Guppedantha Manasu Serial 3rd January episode:రిషిని చూడటానికి వచ్చి...కిడ్నాప్ అయిన వసుధార..!

First Published Jan 3, 2024, 8:14 AM IST

ఒకరోజు మీ కారు సిటీ అవుట్ స్కర్ట్స్ లో దొరికింది కానీ. అందులో మీరు లేరు. తర్వాత హాస్పిటల్ లో మీరు కాదని తెలిశాక.. ప్రాణం లేచివచ్చినట్లు అయ్యింది. అని చెబుతుంది.
 

Guppedantha Manasu


Guppedantha Manasu Serial:మొత్తానికి వసు.. రిషి ఉన్న ప్లేస్ కి చేరుకుంటుంది. రిషిని ప్రేమగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ‘ సర్, ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు సర్, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది’ అని వసు అంటుంది. నాకు ఏమీ కాలేదు కదా వసుధార అంటాడు రిషి. దానికి వసు.. ‘ అలా అనకండి. మీలాంటి వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సర్. నలుగురికి నీడనిచ్చే చెట్టు..మోడుబారిపోకూడదు. మీకు ఈ పరిస్థితి రాకూడదు సర్’ అని వసు అంటుంది. ‘ వసుధార.. అన్నిరోజులు మనవి కాదు కదా. మన టైమ్ కానప్పుడు మన వైభవం, మన పేరు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. మామూల మనిషిలా బతకాల్సి వస్తుంది. అవన్నీ జీవితంలో భాగాలు’ అని రిషి అంటాడు. కానీ వసు మాత్రం ‘ అంందరికీ జరగొచ్చు కానీ మీకు జరగకూడదు. నలుగురికి నీడనిచ్చే చెట్టు పచ్చగా ఉండాలి. అప్పుడే దాని నీడను చేరినవారు, దానిని నమ్మినవారు ప్రశాంతంగా ఉంటారు. అసలు ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్లిపోయారు?  ఏమైపోయారు. అనే భయం, బాధగా ఉన్నాను’ అని చెబుతుంది.

Guppedantha Manasu

డాడ్ ఎలా ఉన్నారు అని రిషి అడగగా.. మీపై బెంగగా ఉన్నారు అని చెబుతుంది. ‘మీకోసం మామయ్యగారు, నేను, అనుపమ మేడమ్ వెతకని ప్లేస్ లేదు, అడగని మనిషి లేదు. అన్నం, నీళ్లు మానేసి మీకు ఏం జరిగిందా అని, వెతుకుతూనే ఉన్నాం సర్. ఒకవైపు పోలీసు ఇన్వెస్టిగేషన్  జరుగుతూనే ఉంది, మరోవైపు మేం వెతుకుతూనే ఉన్నాం. అయినా మీ గురించి ఏమీ తెలియలేదు’ అని అంటుంది. నాకోసం పోలీసులకు ఫిర్యాదు చేశారా అని రిషి షాక్ అవుతాడు. అవునని, ముకుల్ గారు మీ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఒకరోజు మీ కారు సిటీ అవుట్ స్కర్ట్స్ లో దొరికింది కానీ. అందులో మీరు లేరు. తర్వాత హాస్పిటల్ లో మీరు కాదని తెలిశాక.. ప్రాణం లేచివచ్చినట్లు అయ్యింది. అని చెబుతుంది.

