Naga Panchami Serial Today Episode:ప్రాణ త్యాగం చేస్తున్న పంచమి, మోక్షను వలలో వేసుకుంటున్న మేఘన..!

Published : Jan 02, 2024, 10:12 AM IST

సుబ్రహ్మణ్య స్వామి పాదాల వద్ద తన తల పగలకొట్టుకుంటూ ఉంటుంది. తల నుంచి రక్తం కారిపోతూ ఉంటుంది. తర్వాత స్పృహ తప్పి పంచమి పడిపోతుంది.

PREV
19
Naga Panchami  Serial Today Episode:ప్రాణ త్యాగం చేస్తున్న పంచమి, మోక్షను వలలో వేసుకుంటున్న మేఘన..!
Naga panchami

Naga Panchami Serial: మోక్షను ఎలా కాపాడుకోవాలో తెలీక ఓవైపు, నాగలోకానికి, ముఖ్యంగా తన తల్లి పగను తీర్చలేక మరోవైపు పంచమి సతమతమౌతూ ఉంటుంది. ఇంట్లో నుంచి అడవుల్లోకి వెళ్లిపోతూ ఉంటుంది. మరోవైపు పంచమి కనిపించకపోవడంతో.. మోక్ష కుటుంబ సభ్యులందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. పంచమి ని ఇంటి నుంచి గెంటేసినందుకు కొందరు బాధపడుతుంటారు.

29
Naga panchami

వైదేహి కూడా  ఆలోచనలో పడుతుంది. కానీ, మిగిలిన ఇద్దరు కోడళ్లు మాత్రం పంచమి వెళ్లిపోయినందుకు సంతోషిస్తారు. పంచమి విషయంలో వైదేహి చేసిందే కరెక్ట్ అని , మోక్ష ఫారిన్ నుంచి వచ్చాడని.. అలాంటి అతనికి ఈ విలేజ్ అమ్మాయి అస్సలు సెట్ అవ్వదు అని చెబుతూ ఉంటారు. పంచమి మళ్లీ తిరిగి రాదని..వాళ్లిద్దరూ సంతోషపడతారు.

39
Naga panchami

మరోవైపు పంచమి.. మోక్షను కాపాడటానికి సుబ్రహ్మణ్య స్వామి చెంతకు చేరుకుంటుంది. మోక్షతో పెళ్లి జరిగిన సందర్భాన్ని , మెక్షతో గడిపిన క్షణాలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి చేతులతో నమస్కరించి ఏడుస్తూ ఉంటుంది.

49
Naga panchami

‘20 ఏళ్లు రాకముందే.. 100ఏళ్ల అనుభవాన్ని చూశాను. అయినా నేను ఎవరికీ అక్కరలేకుండా పోయాను. నా పుట్టుక నాకు తెలీదు. పగతో నాకు సంబంధం లేదు. నామ మాత్రానికి పెళ్లి, కాపురం, దాంపత్య జీవితం అంతా కలగా మిగిలిపోయింది. భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది. ఏ పాపం ఎరగని నాకు.. చోటు లేదు పొమ్మంటోంది లోకం. అందుకే వచ్చేశాను స్వామి. ఇంకెక్కడికీ వెళ్లను. అలసిపోయి వచ్చాను స్వామి. మీ పాదాల వద్ద.. ప్రశాంతంగా నిద్రపోతాను. అందరిలాగానే నువ్వు కూడా నన్ను తరిమివేయవద్దు. నన్ను ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోనివ్వండి స్వామి..’ అని ఏడుస్తుంది.

తన కొడుకు జీవితంలో నుంచి వెళ్లిపోమ్మని వైదేహి చెప్పిన మాటలను తలుచుకొని పంచమి మరింత ఎక్కువగా ఏడుస్తుంది. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పాదాల వద్ద తన తల పగలకొట్టుకుంటూ ఉంటుంది. తల నుంచి రక్తం కారిపోతూ ఉంటుంది. తర్వాత స్పృహ తప్పి పంచమి పడిపోతుంది.
 

59
Naga panchami

మరోవైపు పంచమి కోసం మోక్ష కంగారుపడిపోతూ ఉంటాడు. పంచమి.. తన పుట్టింటికి ఏమైనా వెళ్లిందా అని తెలుసుకోవడానికి ఫోన్ చేస్తాడు.  వాళ్లు పంచమి బాగుందా అని అడిగేసరికి.. పంచమి అక్కడి కూడా రాలేదు అనే విషయం అర్థమౌతుంది. దీంతో, పొరపాటున ఫోన్ డైల్ చేశాను అని చెబుతాడు. కానీ, పంచమి తల్లి కంగారుపడుతుంది. ఏమైందని, పంచమి ఎలా ఉంది అని అడుగుతుంది. దానికి మోక్ష.. పంచమి అక్కడికి వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి అని అడుగుతాడు. దీంతో, పంచమి కనిపించడం లేదు అనే విషయం ఆమెకు అర్థమౌతుంది. దీంతో, ఆమె కంగారుపడుతుంది. ఎవరైనా ఏదైనా అన్నారా అని అడుగుతుంది. ఎవరూ ఎమీ అనలేదని.. నాతోనే చిన్న గొడవ కారణంగా ఇంటి నుంచి వెళ్లిందని మోక్ష చెబుతాడు. కానీ, పంచమి ఎక్కడికి వెళ్లినా తన దగ్గరకు వస్తుంది అని చెప్పి, ఫోన్ కట్ చేస్తాడు.

