Guppedntha Manasu 8thMarch Episode:పదవికి రాజీనామా చేసి, కాలేజీని వదిలి వెళ్లిపోయిన వసు, ఎండీ సీటులో శైలేంద్ర

First Published | Mar 8, 2024, 7:48 AM IST

ఆయన చనిపోయారని మేమంతా అన్నా ఒప్పుకోలేదు.. కనీసం నివాళ్లు కూడా అర్పించనివ్వకుండా ాఅడ్డుకున్నారు.. ఇప్పుడు ఈ సర్ తో కలిసి తిరుగుతున్నారు. రిషి సర్ గౌరవం పోగొట్టారు అని అంటారు.

Guppedantha Manasu


Guppedntha Manasu 8thMarch Episode: నేటి ఎపిసోడ్ లో సీన్ మళ్లీ కాలేజీలో ఓపెన్ అవుతుంది. కొత్త ప్రేమ జంట పేరిట.. పోస్టర్లని అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే మను వస్తాడు. ఏంటిది అని అనుపమ సీరియస్ గా అడుగుతుంది. తనకు ఏమీ తెలిదు అని మను అంటాడు.  మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద వెళ్లినప్పుడు ఎవరో కావాలనే ఇలా ఫోటోలు తీశారు అని అంటాడు. కానీ... కాలేజీలో ఉన్న ఇతర లెక్చరర్స్ ఊరుకోరు. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అందుకే.. ఈ పోస్టర్లు వేశారు అని అంటారు. దానికి వసు సీరియస్ అవుతుంది. తాను కాలేజీ ఎండీ అని, అతను బోర్డు మెంబర్ అని... వర్క్ మీద బయటకు వెళ్లినప్పుడు ఇలా తీశారు అని వసుధార అంటుంది. మధ్యలో శైలేంద్ర దూరి.. ఆ ఫోటోలో ఉన్నది మీరేనా లేక ఫోటోలు కూడా మార్ఫింగ్ చేశారా అని అడుగుతాడు. మార్ఫింగ్ కాదని.. తామేనని మను ఒప్పుకుంటాడు.

Guppedantha Manasu

ఇంతలో.. మరో లెక్చరర్.. ఒక ఎండీగా మీరంటే మాకు గౌరవం ఉందని, స్టూడెంట్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగారనే మంచి అభిప్రాయం ఉందని.. కానీ.. మీరు ఇలా చేస్తారు అనుకోలేదు అని అంటారు. వసుధార తప్పుగా మాట్లాడొద్దని చెప్పినా వాళ్లు వినరు. మొన్నటి వరకు రిషి సర్ అంటే ప్రాణం అన్నారు.. ఆయన చనిపోయారని మేమంతా అన్నా ఒప్పుకోలేదు.. కనీసం నివాళ్లు కూడా అర్పించనివ్వకుండా ాఅడ్డుకున్నారు.. ఇప్పుడు ఈ సర్ తో కలిసి తిరుగుతున్నారు. రిషి సర్ గౌరవం పోగొట్టారు అని అంటారు.

Latest Videos


Guppedantha Manasu

అంతేకాదు.. ఈయన కాలేజీకి రూ.50కోట్లు డబ్బు ఇచ్చినప్పుడే అనుమానించాల్సింది.. ఏ సంబంధం లేకుండానే కాలేజీకి అంత డబ్బు ఎందుకు ఇస్తాడు? అని ప్రశ్నిస్తారు. మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండటం వల్లే.. ఆయన అంత సహాయం చేశారు అని అంటారు. ఆ మాటలన్నీ విని..  వసుధార బాధపడుతుంది. ఏడ్చేస్తుంది. వసుధారపై మచ్చపడింది అని ఒకరు అంటే.. వీళ్లిద్దరూ తప్పు చేశారు అని మరొకరు అంటారు. మధ్యలో శైలేంద్ర దూరి.. నీ వల్లే.. వసుధార బాధపడుతోంది అని అంటాడు. 

