Guppedntha Manasu 5th March Episode:నాకింకా పెళ్లికాలేదన్న అనుపమ, మరి మను ఎవరని ప్రశ్నించిన మహేంద్ర

Published : Mar 05, 2024, 09:39 AM IST

ఎవరు ఏమనుకున్నా మిమ్మల్ని తీసుకువస్తాను సర్ , నేను చేయాలని అనుకున్నది చేస్తాను.. మనం దగ్గరయ్యే సమయం దగ్గరపడింది అనుకుంటుంది.

PREV
110
Guppedntha Manasu 5th March Episode:నాకింకా పెళ్లికాలేదన్న అనుపమ, మరి మను ఎవరని ప్రశ్నించిన మహేంద్ర
Guppedantha Manasu


Guppedntha Manasu 5th March Episode:వసుధార తన కారు బ్రేక్ డౌన్ అవ్వడంతో మను కారులో మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. అది శైలేంద్ర, రాజీవ్ ల కంట పడుతుంది. బస్తీలో వెళ్లేటప్పుడు పొలం గట్ల మీద నడవాల్సి వస్తుంది. మను నడుస్తూ పడిపోబోతుంటే వసు పట్టుకుంటుంది. ఆ ఫోటో రాజీవ్ చేతిలో పడుతుంది. ఇక ఆ ఫోటో చూస్తూ రగిలిపోతూ ఉంటాడు. ఆ మను గాడు నీకు కాలేజీలో సహాయం చేసి ఉండొచ్చు. ఆ మాత్రానికి వాడికి నువ్వు థ్యాంక్స్ చెబితే సరిపోతుంది.

210
Guppedantha Manasu

కానీ.. ఇలా ఉండటం నచ్చడం లేదు మరదలు పిల్ల అనుకుంటాడు. అంతేకాదు.. ఆ చనిపోయిన రిషిగాడిని మూడు నెలల్లో తీసుకొని వస్తావని శపథాలు చేస్తున్నావంట.. చనిపోయిన వాడిని ఎలా తీసుకువస్తావ్..? వాడు ఎలాగూ తిరిగి రాడు. అయినా నీకోసం ఈ బావ ఉన్నాడు కదా.. అంటూ వసు, మనుల ఫోటోలు పట్టుకొని రాజీవ్ మాట్లాడుకుంటూ ఉంటాడు.

310
Guppedantha Manasu

మరోవైపు చాలా కాలం తర్వాత మిషన్ ఎడ్యుకేషన్ పనులు మొదలుపెట్టినందుకు వసుధార చాలా సంతోషంగా ఉంటుంది. గతంలో రిషి తో కలిసి వెళ్లిన ప్లేస్ కి వెళ్లినందుకు అప్పటి స్మృతులను కూడా తలుచుకొని సంబరపడిపోతూ ఉంటుంది రిషి ఫోటో ఫోన్ లో చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. మనుతో రిషితో గడిపిన విషయాలను పంచుకున్నానని.. మన ప్రేమను మను కూడా అర్థం చేసుకున్నాడు అని చెబుతుంది. మీరు ఎక్కడ ఉన్నారు సర్..? ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది. మూడు నెలల్లో రిషి సర్ ని తీసుకువస్తాను అన్న విషయం గుర్తుకు వచ్చి.. ఎలాగైనా, ఎవరు ఏమనుకున్నా మిమ్మల్ని తీసుకువస్తాను సర్ , నేను చేయాలని అనుకున్నది చేస్తాను.. మనం దగ్గరయ్యే సమయం దగ్గరపడింది అనుకుంటుంది.

410
Guppedantha Manasu

ఇక, అనుపమ, మనులను చూస్తుంటే.. రిషి, జగతిలు గుర్తుకు వస్తున్నారని వసు అనుకుంటుంది. జగతి మేడమ్ మీద మొదట్లో మీకు చాలా కోపం ఉండేది.. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. కానీ.. మనుకి అనుపమ మేడమ్ మీద కోపం లేదు. కానీ..  వారిద్దరి మధ్య ఏదో బంధం ఉంది. వారిద్దరూ బాధపడుతున్నారు. కానీ.. ఒకరికొకరు ఏమౌతారనే విషయం తెలియడం లేదు., అనుపమ మేడమ్ ని అడిగితే చెప్పదు.. కానీ.. మనుని అడిగితే చెబుతాడా? అయినా సరే.. ఎలాగైనా వారిద్దరి మధ్య బంధం ఏంటో తెలుసుకుంటాను అని.. రిషి ఫోటోతో వసు చెబుతూ ఉంటుంది.