తర్వాత, పంచమి ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు.  పంచమి తప్పు లేకపోయినా, తానే తొందరపడ్డాను అని.. అందుకే తనను వదిలి వెళ్లిపోయిందని బాగా ఫీలౌతాడు.

69
Naga panchami

మరోవైపు నాగలోక యువ రాజు, మరో నాగ కన్య ఇద్దరూ కలిసి పంచమి కనిపించడం లేదని మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి ఆ నాగకన్య.. ముక్కోటి ఏకాదశి రోజున మీరు  మోక్షను చంపేసి నాగలోకానికి వెళ్లిపోవచ్చు కదా అని అడుగుతుంది. యువరాణి పంచమిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అందుకే, అలా చేయడం లేదు కదా అని అడుగుతుంది.

79
Naga panchami

దానికి యువరాజు సైతం.. యువరాణిని పెళ్లి చేసుకోవాలి అనేది తన బలమైన కోరిక అని చెబుతాడు. తాను అసలు ఇక్కడికి రావడానికి కారణం అదేనని,  ఆ ఆశతోనే నాగదేవత అనుమతి తీసుకొని వచ్చానని చెబుతాడు. అయితే, ఇప్పుడు పంచమి కనిపించకపోవడంతో మీ ఆశలు అడియాశలయ్యాయని నాగకన్య మేఘన అంటుంది. పంచమి దగ్గర నాగ శక్తులు లేకపోవడంతో, తాను ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోతున్నాను అంటాడు. తన వల్ల కావడంలేదని.. మేఘనను ప్రయత్నించమని అడుగుతాడు. అయితే, మేఘన తాను ప్రస్తుతం శాపగ్రస్తురాలినని, తన దగ్గర పంచమి ఎక్కడ ఉందో పసిగట్టే శక్తులు ఏమీ లేవని చెబుతుంది.

వెంటనే యువరాజు..నీ దగ్గర మంత్ర శక్తులు ఉన్నాయి కదా.. వాటి సహాయంతో చూడమని అడుగుతాడు. దీంతో.. ఆమె ప్రయత్నిస్తుంది. ఆమె అరచేతిలో అడవి మాత్రమే కనపడుతుంది. పంచమి కనపడదు. ఏదైనా లోయలో పడి ఆత్మహత్య చేసుకుంటే కూడా పంచమి మనకు కనపడదు అని మేఘన చెబుతుంది.దానికి యువరాజు షాకౌతాడు.

అయితే, మేఘన వెంటనే ధైర్యం చెబుతుంది. ‘ పంచమి అంత పిరికిది కాదు. మీరు పంచమిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు కాబట్టి, నాగ మణి తెచ్చి, మోక్షను కాపాడతాను అని మీరు మనసులో బలంగా అనుకొండి, అప్పుడు పంచమి మీకు కచ్చితంగా కనపడుతుంది. పంచమి కోసం నేను కూడా నా ప్రయత్నం చేస్తాను. మీరు కూడా చేయండి’ అని చెప్పి వెళ్లిపోతుంది.
 

89
Naga panchami

మరోవైపు పంచమి కనిపించక మోక్ష బాధపడుతూ ఉంటాడు. తాను పంచమిపై చెయ్యి  చేసుకున్నానని, తన చదువు, సంస్కారం ఎక్కడికి పోయాయో అని ఫీలౌతాడు. పంచమి ఏ తప్పు చేసిందని కొట్టావ్? నిన్ను బతికించుకోవడానికే కదా అతను అంత కష్డపడుతోంది అని.. మోక్ష తనతో తానే మాట్లాడుకుంటాడు. పంచమి వెళ్లిపోవడానికి కారణం తానే అని.. తనను తాను తిట్టుకుంటూ ఉంటాడు. పంచమిని పట్టుకొని, కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని, అప్పుడే తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లభిస్తుందని అనుకుంటాడు.

99
Naga panchami

మరోవైపు మేఘన దూరం నుంచి మోక్షను గమనిస్తుంది. మెక్షను తన వైపు తిప్పుకోవడానికి ఇదే మంచి సమయం అనుకొని.. ఎవరూ చూడకుండా  ఏదో మంత్రం వేసి.. బొద్దింకను తయారు చేస్తుంది. ఆ బొద్దింకను మోక్షవైపు పంపిస్తుంది. అది వెళ్లి మోక్ష మీద పాకుతూ ఉంటుంది. దానిని వదిలించుకోవడానికి మోక్ష ప్రయత్నిస్తూ ఉంటాడు. దానిని అడ్వాంటేజ్ గా తీసుకున్న మేఘన. బొద్దింకను తీస్తాను అంటూ.. మోక్షను  హత్తుకోవాలని చూస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!

Recommended Stories