Guppedntha Manasu 7th march Episode:కాలేజీలో పరువు పోయిందిగా, మను చెంప పగలకొట్టిన వసుధార..!

Published : Mar 07, 2024, 08:51 AM IST

ఎవరో వచ్చినట్లు అనిపించింది అని మొత్తం వెతుకుతుంది. కానీ.. ధరణికి రాజీవ్ కనిపించడు. అయితే.. ఈ క్రమంలో ధరణి..  రాజీవ్ చెయ్యి తొక్కుతుంది, ఆ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది.

PREV
17
Guppedntha Manasu 7th march Episode:కాలేజీలో పరువు పోయిందిగా, మను చెంప పగలకొట్టిన వసుధార..!
Guppedantha Manasu


Guppedntha Manasu 7th march Episode:వసుధార పరువు తీయడానికి రాజీవ్ రెడీ అయిపోతాడు. వసు, మనుల ఫోటోలను కొత్త ప్రేమ జంట అనే పేరుతో పోస్టర్లుగా మార్చి కాలేజీ క్యాంపస్ మొత్తం అంటించేస్తాడు. తర్వాత.. ఈ విషయాన్ని శైలేంద్రకు చెప్పాలని అనుకుంటాడు. ఫోన్లు చేస్తూనే ఉంటాడు. కానీ.. శైలేంద్ర లిఫ్ట్ చేయడు. దీంతో.. దానిని మొత్తం వీడియోలొ రికార్డు చేస్తాడు.  దానిని వెళ్లి శైలేంద్రకు చూపించాలని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా.. ఏకంగా శైలైంద్ర ఇంటికి వెళ్లిపోతాడు.

27
Guppedantha Manasu

అక్కడ ధరణి, శైలేంద్రలలో ఎవరు ఎవరో గుర్తించడానికి కాస్త సతమతమౌతాడు. వెళ్లి దుప్పటి తీసి చూస్తే ధరణి ఉంటుంది. మళ్లీ కాదు.. అని శైలేంద్ర ను లేపడానికి ప్రయత్నిస్తాడు. మంచి నిద్రలో ఉన్న శైలేంద్ర  సడెన్ గా రాజీవ్ ని చూసి గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకు ధరణి కూడా లేస్తుంది. ఏమైందండి అని అడిగితే.. ఏదో పీడకల వచ్చింది అని చెబుతాడు. కాదు.. ఎవరో వచ్చినట్లు అనిపించింది అని మొత్తం వెతుకుతుంది. కానీ.. ధరణికి రాజీవ్ కనిపించడు. అయితే.. ఈ క్రమంలో ధరణి..  రాజీవ్ చెయ్యి తొక్కుతుంది, ఆ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది.

37
Guppedantha Manasu

తర్వాత.. కష్టపడి.. ధరణితో తనకు ఫ్రస్టేషన్ వస్తోందని.. వెళ్లి ట్యాబ్లెట్ తెమ్మని చెప్పి పంపిస్తాడు. ధరణి వెళ్లిన వెంటనే.. రాజీవ్ ని తీసుకొని బయటకు వెళ్తాడు. ఈ టైమ్ లో మా ఇంటికి ఎందుకు వచ్చావ్  అని అడుగుతాడు. నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు కదా అందుకే వచ్చాను అని చెబుతాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వస్తావా అని సీరియస్ అవుతాడు. అప్పుడు రాజీవ్.. తాను చేసిన పనికి సంబంధించిన వీడియోని చూపిస్తాడు. అది చూసి శైలేంద్ర సంబరపడిపోతాడు. ఇక.. ఆ మనుగాడి పీడ వదిలిపోతుందని.. వసుధార రాజీవ్ సొంతం అవ్వడం ఖాయమని, తనకు ఎండీ సీటు రావడం ఖాయం అని సంబరపడిపోతాడు. రాజీవ్ కి థ్యాంక్స్ చెబుతాడు.

47
Guppedantha Manasu

తర్వాత.. ధరణి ట్యాబ్లెట్ తీసుకొని వచ్చే సరికి శైలేంద్ర కనపడడు. ఈయన ఎక్కడికి వెళ్లారు అని చూసేలోగా వెనక నుంచి వచ్చేస్తాడు. వచ్చాక ట్యాబ్లెట్ ఇస్తే వద్దు అని తన ఫ్రస్టేషన్ మొత్తం తగ్గిపోయింది అని చెబుతాడు. తనకు చాలా సంతోషంగా ఉందని.. నువ్వు రేపు కాలేజీకి రావాలని, నీకు బుల్లితెరపై ఓ సినిమా చూపించాలి అంటాడు. ఎందుకు ఏంటి అని ధరణి ఎంత అడిగినా.. చెప్పడు. రేపు నువ్వు చూడాల్సిందే  అని అంటాడు.