510
Guppedantha Manasu


ఇక ఇంట్లో మనుకి పెద్దావిడ భోజనం పెడుతూ ఉంటుంది. పొరమాలుతుంది. వెంటనే ఆవిడ నీళ్లు తాగిస్తుంది. మహేంద్ర ఇంట్లో భోజనం చేసినప్పటి సీన్ గుర్తుకువస్తుంది. ఆ తర్వాత అనుపమ పెద్దమ్మ కూడా అదే అడుగుతుంది.  ఆరోజు నీకు ఎవరూ లేరు అని అన్నావంట కదా అని అడుగుతుంది. ఆ విషయం నీదాకా చేరిందా అంటాడు. దానికి ఆవిడ.. ఇలా ఎంతకాలం ఒకరితో మరొకర మాట్లాడకుండా ఉంటారు..? అని అడుగుతుంది. దానికి మను.. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక సమాధానం కోసం  ఎదురుచూస్తున్నానని, ఆ సమాధానం ఆవిడ చెప్పడం లేదని.. మాట మొదలవ్వాల్సింది ఆవిడ దగ్గరి నంచే అని అంటాడు. సమాధానం దొరికే సమయంలో దొరుకుతుందిలే అని ఆమె అంటే... ఇంకెప్పుడు నాకు 25ఏళ్లు వచ్చాయి అని అంటాడు. దానికి ఆవిడ.. అనుపమ అంతకముందు అప్పుడప్పుడు ఈ ఇంటికి వచ్చేదని.. నువ్వువచ్చాక ఫోన్లు కూడా చేయడం తగ్గించేసింది అని చెబుతుంది.

610
Guppedantha Manasu

ఇక, మరోవైపు అనుపమ సైతం.. మను గురించే ఆలోచిస్తూనే ఉంటుంది. మను తనకు ఎవరూ లేరు అనే మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి పిలుస్తాడు.పరధ్యానంలో ఉన్న అనుపమను గట్టిగా పిలిచి.. ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. ఏమీలేదని చెబుతుంది. వెంటనే మను ఎవరు అని అడుగుతాడు. నీకెలా తెలుసో.. నాకు కూడా అలానే తెలుసు అని తప్పించుకోవాలని చూస్తుంది. కానీ.. మహేంద్ర వదలడు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. ముందు నీకు ఎవరూ లేరని చెప్పావ్.. తర్వా త విశ్వనాథం నీ తండ్రని, ఏంజెల్ నీ మేనకోడలు అని  పరిచయం చేశావ్ అని అడుగుతాడు. వాళ్లు తనకు దూరంగా ఉన్నారు కాబట్టి.. తనకు ఎవరూ లేరని చెప్పాను అని అంటుంది. నీకు నిజంగా పెళ్లి కాలేదా? అది కూడా అబద్ధమేనా అని అడుగుతాడు. అయితే.. తనకు నిజంగానే పెళ్లి కాలేదని.. తాను ఒంటరిగానే ఉన్నానని.. అలానే ఉంటాను అని చెబుతుంది.

710
Guppedantha Manasu


మరి, మొన్న మను విషయంలో ఎందుకు అంత ప్రేమ చూపించావ్ అని అడుగుతాడు. ఆ ప్లేస్ లో ఎవరు ఉన్నా, వసుధార, రిషి, ఆఖరికి నువ్వు ఉన్నా నేను అలానే రియాక్ట్ అవుతాను అని అనుపమ చెబుతుంది. అయితే నార్మల్ గానే బిహేవ్ చేశాను అంటావ్ అంతేనా..? అయితే.. నాకు ఎవరూ లేరు అని  మను చెప్పినప్పుడు నీ కళ్లలో ఎందుకు నీళ్లు వచ్చాయ్..? చేతిలో ముద్ద ఎందుకు జార విడిచావ్? అని అడుగుతాడు. అనుపమ మరోసారి అడుగుతున్నాను.. మను ఎవరు..? అని స్ట్రెస్ చేసి మరీ అడుగుతాడు. మీ మధ్య ఉన్న బంధం ఏంటి అని అడుగుతాడు. కానీ.. అనుపమ మాత్రం సమాధానం చెప్పదు. తనకు నిద్ర వస్తోందని పడుకుంటాను అని వెళ్లిపోతుంది. అయితే.. మహేంద్ర మాత్రం.. మీఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసుకుంటాను అని మనసులోనే అనుకుంటాడు.

