BrahmaMudi 4th march Episode:రాజ్ కడుపు మాడ్చి, బావకు బంతి భోజనం, ఇంట్లో ధాన్యం మరో పెంట, రూ.50లక్షల నష్టం..

First Published | Mar 4, 2024, 10:43 AM IST

తన భర్తను అలా అరవడంతో ధాన్యలక్ష్మికి కాలిపోతుంది. వెంటనే బావగారిపై సీరియస్ అవుతుంది. మీరు యజమానిలాగా.. మా ఆయనను పనివాడిలా తిడుతున్నారేంటి..? అని అడుగుతుంది.

Brahmamudi

BrahmaMudi 4th march Episode: ఎట్టకేలకు రాజ్ కూడా అత్తారింటికి వెళతాడు. అయితే.. రాజ్ వస్తున్నాడనే విషయం తెలియనట్లుగా నటిస్తున్న కనకం.. మీరు కనీసం కాఫీ అయినా తాగి వెళ్లాలి అని అడుగుతుంది. అదేంటి..? నేను ఇక్కడే ఉంటాను అనే విషయం వీళ్లకు తెలీదా అని రాజ్ మనసులో అనుకుంటాడు.  ఈ లోగా కావ్య చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ.. మూర్తి.. అల్లుడుగారు చాలా బిజీగా ఉంటారని తెలుసమ్మా.. కానీ.. కనీసం కాఫీ అయినా తాగి వెళ్లాలి అంటాడు. రాజ్ ముఖం మాడిపోతుంది.  ఈ లోగా కావ్య.. ఆయన కూడా ఇక్కడే ఉండటానికి వచ్చారు అని చెబుతుంది. అప్పుడు అవునా.. అదే మాకు మహా భాగ్యం అని వాళ్లు అంటారు. మీరు మా ఇంటికి వస్తారని, ఉంటారని అస్సలు అనుకోలేదు బావ అని అప్పూ కూడా సెటైర్ వేస్తుంది. ఇక.. అందరూ లోపలికి వెళతారు.

Brahmamudi

ఇక.. సీన్ దుగ్గిరాల ఇంట్లోకి షిప్ట్ అవుతుంది. సుభాష్.. ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్లు సరుకు తెప్పించిన గోడౌన్ లో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. దానికి ఇన్సురెన్స్ కూడా చేయించరు. దీంతో రూ.50లక్షల నష్టం వస్తుంది. ఆ విషయం తెలిసి సుభాష్ సీరియస్ అవుతాడు. ఇన్సురెన్స్ ఎందుకు చేయించలేదు అని తిడితే.. ప్రకాశం గారికి చెప్పామని.. ఆయన చేయించలేదు అని వాళ్లు చెబుతారు. మా తమ్ముడికి చాలా పనులు ఉంటాయని.. వాటి వల్ల మర్చిపోతాడని.. మీరు ఎందుకు ఉన్నారు అని సీరియస్ అవుతాడు.

Latest Videos


Brahmamudi

తర్వాత.. ప్రకాశం ని పిలుస్తాడు. ఇక తమ్ముడిపై సీరియస్ అవుతాడు. ప్రతిసారీ ఇలానే చేస్తున్నావని..ఇంక నువ్వు మారవా అని తిడతాడు. మర్చిపోయాను అన్నయ్య అని ప్రకాశం అంటే.. అందుకే కదా నీకు కింద మేనేజర్ ని పెట్టింది.. వాళ్లు గుర్తు చేసినా కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తావా అని అరుస్తాడు. అయితే.. తన భర్తను అలా అరవడంతో ధాన్యలక్ష్మికి కాలిపోతుంది. వెంటనే బావగారిపై సీరియస్ అవుతుంది. మీరు యజమానిలాగా.. మా ఆయనను పనివాడిలా తిడుతున్నారేంటి..? అని అడుగుతుంది.

Brahmamudi

వాళ్లిద్దరి మధ్యలోకి నేనే ఎప్పుడూ వెళ్లలేదు.. నువ్వు ఎందుకు దూరుతున్నావ్ అని అపర్ణ అడిగితే.. బావగారు రాజులా ఆర్డర్లు వేస్తుంటే.. నువ్వు మహారాణిలా ఫీలౌతున్నావ్?. నీకు అంత అవసరం ఏముంటుంది అక్కా..? తిడుతుంది మా ఆయనను కదా, బాధ నాకే కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. మీరు మా ఆయనకు మంచి చెబుతున్నారా..? అయితే మంచిగా చెప్పాలి కదా అని ప్రశ్నిస్తుంది. ధాన్యలక్ష్మి మాటలకు సుభాష్ బాధపడతాడు. నువ్వు చెప్పింది నిజమే.. ఇప్పటి వరకు నేను అన్నయ్య, వాడు తమ్ముడు అని మాత్రమే అనుకున్నాను.. ఇలాంటి తేడాలు ఉన్నాయని నాకు తెలీదు అని.. క్షమించమని చెప్పి వెళ్లిపోతాడు. ఇప్పుడు నీ కళ్లు సంతోషపడ్డాయా అని అపర్ణ కూడా.. ధాన్యలక్ష్మిపై సీరియస్ అవుతుంది. ఇక.. ప్రకాశం భార్యపై అరిచి.. లోపలికి లాక్కెళతాడు.

