Brahmamudi
BrahmaMudi 11th Episode:కావ్య వాళ్ల బావతో కలిసి కింద గార్డెన్ లో మాట్లాడుతూ ఉంటే.. పై నుంచి రాజ్ చూస్తూ ఉంటాడు. వాళ్లు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే చూసి తట్టుకోలేడు. అప్పుడే రాజ్ లోని అంతరాత్మ బయటకు వచ్చి... రాజ్ కి సలహా ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. నువ్వు ఆలస్యం చేస్తే.. వాళ్ల బావ దానిని ఎత్తుకుపోతాడని.. నీ ప్రేమను బయటపెట్టమని చాలా చెప్పి చూస్తాడు. కానీ రాజ్ మాత్రం అసలు ఒప్పుకోడు. దీంతో రాజ్ ఆత్మ.. మరి వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే.. నువ్వు ఎందుకు తొంగి చూస్తున్నావ్ అని అడుగుతాడు. ఎందుకు కుళ్లుకుంటున్నావ్ అని కూడా అడుగుతాడు. అప్పుడు రాజ్.. ఇక నుంచి తాను అలా కుళ్లుకోనని... వాళ్లు ఎలా ఉన్నా నేను ఏమీ ఫీలవ్వను అని చెబుతాడు. తన అంతరాత్మతో ఛాలెంజ్ చేస్తాడు.
Brahmamudi
అప్పుడే.. కావ్య వాళ్ల బావతో కలిసి వస్తుంది. తన అంతరాత్మతో చెప్పినట్లుగానే రాజ్ కొంచెం కూడా వాళ్లు క్లోజ్ గా ఉన్న బాధపడడు. ఇద్దరూ కలిసి తిరగమని ప్రోత్సహిస్తాడు. భాస్కర్ కి ఆఫీసుకు వెళ్లడానికి సూట్ కావాలంటే.. ఏదికావాలంటే అది తీసుకోమని అంటాడు. అంతేకాదు.. తన కారు కీస్ ఇచ్చి మరీ.. తన కారులో వెళ్లమంటాడు. కళావతిని కూడా తీసుకొని వెళ్లు అని చెబుతాడు. రాజ్ మాటలకు కావ్యకు, వాళ్ల బావకు నోటి వెంట మాట ఉండదు. షాకై నిలపడిపోతారు.
Brahmamudi
ఇక.. మరోవైపు అనామిక... కవిని మళ్లీ తన లైన్ లోకి తెచ్చుకోవాలి అని అనుకుంటుంది. అందుకే కాఫీ తీసుకొని వెళ్తుంది. కానీ.. ఆలోగా కళ్యాణ్ అప్పూకి ఫోన్ చేస్తాడు. అప్పూతో మాట్లాడుతూ ఉంటే.. వెనక నుంచి అనామిక మొత్తం వింటూనే ఉంటుంది. కళ్యాణ్.. ఫోన్ లో అప్పూని కలవాలి అంటాడు. కానీ అందుకు ఒప్పకోదు.. నీకు పెళ్లైందని.. ఇలా కలిస్తే బాగోదు అని చెబుతుంది. కానీ.. కళ్యాణ్ తాను కష్టంలో ఉన్నానని.. నాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారు అని అంటాడు. ఆ మాటకు అప్పూ కరిగిపోతుంది. కలుస్తాను అని చెబుతుంది.
Brahmamudi
అయితే... అటు నుంచి కనకం అప్పూని... కళ్యాణ్ ని అనామిక ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ.. ఇద్దరూ ఎవరిమాట వినరు. కళ్యాణ్ తనకు చాలాసార్లు చాలా విషయంలో సహాయం చేశాడని.. తనకు కష్టం వచ్చినప్పుడు నేను అండగా ఉండాల్సిందే అని అప్పూ అని అక్కడి నుంచి బయలుదేరుతుంది.