Latest Videos


Guppedantha Manasu

మీ ఫోన్ నుంచి ఫోన్ వచ్చిందని, ఒక డెడ్ బాడీ ని ఐడెంటిఫై చేయమన్నారని, అది మీరేమో అని ఒక్క క్షణం గుండె ఆగిపోయిందని, కానీ, అక్కడ ఉందని మీరు కాదని తెలిసిన తర్వాత గుండె పగిలేలా ఏడ్చాను సర్, నేను నా దుఖాన్ని భయటపెడుతున్నాను కానీ, మామయ్యగారు అయితే, తన దుఖాన్ని లోలోపలే పెట్టుకొని బాధపడుతున్నారు. అనుపమ గారు కూడా చాలా భయపడుతున్నారు. నీ కోసం వెతుకుతూ సరిగా కాలేజీకి వెళ్లడం లేదు. బోర్డు మీటింగ్స్ అటెండ్ అవ్వడం లేదు. ఇప్పుడు మిమ్మల్ని చూశాక నా మనసు కుదుట పడింది. అని వసు చాలా బాధగా చెబుతుంది.

Guppedantha Manasu

నేను కనపడకపోతేనే మీరు అంత కంగారుపడ్డారా..? ఒకవేళ నాకు ఏదైనా జరిగితే..? అని రిషి అడుగుతాడు. వెంటనే రిషి నోటికి చెయ్యి అడ్డుపెడుతుంది వసు.. ఇంకోసారి అలా అనొద్దని, దిష్టి తగలకుండా ఉండేందుకే అలా జరిగిందని, మీకు ఏమీ కాదు అని ధైర్యం చెబుతుంది. మిమ్మల్ని కాపాడిన వారికి ఏం చేసినా రుణం పోదు అని చెప్పి.. వాళ్లను నమస్కారం చేస్తుంది. వాళ్లు.. మాత్రం.. అలా నమస్కారాలు పెట్టొద్దని, ప్రమాదంలో ఉన్నాడని సాటి మనిషి అని సాయం చేశామని, ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే సంబరంగా ఉందని, మీరు సంతోషంగా ఉండమని చెబుతారు.

తర్వత... రిషిని వసు చాలా ప్రశ్నలు వేస్తుంది. కానీ, రిషి నొప్పితో బాధపడుతూ ఉంటాడు. అందుకే ఆ విషయాలేమీ చెప్పడు. తర్వాత.. పెద్దమ్మ మందు రాయాలి అని తెస్తే.. వసు తానే రాస్తాను  అని అంటుంది. తానే మందు రాస్తుంది.

Guppedantha Manasu

మరోవైపు ఇంట్లో మహేంద్రకు అనుపమ భోజనం పెడుతూ ఉంటుంది. మహేంద్ర తినకుండా ఆలోచిస్తూ ఉంటాడు. పిలిచి, అదే అడుగుతుంది. కానీ, తనకు ఆకలిగా లేదు అని చెబుతాడు.‘ రిషి కనిపించకుండా పోయాడు. నా కొడుకు ఎక్కడ ఉన్నాడో ఇప్పటి వరకు తెలీదు. శైలేంద్ర ఏమో ఎండీ సీటు కోసం వసుధారను బెదిరిస్తున్నాడు. ఏదైనా చేద్దాం అంటే.. ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు వసుధార కూడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లిందో తెలీదు. ఫోన్ కూడా కలవడం లేదు. ఇలాంటి సమయంలో భోజనం ఎలా చేస్తాను’ అని మహేంద్ర అంటాడు. వసు.. రిషి కోసం వెళ్లిందేమో అని అనుపమ అంటుంది. కానీ మహేంద్ర.. తనకు ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని  మహేంద్ర అంటాడు. వసు వెళ్లిన చోట సిగ్నల్స్ లేవేమో అని అనుపమ సర్ది చెబుతుంది. భోజనం చేయమని బలవంతపెడుతుంది. తర్వాత తింటాను అంటాడు. రిషి మీద ప్రామిస్ చేయమని అడుగుతుంది. సరే అని అంటాడు మహేంద్ర. తర్వాత అనుపమ ఏదో పని ఉందని బయటకు వెళ్తుంది. తనకు భోజనం చేయాలని లేకున్నా నీ కోసం తింటున్నాను అని మనసులో అనుకుంటూ భోజనం చేస్తాడు.

