Guppedantha Manasu
Guppedatha Manasu 14th March Episode: కాలేజీలో వసుధార పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. అందరూ కేక్ తినిపించిన తర్వాత... వసుధార స్పీచ్ ఇవ్వడం మొదలుపెడుతుంది. నిజానికి ఈ పుట్టిన రోజు జరుపుకోవడం తనకు ఇష్టం లేదని వసు చెబుతుంది. రిషి సర్ లేకుండా..ఈ బర్త్ డే సెలబ్రేట్ చేసుకోకూడదనే అనుకున్నాను కానీ.. వెనక రిషి సర్ ఫోటో, మీరందరూ కూడా రిషి సర్ ఫేస్ మాస్క్ లను వేసుకోవడంతో.. రిషి సర్ తో కలిసి చేసుకున్న అనుభూతి కలిగిందని చెబుతుంది. ఇక, ఏవీలో మీ అందరు మాట్లాడిన మాటలు నా మనసుకు ఎంతో హత్తుకున్నాయని, చాలా సంతోషంగా అనిపించిందని వసుధార చెబుతుంది. నిజానికి ఈ ఎండీ పదవి చాలా కష్టంగా ఉంటుందని.. ఒక్కోసారి ఈ పదవిని వదిలేద్దామా అని అనిపించేదని కానీ... ఇప్పుడు మీ మాటలు నాకు మరింత స్ఫూర్తిని నింపాయి అని చెబుతుంది. ఈ రోజు చెబుతున్నా.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఈ ఎండీ పదవిని మళ్లీ రిషి సర్ వచ్చేంత వరకు వదిలిపెట్టను అని వసు శైలేంద్రను కోపంగా చూస్తూ చెబుతుంది. తర్వాత.. తన బర్త్ డే ఇంత గ్రాండ్ గా జరిపించినందుకు మనుకి స్పెషల్ థయాంక్స్ చెబుతుంది.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే... దేవయాణి, శైలేంద్ర ఇంటికి వెళ్లిపోతారు. ఆ బర్త్ డే సెలబ్రేషన్స్ తలుచుకొని రగిలిపోతూ ఉంటారు. మన కళ్ల ముందే కాలేజీలో ఆ వసుధార బర్త్ డే గ్రాండ్ గా జరిగింది అని దేవయాణి అంటుంది. దానికి శైలేంద్ర.. నేను ఏదో ప్లాన్ చేస్తే.. మరేదో అయ్యింది మమ్మీ... అసలు నేను వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యి ఉంటే.. ఎండీ అయ్యి ఉండేవాడిని అని తన ఫ్రస్టేషన్ మొత్తం బయటపెడతాడు. ఆ రిషిగాడే పక్కన ఉండి చేయించినట్లుగా.. బర్త్ డే చేశాడు ఆ మను అని అంటాడు.
