Guppedantha Manasu 9th January Episode: అమ్మని చంపింది అన్నయ్యేనా..? రిషిలోనూ శైలేంద్రపై అనుమానం..!

First Published Jan 9, 2024, 8:57 AM IST

తనను ఇంకోసారి అనుమానించకుండా ఉండేలా డైలాగులు కొడతాడు. అతని డైలాగులకు మహేంద్ర కూడా పడిపోతాడు.

Guppedantha Manasu

Guppedantha Manasu 9th January Episode: భద్ర.. తాము ఉన్న ప్లేస్ కి రావడం వసుధారకు నచ్చదు. ఇదే విషయం గురించి మహేంద్రకు ఫోన్ చేసి మీరు భద్రకు ఈ ఇంటి సమాచారం చెప్పారా అని అడుగుతుంది. మహేంద్ర తాను ఏమీ చెప్పలేదు అనే సరికి భద్రపై వసుధారకు అనుమానం మొదలౌతుంది. వసు ఆలోచిస్తూ ఉండగానే.. చక్రపాణి వచ్చి.. ‘ అతను సెక్యురిటీ అంటున్నాడు కదమ్మా, మరి అతనికి అల్లుడి గారి గురించి తెలిస్తే ఏమయ్యేది? సెక్యురిటీ అంటే..  ఇంట్లో వ్యక్తితో సమానం కదమ్మా’ అని అడుగుతాడు. వసు మాత్రం‘ అతను శైలేంద్ర మనిషి అనే అనుమానం నాకు ఉంది నాన్న, మామయ్యను అడిగాను.. మన ఇంటి అడ్రస్ గురించి చెప్పలేదంట. అయినా తెలుసుకొని వచ్చాడు అంటే కచ్చితంగా శైలేంద్రే  చెప్పి ఉంటాడు’ అని వసు అంటుంది.

Guppedantha Manasu

దీంతో..చక్రపాణి.. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇప్పటి నుంచి  అల్లుడి గారికి తాను కాపలా ఉంటాను అని, ఎవరైనా మీ జోలికి రావాలంటే.. ముందు నన్ను దాటి వెళ్లాలి అని అంటాడు. నాకు తెలీకుండా నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు నాన్న, మీకు చెప్పకుండా నేను కూడా ఎక్కడికి వెళ్లను అని వసు అంటుంది. సరే అని చక్రపాణి అంటాడు.

Latest Videos


Guppedantha Manasu

మరోవైపు మహేంద్ర ఇంటి ముందు తిరుగుతూ భద్ర గురించే ఆలోచిస్తూ ఉంటాడు.  అదే సమాయానికి భద్ర అక్కడకు వస్తాడు. రాగానే భద్రని మహేంద్ర ఆపుతాడు. ఎక్కడి నుంచి వస్తున్నావ్ అని మహేంద్ర అడుగుతాడు. వసుధార మేడమ్ దగ్గరకు వెళ్లాను అని చెబుతాడు.  ఎందుకు వెళ్లావ్ అని మహేంద్ర అడిగితే.. మేడమ్ క్షేమంగా ఉన్నారా లేదో తెలుసుకుందాం అని అంటాడు. అసలు వసుధార అక్కడ ఉందనే విషయం  నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు.  వసుధార మేడమ్ చెప్పిందని, ఫణీంద్ర సర్ కి చెప్పారంట.. కాలేజీలో ఎవరో ఏదో అనుకుంటుంటే.. విన్నానని... అందుకే మేడమ్ క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి వెళ్లాను అని చెబుతాడు. అంతేనా.. ఇంకేం లేదా అని మహేంద్ర అంటే.. ఏం లేదు అని అంటాడు. వెంటనే మళ్లీ భద్ర.. నన్ను అనుమానిస్తున్నారా? నా మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అంటాడు. అదేం లేదు అని మహేంద్ర అంటాడు. మరి.. ఇదంతా ఏంటి అని భద్ర అడిగితే.. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు అని మహేంద్ర అంటాడు. భద్ర మాత్రం.. వీర లెవల్లో ఎమోషనల్ డైలాగులు కొడతాడు. తనను ఇంకోసారి అనుమానించకుండా ఉండేలా డైలాగులు కొడతాడు. అతని డైలాగులకు మహేంద్ర కూడా పడిపోతాడు.