Brahmamudi


తన గదిలోకి తీసుకువచ్చి భార్యను తిట్టడం మొదలుపెడతాడు. నువ్వు మారిపోయావ్ అని అంటాడు. దానికి ధాన్యలక్ష్మి.. ఎదుటివాళ్లు మారారు కాబట్టే.. తాను కూడా మారాను అని చెబుతుంది. మొన్నటి దాకా మా అక్కకు కావ్య అంటే పడేదే కాదు.. ఇప్పుడు కావ్యను ఎలా చూసుకుంటుందో చూడండి అని అంటుంది. అయితే.. ప్రకాశం మాత్రం.. నువ్వు నా భార్యవి కాబట్టి.. ఎలా ఉన్నా భరిస్తాను.. కానీ ఇంకోసారి మా అన్నయ్యకీ, నాకు మధ్య మాత్రం దూరొద్దు. నీకు ఎవరు చెప్పుడు మాటలు చెబుతున్నారో నాకు తెలీదు కానీ... నీ కళ్లు తెరుచుకున్న రోజు నువ్వు చేసిన పనికి నువ్వు బాధపడతావ్ అని చెప్పేసి వెళ్లిపోతాడు.

Brahmamudi

మళ్లీ సీన్ కనకం ఇంట్లో మొదలౌతుంది. అత్తారింట్లో అరిటాకులో భోజనం పెడతారని,  సిగ్గుపడకుండా అన్నీ తినాలి అని రాజ్ అనుకుంటాడు. అప్పటికే కావ్య పెద్ద అరిటాకు వేసి.. అన్ని వంటలు రెడీ చేసి పెడుతుంది. అరిటాకులో వడ్డిస్తూ ఉంటుంది. అది చూసి.. రాజ్ కుమ్మేయాలి అనుకుంటాడు. ఈ లోగా కనకం, మూర్తి దంపతులు.. వాళ్ల మేనల్లుడు భాస్కర్ ని కూడా తీసకువస్తారు. అది చూసి రాజ్.. ఇద్దరం ఒకే అరిటాకులో తినాలి..? ఇదేమన్నా మండీనా అంటాడు. దానికి అప్పూ.. కాదు బావ.. నువ్వు డైట్ లో ఉన్నావ్ అంట కదా.., లాస్ట్ టైమ్ ఇలా భోజనం పెడితే నువ్వు తిట్టావ్ కదా.. అందుకే నీకోపం పచ్చి కూరగాయలు రెడీగా ఉన్నాయి.. అని తెచ్చి చేతిలో బాక్స్ పెడుతుంది.

Brahmamudi


కమ్మని భోజనం కళ్ల ముందు ఉన్నా.. పచ్చి కూరగయాలు తినాల్సి వస్తుందని రాజ్ తెగ ఫీలౌతూ ఉంటాడు. పైకి మాత్రం.. నాది బ్రాండ్ మైండ్ అంటూ వాటినే తింటూ ఉంటాడు. ఇక.. కావ్య వాళ్ల బావ.. బుజ్జీ నువ్వే చేశావా అంటూ.. కావ్య ను పొగిడేస్తూ ఉంటాడు. అయితే.. మధ్యలో రాజ్ ఓ ఐడియా వస్తుంది. వీడికి పెళ్లి చేసి పంపిస్తే.. ఓ గోల వదిలిపోతుంది కదా అనుకుంటాడు. అదే విషయం అంటాడు. అయితే.. తనకు తన బుజ్జీలాంటి అమ్మాయి కావాలి అని అంటాడు. అప్పుడు అప్పూ వెంటనే.. మా అక్క లాంటి అమ్మాయి మరొకరు ఉండరు అని చెబుతుంది. ఇక ఇంట్లో అందరూ.. తన కూతురి లైఫ్ అమెరికాలో హ్యాపీగా ఉండేదని.. ఇప్పుుడుు ఇలా అయ్యిందని తెగ ఫీలౌతారు. రాజ్.. వెంటనే యెహే ఆఫండి అని అరుస్తాడు.

Brahmamudi

అప్పుడు అప్పూ.. ఏం చేస్తాం బావ.. మా స్వప్నకు పెళ్లి నుంచి వెళ్లిపోకపోయి ఉంటే.. నువ్వు కావ్య అక్కను చేసుకునేవాడివి. కానీ ఇప్పుడ కావ్య అక్కకు పెళ్లైంది.. వాళ్ల ఆయన కూడా నీ పక్కనే ఉన్నాడు అని అంటుంది. ఒకవేళ మా రాజ్ బావ.. మా కావ్య అక్కను వదేలేసి రెండో పెళ్లి చేసుకుంటే.. నువ్వు మా కావ్య అక్కను చేసుకోవచ్చు అని అంటుంది. ఏం బావ.. సెకండ్ ఒపీనియన్ ఉందా అని అప్పూ అడుగుతుంది. దానికి రాజ్.. మనసులోనే అప్పూని పిచ్చి తిట్లు తిట్టుకుంటాడు. తర్వాత.. ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేస్తాడు.

ఇక.. ధాన్యలక్ష్మి మాట్లాడిన మాటలకు సుభాష్ బాధపడుతూ ఉంటాడు. అక్కడికి ప్రకాశం వచ్చి నాకు మతి మరుపు మాత్రమే ఉందన్నాయా.. సైట్ రాలేదు.. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేదు అనుకున్నావా అంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!