Guppedantha Manasu
ఆ వసుధారను ఏమైనా చేస్తే ఇప్పుడే చేయాలి.. ఆ రిషిగాడు లేడు కాబట్టి.. ఇదే కరెక్ట్ సమయం అని దేవయాణి అంటుంది. అయితే.. ఆ రిషిగాడు లేకపోతే ఏంటి.. ఆ మనుగాడు ఉన్నాడు కదా.. వాడు ఏ ప్లాన్ వేసినా ప్లాప్ చేస్తున్నాడు. 100 ప్లాన్స్ వేస్తున్నా కూడా ఒక్కటి కూడా సక్సెస్ కావడం లేదు అంటాడు. ఏదో ఒకటి చేయాలి అని దేవయాణి అంటుంది... అప్పుడే ధరణి... ఏం చేస్తారు అత్తయ్య అనుకుంటూ వస్తుంది. ఏంటి అని దేవయాణి అంటే.. అదే ఇంకా ఏం చేస్తారు అత్తయ్య.. కేక్ తినడం తప్ప.. తినండి.. కేక్ తింటే మంచి ఐడియాలు వస్తాయి. అని అంటుంది. ఏయ్ ధరణి.. నీకు పిచ్చి ఎక్కిందా.. కేక్ తింటే ఐడియాలు రావడం ఏంటి అని .. దేవయాణి ఫ్రస్టేట్ అవుతుంది. కానీ.. ధరణి మాత్రం.. వినకుండా.. బలవంతంగా తినండి అనుకుంటూ.. దేవయాణి, శైలేంద్రలకు కేక్ తినిపించేస్తుంది. తర్వాత... మీకోసం బెల్ట్ రెడీ చేస్తాను.. కేక్ తినేసి రండి అని చెప్పి వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే... మహేంద్ర.. మనుకి స్పెషల్ థ్యాంక్స్ చెబుతాడు. రిషి కనిపించకుండా పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు వసుధార ముఖంలో నవ్వే చూడలేదు. మళ్లీ ఇంతకాలానికి.. వసుధార ముఖంలో నవ్వు చూస్తున్నాం. అందుకు నువ్వే కారణం అని పొగిడేస్తాడు. ఆ దేవుడు మా రిషిని మాకు దూరం చేసినందుకు.. నిన్నుు మా దగ్గరకు పంపించినట్లు ఉన్నాడు అని అంటాడు. దానికి.. మను.. అయ్యో నేను చేసింది ఏముంది సర్.. మీరు సపోర్ట్ గా ఉండటంతోనే చేయగలిగాను అని మను అంటాడు.
Guppedantha Manasu
వెంటనే ఏంజెల్.. లేదు మనుగారు బర్త్ డే చాలా బాగా చేశారు. నేను అయితే.. అలానే చూస్తూ ఉండిపోయాను అని అంటుంది. తర్వాత.. మీ బర్త్ డే ఎప్పుడు మనుగారు అని అడుగుతుంది. దానికి మను ఏం సమాధానం చెప్పడు. డేట్ చెబితే చాలు.. మీ బర్త్ డే కూడా.. వసుధార బర్త్ డే లాగా గ్రాండ్ గా చేద్దాం అని అంటుంది. అయితే.. వెంటనే అనుపమ.. అతనికి ఇష్టం లేదేమో.. నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్ అని అంటుంది. అందులో ఇబ్బంది ఏముంది అత్త.. అయితే.. ఆయన బర్త్ డే డేట్ నువ్వే చెప్పు అని అంటుంది. నాకు ఎలా తెలుస్తుంది అని అనుపమ అంటుంది. ఆ మాటకు మను హర్ట్ అవుతాడు. కానీ.. ఏంజెల్ మాత్రం.. కదా.. అందుకే మనుగారినే అడుగుతున్నాను అని అంటుంది.
Guppedantha Manasu
అయితే.. మనుని ప్రశ్నలు వేస్తుండటం అనుపమకు నచ్చక.. ఏంజెల్ ని తిడుతుంది. దానికి ఏంజెల్ ఫీలౌతుంది. చూడు వసుధార అత్తయ్య నన్ను ఎలా అంటుందో అని అంటుంది. దానికి వసుధార.. అనుపమ మేడమ్ గురించి నీకు తెలిసిందే కదా ఏంజెల్.. నవ్వు ఫీలవ్వకు.. ఆవిడకు మాత్రం నువ్వు తప్ప ఎవరునున్నారు..? ప్రేమ అయినా, కోపం అయినా నీ మీదే కదా చూపించేది అని అంటుంది.
Guppedantha Manasu
అయితే.. వసుధార చెప్పిన మాటలను కావాలనే మహేంద్ర నొక్కి నొక్కి మాట్లాడతాడు. నీకు ఏంజెల్ తప్ప ఎవరూ లేరు కదా.. ఇంకా ఎవరైనా ఉన్నారా అని అనుమానంగా అడుగుతాడు. వీళ్ల డిస్కషన్ లో నేను ఎందుకులే అనుకున్న మను.. అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు. అయితే.. అందరూ కలిసి ఆపేస్తారు. ఏంజెల్ మరోసారి.. బర్త్ డే గురించి అడుగుతుంది. దానికి మను.. తనకు గుర్తులేదని, మర్చిపోయాను అని చెబుతాడు.