Guppedantha Manasu

మరోవైపు వసుధార.. రిషి దగ్గరకు వెళ్తుంది. ఏమైంది వసుధార.. ఇంటికి ఎవరు వచ్చారు..? మళ్లీ నాపై  ఎవరైనా ఎటాక్ చేయడానికి వచ్చారా? అని అడుగుతాడు.  ఎవరు రాలేదని, కంగారు పడొద్దు అని  వసు అంటుంది. తర్వాత... అమ్మ కేసు ఏమైందని  రిషి అడుగుతాడు. అయితే.. శైలేంద్ర ను ముకుల్ ఇన్వెస్టిగేట్ చేసిన విషయం మొత్తం వసు.. రిషికి వివరిస్తుంది. మరి.. అమ్మని ఎవరు చంపారు అని రిషి అడిగితే.. త్వరలోనే అన్ని నిజాలు తెలుస్తాయి అని వసు అంటుంది.

అయితే.. రిషి మాత్రం తనకే ఎన్ని  కష్టాలు ఎందుకు అని బాధపడతాడు. అమ్మని ప్రేమగా చూసుకోవాలని, అమ్మ ప్రేమ పొందాలని అనుకుంటే అమ్మ దూరమైంది. తర్వాత అమ్మను చంపిన హంతకులను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే.. ఇలా జరిగింది అని రిషి బాధపడతాడు. అయితే.. వసు ఎక్కువగా ఆాలోచించకండి అని సర్ది చెబుతుంది. రిషి మాత్రం.. అమ్మ చావు గురించి నేను తెలుసుకోవాలి అంటాడు. తర్వాత.. అసలు మనం ఇక్కడ ఎందుకు ఉండాలి..? ఎవరి కంటా పడకుండా ఎందుకు దాక్కోవాలి అని అడుగుతాడు . అందరినీ ఫేస్ చేద్దాం అని వెళ్లిపోదాం అని లేవబోతాడు.

Guppedantha Manasu

కానీ వసు అడ్డుకుంటుంది.  ఈ సమయంలో మీ ఉనికి.. మీ నీడకు కూడా తెలియకూడదని, నా వెంట రౌడీలు ఎలా పడ్డారో.. ఎలా కిడ్నాప్ చేశారో మీరు కూడా చూశారు కదా. వాళ్లు మీకోసం వెతుకుతూనే ఉన్నారు. వాళ్ల కంట పడకూడదని, ఇక్కడ ఉండటమే క్షేమం అని వసు చెబుతుంది. మన శత్రువు ఎవరై ఉంటారు..? ఇవన్నీ మా అన్నయ్యే చేసి ఉంటాడు అంటావా? వీటంతటికీ కారణం మా అన్నయ్యేనా అని రిషి అడుగుతాడు. అయితే... అన్ని నిజాలు తెలుస్తాయని.. దానికంటే మీరు ముందు కోలుకోవాలి అని, అప్పుడు మన శత్రువు ఎవరు..? దేని కోసం ఇదంతా చేస్తున్నారు అనే విషయాలు తెలుస్తాయి అని  వసు చెబుతుంది.