Brahmamudi
మరోవైపు అప్పూని కలవడానికి లేదని అనామిక అంటుంది. నీ కోసం కష్టపడి కాఫీ తెస్తే.. నువ్వు దానిని కలవడానికి వెళ్తావా అని అడుగుతుంది. కళ్యాణ్ మాత్రం... ఏదైనా కష్టంతో కాదని, ఇష్టంతో చేయాలని అంటాడు.. తాను అప్పూని కలవడం ఇష్టం లేకపోతే.. చూడొద్దని. తాను మాత్రం కలవాల్సిందేనని.. అడ్డు పడొద్దని చెప్పి వెళ్లిపోతాడు. ఆ మాటలకు అనామిక రగిలిపోతుంది
Brahmamudi
అప్పూ తీసుకున్న నిర్ణయానికి కనకం భయపడుతుంది. అదే విషయం మూర్తితోచెబుతుంది. కానీ.. తన కూతురు తప్పు చేయడం లేదని, కష్టంలో ఉన్న తన ఫ్రెండ్ కి అండగా నిలుస్తోందని.. అలాంటి విషయాల్లో తాను అడ్డు చెప్పను అని మూర్తి అంటాడు. ఏదైనా గొడవలు జరిగితే అని కనకం భయపడితే.. బాధలుఅయినా పడదాం కానీ.. తప్పు చేయని కూతురికి తప్పు అని మాత్రం చెప్పను అంటాడు.
Brahmamudi
సీన్ కట్ చేస్తే.. అనామిక ఏడుస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. స్వప్న తనను చాలా మాటలు అన్నదని, అయినా ఇంట్లో అందరూ తనకు సపోర్ట్ చేశారని అంటుంది. తాతయ్యగారేమో.. గొడవ చేసినవాళ్లందరికీ ఆస్తులు రాసుకుంటూ పోతున్నారని.. ఇలానే జరిగితే.. మీకు, మీ అబ్బాయికి ఏమీ దొరకదని, రోడ్డున పడతారు అని అంటుంది. అక్కడిదాకా నేను రానివ్వను లే అని ధాన్యలక్ష్మి అంటుంది.
Brahmamudi
ఓవైపు కావ్య , స్వప్న టార్చర్ చేస్తేంటే... కళ్యాణ్ కూడా నా మాట వినడం లేదని.. తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాను అని వెళ్లాడు అని చెబుతుంది. అప్పుడు ధాన్యలక్ష్మి.. కొడుకు వైపు మాట్లాడుతుంది. ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా.. భార్య.. భర్తకు సపోర్ట్ గా ఉండాలని, కళ్యాణ్ గదిలో నుంచి బయటకు వచ్చి పడుకోవడం నేను చూశాను అని చెబుతుంది. ఆ మాటకు అనామిక ఫ్యూజులు ఎగిరిపోతాయి. అత్త తన సపోర్ట్ రాదేమో అనే భయంతో వెంటనే.. అప్పూ టాపిక్ తెస్తుంది. అప్పూతో మాట్లాడుతున్నాడు అని దొంగ ఏడుపులు ఏడుస్తుంది. దీంతో ధాన్యం కరిగిపోయి.. నీ మూడ్ సెట్ చేయడానికి షాపింగ్ కి వెళ్దాం అని చెప్పి తీసుకొని వెళ్తుంది.
Brahmamudi
ఇక. రాజ్ రియాక్షన్ కి కావ్యకు,.. వాళ్ల బావకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇలా జరిగిందేంటా అని ఆలోచిస్తూ ఉంటారు. అదే విషయం అమ్మమ్మగారికి కూడా చెబుతారు.ఆవిడ కూడా షాకౌతుంది. ఇంకో ప్లాన్ వేయాలి అని అనుకుంటారు. ఇక.. కావ్య.. వాళ్ల బావ బయటకు వెళ్తుంటే.. తమ్ముడు అన్నయ్య అనుకుంటూ రాజ్ వాళ్ల వెనకే వస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
కమింగప్ లో.. రాజ్ ఏకంగా.. కావ్యకు విడాకులు ఇవ్వడానికి కూడా రెడీ అయినట్లు చూపించారు. పాస్ పోర్ట్ చేతిలో పెట్టి.. మీ బావతో యూఎస్ వెళ్లడానికి నీకు లైన్ క్లియర్ అని చెబతాడు. అదే విషయం ఇందిరాదేవికి చెబుతుంది. దీంతో.. ఆమె మరో ప్లాన్ కూడా రెడీ చేస్తుంది. మరి.. ఆ ప్లాన్ తో అయినా రాజ్ లో ప్రేమ బయటకు వస్తుందో లేదో చూడాలి.