Guppedantha Manasu

వెంటనే.. మామయ్య నేను.. ఇక ఈ కాలేజీలో ఉండలేను అంటుంది. తాను ఎండీ పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెబుతుంది. తర్వాత.. మను దగ్గరకు వెళ్లి.. మీరు ఇంత నమ్మక ద్రోహం చేస్తారని అస్సలు ఊహించలేదు అని  చెబుతుంది. లాగి పెట్టి మనుని ఒక్కటి పీకుతుంది. ఆ సీన్ కి అందరూ షాకౌతారు. తర్వాత.ఇంకోసారి ఈ కాలేజీలో అడుగుపెట్టను అని చెబుతుంది. దానికి.. మహేంద్ర.. అలా అంటావేంటమ్మా.. నీ తప్పేమీ లేదు అని అంటాడు. అయితే.. తానేమీ తప్పు చేయలేదని.. తనకు తెలుసని, మీకు తెలుసు అని అంటుంది. కానీ....రిషి సర్ గౌరవం కాపాడలన్నా, కాలేజీ పరువు ప్రతిష్టలు కాపాడాలన్నా తాను ఈ పని చేయక తప్పదు అని అంటుంది. తాను నిర్ణయం తీసేసుకున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Guppedantha Manasu

ఇక వసుధార ఎండీ పదవి నుంచి తప్పుకోవడంతో.. తప్పక. ఆ పదవి శైలేంద్రకు ఇవ్వాలని అనుకుంటారు. పంతులు గారు కూడా వచ్చి మంచి ముహూర్తం చూస్తూ ఉంటారు. ఆ ఎండీ సీటు పట్టుకొని.. తన కళ నెరవేరిందని.. తాను  సాధించానని శైలేంద్ర సంబరపడతాడు. నేను సాధించాను , సాధించాను అని అరుస్తూ ఉంటాడు. ఇంతలో ధరణి.. ఏమండి అని లేపడంతో.. కలలో నుంచి బయటకు వస్తాడు. ఇంకా.. శైలేంద్ర కాలేజీకి వెళ్లలేదు. కారులో ఉండగానే.. ఇదంతా జరిగినట్లు ఊహించుకుంటాడు.

Guppedantha Manasu

ధరణి లేపడంతో కల నుంచి బయటకు వస్తాడు. మరి కాసేపట్లో జరిగేది అదే అనుకుంటాడు. అయితే.. ధరణి మాత్రం.. మీరు అనకున్నది మాత్రం అస్సలు జరగదు అనేసి చెబుతుంది. అదేంటి ధరణి అలా అంటావ్...చూస్తూ ఉండు.. నేను ఎండీ సీటులో కూర్చొని చూపిస్తాను అంటాడు. ఈయన ఇంత నమ్మకంగా ఉన్నాడేంటి.. వసుధారకు ఫోన్ చేస్తే బెటరేమో అని అనుకుంటుంది. కానీ.. వసుకి చెప్పకుండా..  ఫోన్ లాక్కుంటాడు. నువ్వు ఇప్పుడు వసు కి చెబితే.. అక్కడ జరగాల్సిన సినిమా ఆగిపోతుందా అని అంటాడు. ధరణి బయపడుతూ ఉంటుంది.

Guppedantha Manasu

మరోవైపు కాలేజీలో అందరూ గోడలపై ఉన్న పోస్టర్లు చూస్తూ ఉంటారు. మహేంద్ర కూడా ఆ పోస్టర్లు చూసి.. ఇవి చూసి వసు ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుంటూ ఉంటారు. వసు కూడా అప్పుడే ఎంట్రీ ఇస్తుంది. ఆ పోస్టర్లు చూసి షాకౌతుంది. అయితే.. శైలేంద్ర అనుకుంటున్నట్లుగా కాకుండా.. వసు సింగిల్ ఫోటోలు, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ తో ఉండే అవకాశం ఉంది. మరోసారి శైలేంద్ర ప్లాన్ రివర్స్ అయ్యి... గుండె పగిలిపోయే అవకాశం ఉంది.

click me!