Guppedantha Manasu
Guppedntha Manasu 12th march Episode:కాలేజీలో వసుధార పుట్టినరోజు వేడుకలు చేయాలని మహేంద్ర, మను ప్లాన్ చేస్తూ ఉంటారు. అదేమో వసుధారకు నచ్చదు. కనీసం కాలేజీలో పోస్టర్లు అంటించడమే ఆమెకు నచ్చదు. ఆ విషయంలోనే మనుని పిచ్చి పిచ్చిగా తిడుతుంది. అయితే.. మనుని అలా అనడం కరెక్ట్ కాదని మహేంద్ర అన్నమాటలకు వసు బాధపడుతుంది, తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అంటూ... రిషి ఫోటో పట్టుకొని ఎప్పటిలాగానే మాట్లాడుతూ ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నారు రిషి సర్.. మీరు నా పక్కన లేకుండా నేను పుట్టినరోజు ఎలా చేసుకుంటాను అని మాట్లాడుతూ ఉంటుంది.
Guppedantha Manasu
మరోవైపు మహేంద్ర... కాలేజీలో వసుధార పుట్టినరోజు చేస్తున్నామంటూ మీరు రావాలి అని ఫణీంద్రకు ఫోన్ చేసి చెబుతాడు. వసుధార ఒప్పుకుందా అని ఆయన అడిగితే... ఒప్పకోలేదని, తెలీకుండా చేస్తున్నాం అని చెబుతాడు. వసు సంతోషం కోసమే చేస్తున్నాం అని చెప్పడంతో.. ఫణీంద్ర సరే వస్తాను అంటాడు. మీ వదిన, శైలేంద్ర, ధరణిని కూడా తీసుకువస్తాను అని చెబుతాడు.
Guppedantha Manasu
మహేంద్ర తో ఫోన్ మాట్లాడిన వెంటనే ఫణీంద్ర... దేవయాణి, శైలేంద్రలను పిలుస్తాడు. రేపు కాలేజీలో మను.. వసుధార బర్త్ డే చేస్తున్నాడని.. మనం అందరం వెళ్తున్నామని, తొందరగా రెడీ అవ్వమని చెబుతాడు. అయితే.. శైలేంద్ర నేను రాను అంటాడు. వెంటనే దేవయాణి కూడా నేను రాను అంటుంది. ఎందుకు అని ఫణీంద్ర అంటే.. ఓవైపు రిషి కనపించక అందరం బాధపడుతుంటే...ఆ వసుధార బర్త్ డే సెలబ్రేషన్స్ కావాలా..? అసలు ఒక్కోసారి ఏం చేస్తుందో కూడా అర్థం కాదు అని దేవయాణి అంటుంది. శైలేంద్ర కూడా వసు బర్త్ డే ఆ మను ఎందుకు చేయాలి అనే అనుమానం వ్యక్తం చేస్తాఢు. దీంతో.. ఇద్దరినీ ఫణీంద్ర తిడతాడు. అసలు రిషి కి అన్నగా.. వసుధార సంతోషం కోసం నువ్వు చేయాల్సిన పనిని ఆ అబ్బాయి చేస్తున్నాడు.. సంతోషించాల్సిందిపోయి.. ఇలా మాట్లాడతావా అని అరుస్తాడు. రేపు కచ్చితంగా కాలేజీకి మీరు రావాల్సిందే అని చెబుతాడు. ధరణితో.. నువ్వు కూడా రామ్మా అని చెబుతాడు. అయితే.. ఫణీంద్ర వెళ్లగానే ధరణి.. అత్తయ్యగారు.. ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు అనుకుంటాను అని అంటుంది.. నువ్వు మూసుకొని వంట గదిలోకి వెళ్లు అని దేవయాణి కసురుకుంటుంది. సరే అని ధరణి వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
తెల్లారే వసుధార కాలేజీకి వెళ్తుంది. అలా కాలేజీలోకి వెళ్లగానే.. ఓ స్టూడెంట్ ఉరుక్కుంటూ వచ్చి.. మేడమ్ స్టూడెంట్స్ కొట్టుకుంటున్నారు అని చెబుతాడు. వెంటనే వసుధార లోపలికి వెళ్తుంది. అయితే.. స్టూడెంట్స్ కొట్టుకుంటున్నట్లు యాక్ట్ చేసి... హ్యాపీ బర్త్ డే అని సర్ ప్రైజ్ ఇస్తారు. అయితే.. వసు దానికి సీరియస్ అవుతుంది. ఎవరు ఇచ్చారు మీకు ఈ ఐడియా... ఇలా ఎవరైనా విషెస్ చెబుతారా అని సీరియస్ అవుతుంది. మీరు చెప్పకపోయినా.. ఇలా ఎవరు చేయించారో నాకు తెలుసు అంటూ కోపంగా బయటకు వస్తుంది,
Guppedantha Manasu
బయటకు రావడం రావడమే...మను ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. ఇదంతా మను నే చేశాడు అనుకొని వెళ్లి ఫైర్ అవుతుంది. వెనక స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు... మహేంద్ర, అనుపమ కూడా అక్కడే ఉంటారు... అందరి ముందు మనుని తిడుతుంది. నిన్ననే చెప్పాను కదా.. నా బర్త్ డే సెలబ్రేషన్స్ చేయవద్దని... ఈరోజు స్టూడెంట్స్ తో ఎందుకు విష్ చేయించారు..? నాకు సర్ ఫ్రైజ్ అయినా, సెలబ్రేషన్ అయినా.. రిషి సర్ సమక్షంలోనే జరగాలి. మీ మనసులో ఏదో దురుద్దేశం ఉంది.. అదేంటో చెప్పండి.. నీకు ఎండీ పదవి కావాలి కదా.. దానికోసమే ఇలా చేస్తున్నారు.. మీ వళ్లే మా మామయ్య కూడా నన్ను తప్పు అంటున్నారు.. ఎవరు ఏమనుకున్నా కూడా నేను ఈ బర్త్ డే చేసుకోను. మీకు నిజంగా ఎండీ పదవి కావాలంటే డైరెక్ట్ గా అడగండి.. ఇచ్చేస్తాను. నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయవద్దు.. నేను భరించలేను.. అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూనే ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే.. మనం చేసినదానికి సర్ తిట్లు తింటున్నారు అని స్టూడెంట్స్ ఫీల్ అవుతారు.