Guppedantha Manasu

మరోవైపు.. వసు కొట్టిన వ్యక్తిని మరో రౌడీ లేపుతాడు. హాస్పిటల్ కి వెళదాం అంటే... వసుని పట్టుకోవాల్సిందే అంటాడు. ఇద్దరూ కలిసి వసు కోసం వెతకడం మొదలుపెడతారు. మరోవైపు రిషికి, వసు నూనె రాస్తూ ఉంటుంది. పెద్దమ్మ వచ్చి గంజి తీసుకొచ్చి ఇస్తుంది. ఆ నీళ్లు తాగించమని చెబుతుంది. వసు తాగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అని వసు అడిగితే, నువ్వు ముట్టుకోగానే నాకు నొప్పి తగ్గిపోయినట్లు ఉంది అని చెబుతాడు.ఆ మాటకు వసు చాలా ఏడుస్తుంది. ఆ పెద్దమ్మ కూడా నువ్వు వచ్చాక.. ఈ బిడ్డ కోలుకున్నాడు అని చెబుతుంది. తర్వాత.. వసు చేతులు కడుక్కోవడానికి బయటకు వస్తుంది.

Guppedantha Manasu

అప్పుడే రౌడీలు వచ్చి, వసుని చూస్తారు. వసుని కిడ్నాప్ చేయడానికి కర్చీఫ్ కి మత్తుమందు పెడతారు. వచ్చి.. దానిని వసు మూతికి పెట్టి,  కిడ్నాప్ చేస్తూ ఉంటారు. అది ఆ పెద్దమ్మ చూస్తుంది.  వసుని కిడ్నాప్ చేసిన విషయం పెద్దాయనకు, రిషికి చెబుతుంది.  రిషి.. తాను వెళ్లి వసుని కాపాడాలని చూస్తాడు. కానీ, లేవలేడు. దీంతో.. ఎవరికైనా ఫోన్ చేసి చెప్పమని అడుగుతారు. వెంటనే రిషి ఫోన్ అందుకుంటాడు.

Guppedantha Manasu

మరోవైపు వసుని కిడ్నాప్ చేశామని రౌడీలు.. శైలేంద్రకు చెబుతారు. వీడియో కాల్ చేసి మరీ చూపిస్తారు. అది చూసి శైలేంద్ర చాలా సంతోషిస్తాడు. తనకు చాలా సంతోషంగా ఉంది అని చెబుతూ ఉంటాడు. తనను అక్కడే ఉంచమని, తాను వస్తాను అని చెబుతాడు. చిన్న అవకాశం వచ్చినా పారిపోతుందని, జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. తర్వాత.. తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని సంతోషిస్తాడు. ఇన్నాళ్లకు వసుధారపై పగ తీర్చుకునే అవకాశం వచ్చిందని సంతోషిస్తాడు. వెంటనే దేవయాణి వచ్చి... ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావ్ అంటే.. తర్వాత చెబుతాను, రిషిధార తనకు చేసిన అవమానానికి బదులు ఇవ్వబోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళతాడు.

Guppedantha Manasu

శైలేంద్ర వెళ్తుంటే.. ధరణి వచ్చి.. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. బయటకు వెళ్తున్నాను అంటే.. నేను కూడా వస్తాను అంటుంది. వద్దు అంటాడు. అత్తయ్యగారిని కూడా తీసుకువెళ్లండి అంటుంది. అమ్మకి కూడా చెప్పేది కాదు నేనే వెళ్లాలి.. ఇంపార్టెంట్ అని  అంటాడు.  అవకాశంగా తీసుకొని ధరణి.. పాత విషయాలు గుర్తు చేసి శైలేంద్రకు సెటైర్లు వేస్తుంది. ఆ మాటలకు మండి.. శైలేంద్ర బయటకు వెళ్లిపోతాడు. మళ్లీ ఏదైనా ప్లాన్ చేశాడేమో అని ధరణి మనసులో అనుకుంటుంది. 

click me!