సీన్ కట్ చేస్తే.. మాట్లాడుకున్న తర్వాత అప్పూ ఇంటికి వస్తుంది. అప్పూతో పాటు కళ్యాణ్ కూడా వస్తాడు. నువ్వు ఎందుకు వచ్చావ్ అని అప్పూ అడిగితే.. ఆంటీ, అంకుల్ ని పలకరించి వెళతాను అని అంటాడు. అప్పుడే కనకం, మూర్తి అక్కడికి వస్తారు. బాగున్నారా ఆంటీ అని కళ్యాణ్ అంటే... ఇప్పటి వరకు బాగానే ఉన్నామని.. ఇక నుంచి మీరు మా ఇంటికి రాకుండా ఉండటమే బెటర్ అన్నట్లుగా మాట్లాడుతుంది. మూర్తి అయితే.. కళ్యాణ్ ని కలవడానికి వెళ్లినందుకు అప్పూని తిడతాడు. మళ్లీ ఇంకోసారి కళ్యాణ్ కలవద్దని కూడా చెబుతారు.
అలా ఎందుకు అంటున్నారు..? ఏం జరిగింది అని కళ్యాణ్ అడుగుతాడు. ఇప్పటి వరకు మీరు మా ఇద్దరినీ అలా చూడలేదు.. ఇలా అనుకోలేదు.. కానీ సడెన్ గా ఏమైందని అడుగుతారు. మేం ఇద్దరం కలిసి ఉండటం ఎవరు చూశారు..? ఇక్కడికి ఎవరు వచ్చారు అని అడుగుతాడు. కానీ, కనకం, మూర్తిలు ఆ విషయం చెప్పడానికి ఇష్టపడరు. కనకం చెప్పబోతుంటే కూడా మూర్తి ఆపేస్తాడు. అయితే.. ఇక్కడికి ఎవరు వచ్చి గొడవ చేశారో చెప్పకపోతే.. తాను ఇక్కడి నుంచి వెళ్లను అని.. కళ్యాణ్ బీష్మించుకొని కూర్చుంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.