810
Guppedantha Manasu

ఇక.. శైలేంద్ర ఎక్కడికో హడావిడిగా బయటకు వెళ్తుంటే.. రాజీవ్ ఆ కారుకు అడ్డుపడతాడు.  ఏంటి మ్యాటర్ అని శైలేంద్ర అడిగితే.. వసు, మనుల ఫోటోలు చూపిస్తాడు. ఆ ఫోటోల్లో  వసుధార పక్కన ఎవరు ఉండాలి అని అడుగుతాడు.  రిషి అని చెబుతాడు. రాజీవ్ కోపంగా చూడటంతో... ఇప్పుడు రిషి లేడు కాబట్టి.. నువ్వు ఉండాలి అని అంటాడు. కదా.. మరి వాడు ఏం చేస్తున్నాడు అక్కడ..? ఆ మను గాడితో నా వసు ఎందుకు తిరుగుతోంది? అని అడుగుతాడు. ఈ ఫోటోలు నీకు ఎలా వచ్చాయి అని శైలేంద్ర అడిగితే... వాళ్లను ఫాలో అవుతూ వెళ్లాను అని, ఫోటోలు తీసిన విషయాలు చెబుతాడు. ఆ మనుగాడు... ప్రతి విషయంలో వసుధారతో భజన చేస్తున్నాడని రాజీవ్ ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు.

910
Guppedantha Manasu


వసు కోసం తాను ఇంకో అమ్మాయిని చూడలేదని, బ్రహ్మచారిలా ఉండిపోయానని, కానీ.. వసు మాత్రం ఆ మనుగాడితో  చెట్ల వెంట, పుట్ల వెంట తిరుగుతోందని మండిపడ్డాడు. ఈ ఫోటోలతోనే వసు, మనులను విడగొడతానని,  మను గాడి పీడ విరగడయ్యేలా చేస్తానని అంటాడు. ఆ ఫోటోలను పోస్టర్లుగా తీసి.. కాలేజీలో అంటిస్తానని.. అందరూ కలిసి ఆ మనుగాడిని తరిమికొడతారని అంటాడు. వసు అవమాన భారంతో ఒంటరిగా మిగిలిపోతుందని.. అప్పుడు.. ఆ ఒంటరి చిలుకకు ఈ రాజీవ్ తోడు అవుతాడు అని చెబుతాడు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని శైలేంద్ర అంటే... ప్లాన్ వేసింది నువ్వు కాదని..  ఈ రాజీవ్ అని బిల్డప్ కొడతాడు. శైలేంద్ర చూద్దాం.. సక్సెస్ అయితే.. నాకు కూడా మంచిదే కదా అని అంటాడు. ఇక.. రాజీవ్.. ఈ రాత్రికే పని మొదలుపెడతాను అంటాడు.

1010
Guppedantha Manasu

ఇక కాలేజీలో వసుధార దగ్గరకు ఏంజెల్ ని రమ్మని చెబుతుంది. ఏంటి విషయం అని ఏంజెల్ అడిగితే...  మను టాపిక్ తీసుకువస్తుంది. మను గురించి నీకు తెలుసా అంటే.. తెలుసు అని ఏంజెల్ అంటుంది. వెంటనే వసు.. మను ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి అని అడుగుతుంది. ఆ విషయాలు తనకు తెలీదని, మొన్న నువ్వే కదా పరిచయం చేశావ్ అని ఏంజెల్ అంటుంది. వారు మాట్లాడుకుంటూ ఉండగా. మను వస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!

Recommended Stories