మర్చిపోయావా అని మహేంద్ర అంటే.. అవునని, తన గతం తాలుకూ విషయాలను అన్నింటినీ మర్చిపోయాను అంటాడు. అయితే.. గుర్తు చేయడానికి నేను ఉన్నాను గా అని మహేంద్ర అంటాడు. నీ బర్త్ డే ఎప్పుడో తెలుసుకొని, దానిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసే బాధ్యత నాది అని మహేంద్ర అంటాడు.
Guppedantha Manasu
ఇక, వసుధార ఇంటికి వెళ్లిన తర్వాత రిషి ఫోటో పట్టుకొని తన సంతోషాన్ని పంచుకుంటుంది. మనుగారు.. మీ ఫోటోలతో అందరికీ మాస్క్ లు పెట్టించారని.. అది చూస్తుంటే.. మీరు పక్కనే ఉన్నట్లు అనిపించిందని చెబుతుంది. మీరు ఎక్కడ ఉన్నారు రిషి సర్.. త్వరగా మిమ్మల్ని ఎక్కడ ఉన్నా పట్టుకుంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడే.. వసుకి చక్రపాణి ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెబుతాడు. కనీసం బర్త్ డే కూడా జరుపుకోలేకపోతున్నావ్ కదమ్మా అని చక్రపాణి అంటే.. కాలేజీలో మను గారు చేశారు అని చెబుతుంది. ఆ మాటకు చక్రపాణి సంతోషిస్తాడు. ఈ మను ప్రతిసారీ నీకు మంచి చేస్తున్నాడు అని అంటుంది.
Guppedantha Manasu
తర్వాత.. మను తన కారులో ఇంటికి వెళ్తుంటే...రాజీవ్ వచ్చి అడ్డుపడతాడు. కారుకి ఎలా బైక్ ఎందుకు అడ్డుపెట్టావ్ అని మను సీరియస్ గా అడుగుతాడు. ప్రతిసారీ నువ్వే నాకు అడ్డుపడుతున్నావ్ కదా భయ్యా.. అందుకే ఈ సారి నేను నీకు అడ్డు వచ్చాను అంటాడు. మొదటిసారి నా మరదిలితో రోడ్డుపై ఉంటే తుపాకీ తెచ్చి బెదిరించావ్, రెండోసారి నా మరదలి ఇంటికి వెళితే.. అక్కడికి కూడా వచ్చి వార్నింగ్ ఇచ్చావ్.. ఇక.. మీ ఇద్దరి పోస్టర్లు అంటిద్దాం అని చూస్తే.. ఆ ప్లాన్ ని రివర్స్ చేశావ్.. ఈ రోజు నా మరదలికి ప్రేమగా కేక్ తినిపించాలని చూస్తే... దానికి కూడా నువ్వు అడ్డు వచ్చావ్ అంటాడు.
కాలేజీలో జరిగిన సీన్ మనుకి గుర్తు వస్తుంది. నువ్వు మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తావ్ అనుకోలేదు అని మను అంటాడు. నా మరదలు, నా ఇష్టం, నా సొంతం అని రాజీవ్ అంటాడు. తనేమీ వస్తువు కాదని.. ఒక ఆడపిల్ల అని మను అంటాడు. ఆడపిల్ల మనసును గెలవాలి కానీ.. ఇలా వెంటపడేవాడిని కుక్క అంటారు అని మను అంటాడు. అయితే.. నువ్వు నా మరదలి వెంటనే.. మిషన్ ఎడ్యుకేషన్ పేరిట కుక్కలా తిరుగుతున్నావ్ కదా అని రాజీవ్ అంటాడు. ఇద్దరి మధ్య కాసేపు వాదులాట జరుగుతుంది. వసుధార జోలికి వస్తే ఏం చేస్తావ్ అని రాజీవ్ అంటే... చంపేస్తాను అని మను వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.