర్స్ డైరెక్టర్ల అవతారం ఎత్తడం కొత్తేమొ కాదు. గతంలో కూడా చాలామంది కొరియోగ్రఫర్స్ దర్శకులుగా మారారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అయితే ప్రభాస్ కూడా ఇద్దరు కొరియోగ్రఫర్ల డైరెక్షన్ లో రెండు సినిమాలు చేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో పౌర్ణమి, లారెన్స్ మాస్టర్ దర్శకత్వంలో రెబెల్ చిత్రాల్లో నటించాడు. అయితే ఈసినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కాకపోయినా.. యావరేజ్ గా నిలిచాయి. ఆడియన్స్ ను అలరించాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. అయినా కూడా ప్రభాస్ మరోసారి ఒక కొరియోగ్రాఫర్‌తో పని చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ప్రభాస్ ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.