Guppedantha Manasu
మనుని వసుధార అలా తిట్టడం చూసి అనుపమ కూడా చాలా ఫీలౌతుంది. ఆమె తల్లి మనసు అల్లాడిపోతుంది. మహేంద్రను పక్కకు పిలిచి.. ఇందుకే వద్దు అన్నాను.. నా మాట మీరు వినలేదు అని సీరియస్ అవుతుంది. మను ఎంత బాధపడ్డాడో అని.. అనుపమ కూడా బాధపడుతుంది. మను ఫీలైతే నీకు ఎందుకు అంత బాధ అని మహేంద్ర అడుగుతాడు. మొన్నకూడా భోజనం చేసేటప్పుడు అతనేదో అంటే.. నువ్వు కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నావ్ అని అంటాడు. అయితే.. కూరలో కారం ఎక్కువయ్యింది అని అనుపమ కవర్ ఛేయాలని చూస్తుంది. కానీ.. అది కారం కాదని.. మమకారం.. ఇప్పుడైనా మీ ఇద్దరి మధ్య బంధం ఏంటో చెప్పమని ఒత్తిడి తెస్తాడు. దీంతో... అనుపమ అలర్ట్ అయ్యి.. టాపిక్ డైవర్ట్ చేస్తున్నావ్.. నేను వసుధార గురించి మాట్లాడుతున్నాను అని అంటుంది.
Guppedantha Manasu
దానికి మహేంద్ర... తాముు వసుధార బాధ పోగొట్టాలనే చేశాం అని అంటాడు. అయితే.. వసుధారది బాధ కాదని, దుఖం అని చెబుతుంది. అయితే.. జగతి పోయినప్పుడు తాను కూడా అలానే ఉండేవాడినని.. నన్ను నార్మల్ చేయడానికి వసుధార, రిషి చాలా ప్రయత్నాలు చేశారని.. ఇప్పుడు మను చేసింది తప్పు అయితే.. అప్పుడు వసు, రిషిలు చేసింది కూడా తప్పే అంటాడు. వసుధారకు ఇప్పుడు బాధ అనిపించినా.. తర్వాత..మను చేసింది కరెక్ట్ అని అర్థం చేసుకుంటంది అని అంటాడు,
Guppedantha Manasu
ఇక వసుధార తన క్యాబిన్ లో కూర్చొని స్టూడెంట్స్ చెప్పిన విషెస్ గురించే ఆలోచిస్తూఉంటుంది. అప్పుడే స్టూడెంట్స్ వచ్చి... వసుకి క్షమాపణలు చెబుతారు. మీరు ఎందుకు చెబుతున్నారు.,. ఇది మీ ఐడియా కాదు కదా... ఆ మను చెప్పారు.. మీరు చేశారు అని వసు అంటుంది. అయితే.. మను సర్ కి ఎలాంటి సంబంధం లేదని.. సోషల్ మీడియాలో రీల్ చూసి తామే చేశాం అని చెబుతారు. దీంతో... వసు చాలా గిల్టీగా పీలౌతుంది. అనవసరంగా మనుని తిట్టాను అని ఫీలైతుంది.
Guppedantha Manasu
వెంటనే మను దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెబుతుంది. కానీ.. మను పర్వాలేదు మేడమ్.. మీరు పొరపాటు పడ్డారు అంతే కదా అంటాడు. అప్పుడు వసు చెబుతుంది.. ఇప్పటి వరకు తమను చాలా మంది మోసం చేశారని.. అందుకే.. ఆ ప్రభావం తనపై ఉందని.. ప్రతి ఒక్కరి మనసులో ఏదో చెడు ఉద్దేశం ఉందేమో అనే అనుమానంలో తనలో ఉందని... మిమ్మల్ని ప్రతిసారీ తాను ఏదో ఒక విధంగా బాధపెడుతున్నాను అని... చాలా బాధపడుతుంది. దానికి మను మాత్రం.. పర్వాలేదని.. మీ బాధను తాను అర్థం చేసుకోగలను అంటాడు. మీకు రిషి సర్ అంటే ప్రాణం అని తనకు తెలుసు అని.. ఆయన చేయాల్సిన పనులు నేను చేస్తున్నందుకు మీకు అలా అనిపించడంలో తప్పులేదని అంటాడు. అయితే.. తన విషయంలో మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని మరోసారి చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.