కనకం ఏ మాత్రం తగ్గకుండా ఇచ్చిపడేస్తుంది. కళ్యాణ్ బాబుకి సంస్కారం ఉందని, పెళ్లైన వాడితో తిరిగే బుధ్ధి తన కూతురిది కాదని చెబుతుంది. కానీ.. తాము కళ్లారా చూశామని, కళ్యాణ్ మనసు చెడగొట్టి, నన్ను తప్పించి.. కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవాలని నీ కూతురు చాలా ఆశపడుతోంది అని అనామిక అంటుంది. ధాన్యలక్ష్మి.. వీరావేశంగా నాకు సంస్కారం లేదని.... మరోసారి ఇద్దరూ కలిసి కనపడితే.. వీధిలో రచ్చ చేస్తాను అని అంటుంది. కనకం కూడా మీ కొడుక్కి కూడా... మా అమ్మాయితో మాట్లాడొద్దని చెప్పమని అంటుంది. ఇంకోసారి ఇలా గొడవ చేస్తే... మీ ఇంటికి వచ్చి.. మీ అత్తగారు, మామగారితో మాట్లాడతాను అని కనకం అంటుంది. అయితే... ధాన్యలక్ష్మి మీ కుటుంబాన్ని వీధిలోకి లాగుతాను వార్నింగ్ ఇస్తుంది. ఇక.. కనకం మరింత రెచ్చిపోతుంది. తనలోని మాస్ యాంగిల్ బయటకు తీసి.. వీధిలో తనను ఎదురించి నిలపడే వాళ్లు ఎవరు ఉన్నారో పిలువు అని సీరియస్ అవుతుంది.