Guppedantha Manasu

ఇంట్లో ధరణి ఆలోచిస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న శైలేంద్ర.. ధరణిని చూస్తాడు. ధరణి అంతగా ఏం ఆలోచిస్తోంది..? బుర్రలో గుజ్జు ఉన్నవారు కదా ఆలోచించాలి..? ఇది ఎందుకు ఆలోచిస్తోంది అనుకుంటాడు. ఈ క్రమంలో చూసుకోకుండా గోడను కొట్టుకుంటాడు. మరోవైపు ధరణి.. ‘ వసుధార సడెన్ గా వాళ్ల నాన్న దగ్గరకు ఎందుకు వెళ్లింది..? తండ్రి మీద ప్రేమ తో వెళ్లిందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు వెళ్లింది..? వసుధార రిషిని కాపాడి ఉంటుంది..  అందుకే.. రిషిని  వాళ్ల నాన్న ఇంటికి తీసుకొని వెళ్లి ఉంటుంది’ అని ధరణి అనుకుంటూ ఉంటుంది. నిజంగా వసు.. రిషిని కాపాడి ఉంటే.. తాను ఒక్కసారైనా రిషిని చూడాలి.. అన్నింటికీ కారణం మా ఆయనే.. ఆయన వచ్చినప్పటి నుంచి ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. ఎండీ సీటు కోసం రిషిపై పగ పెంచుకున్నాడు. రిషిని అవమాన పడేలా చేసి, ఇంటికి దూరం అయ్యేలా చేశాడు అని, రిషిని ఎలా చూడాలి? వసుధార వాళ్ల ఇంటి అడ్రస్ నాకు తెలీదు కదా? చిన్న మామయ్యని కలిస్తే బాగుంటుంది కదా .. ఇలా అన్ని విషయాలను ధరణి ఆలోచిస్తూ ఉంటుంది.

ధరణిని చూసుకుంటూ.. శైలేంద్ర రెండు మూడు సార్లు గోడ తలకు కొట్టుకుంటూ ఉంటాడు. ధరని ఎక్కడికి వెళ్తుందా అని శైలేంద్ర ఫాలో అవుతూ ఉంటాడు. భద్ర.. మహేంద్ర ఇంట్లో కూర్చొని పాటలు వింటూ ఉంటాడు. పాటలు వింటూ.. వసుధార తనతో ప్రవర్తించిన తీరు భద్రకు అనుమానం కలిగిస్తుంది. మహేంద్ర కూడా తనతో అలా మాట్లాడటం తో భద్రకు అనుమానం వస్తుంది. ఏదో ఉండే ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయానికి  ధరణి.. ఆ ఇంటికి చేరుకుంటుంది.

Guppedantha Manasu


ధరణిని భద్ర పలకరిస్తాడు.. మీరేంటి మేడమ్ ఇక్కడికి వచ్చారు అని  అడుగుతాడు. ధరణి మత్రం.. అతనిని పట్టించుకోకుండా.. చిన్న మామయ్య అని పిలుచుకుంటూ వెళ్తుంది. మహేంద్ర ఇంట్లో లేడని బయటకు వెళ్లారు అని చెబుతాడు. అయితే.. తాను వసుధార దగ్గరకు వెళ్దాం అని అనుకున్నాను అని ధరని చెబుతుంది. ధరణి ని వసుధార దగ్గరకు తీసుకువెళ్తే.. తనకు ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా అని భద్ర ఆలోచిస్తాడు. ఈలోగా ధరణి.. మహేంద్రకు ఫోన్  చేద్దాం అని బయటకు వచ్చే సరికి.. శైలేంద్ర కనపడతాడు.

వెంటనే భర్త దగ్గరకు వెళ్తుంది. వెళ్లి.. కారు ఎక్కి.. ఇంటికి వెళ్దాం పదండి.. ఇక్కడ ఎవరు లేరు అని ధరణి అంటుంది. తర్వాత.. మీరు నా మీద నిఘా పెట్టారు, ఫాలో అవుతూ వచ్చారు అని సెటైర్లు వేస్తుంది. ఛాన్స్ దొరికింది కదా అని..  ధరణి.. సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంది. హద్దుల్లో ఉండమని శైలేంద్ర.. ధరణి తో అంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.

click me!