57
Guppedantha Manasu


తెల్లారేసరికి.. శైలేంద్ర కాలేజీ కి మంచిగా రెడీ అవుతాడు. ధరణి ఇంకా రాలేదని పిలుస్తూ ఉంటాడు. అంతలో ధరణి మంచిగా రెడీ అయ్యి కిందకు వస్తుంది. ఈచీర నీకు చాలా బాగుందని పొగిడేస్తాడు. అదంతా చూసి దేవయాణికి ఏమీ అర్థం కాదు. నాకు తెలీకుండా నీ భార్యను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావ్ రా అని అడుగుతుంది. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే ఎలా మమ్మీ.. తను కూడా బయటకు వెళ్లి.. బయటి ప్రపంచం చూడాలి కదా అందుకే.. కాలేజీకి తీసుకొని వెళ్తున్నాను అని అంటాడు.

67
Guppedantha Manasu

బయట ప్రపంచం చూపించాలంటే.. ఏ సినిమాకో, పార్టీకో, కాలేజీకో,ఫంక్షన్ కో తీసుకొని వెళ్లాలి కానీ.. కాలేజీకి ఎందుకు అని అడుగుతుంది. అయితే.. కాలేజీలో కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయని అందుకే తీసుకొని వెళ్తున్నానని చెబుతాడు. తనకు తెలీకుండా కాలేజీలో సెలబ్రేషన్స్ జగరడం ఏంటి అని ఆశ్చర్యపోతుంది.  అయితే.. జరుగుతున్నాయని.. అందుకే ధరణిని తీసుకువెళ్తున్నాను అంటాడు. నేను కూడా వస్తాను అని. దేవయాణి అంటుంది.

అయితే.. వద్దని.. అక్కడ ఏం జరిగిందో.. ధరణి నీకు మొత్తం పూసగుచ్చినట్లు వివరిస్తుందని, తాను సాధించిన విజయం గురించి ధరణి నోటితోనే వినాలి చెబుతాడు.  అయితే... భార్యపై ప్రేమ చూపించి తనను పట్టించుకోవడంలేదని దేవయాణి ఫీలౌతుంది. కానీ.. అవేమీ పట్టించుకోకుండా.. ధరణితో వెళ్లడానికి శైలేంద్ర ఫిక్స్ అవుతాడు. అయితే.. ఆయన మళ్లీ ఏదో ప్లాన్ వేశాడని.. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అని ధరని అనుకుంటుంది. కానీ.. ఏమీ తెలియనట్లు భర్తతో కలిసి కాలేజీకి వెళ్తుంది.

77
Guppedantha Manasu

ఇక సీన్ కాలేజీలో మొదలౌతుంది. కాలేజీలో గోడలపై అంటించిన పోస్టర్లు చూసి అందరూ షాకౌతారు. మహేంద్రకు కోపం వస్తుంది. ఏంటండి ఇది.. అని  ధరణి అడిగితే.. కొత్త ప్రేమ జంట అని శైలేంద్ర అంటాడు. ఆ మాట విని అనుపమ తిడుతుంది.  బుద్ధి ఉందా అలా మాట్లాడటానికి అని అంటుంది. అయితే తానేమీ  అనడం లేదని.. ఇక్కడ ఉన్నదే చదువుతున్నాను అంటాడు. అప్పుడే వసుధార వచ్చి..అది చూసి ఏంటి మామయ్య ఇది  అని అడుగుతుంది. మహేంద్ర.. కోపంతో ఆ పోస్టర్లను చింపాలని చూస్తాడు. కానీ శైలేంద్ర ఆపేస్తాడు. ఎన్నని చింపుతావ్ బాబాయ్ అంటాడు. అప్పుడే మను అక్కడికి వచ్చి అది చూసి షాకౌతాడు. వెంటనే అనుపమ.. ఏంటిది మను అని అడుగుతుంది. మను తనకు ఏమీ తెలీదు అన్నా.. ఎవరూ నమ్మరు. శైలేంద్ర తప్పంతా మను నే చేశాడుు అన్నట్లుగా మాట్లాడతాడు. వసుధార కూడా నమ్మకద్రోహం చేశావ్ అని.. మను చెంప పగలకొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే.., శైలేంద్ర ఇంత సంబరపడుతున్నాడంటే.. ప్లాన్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. మనుని వసు కొట్టడం కూడా శైలేంద్ర కల అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు.

click me!

Recommended Stories