ఆమెకు ఆపరేషన్ చేయించినా చూపు రాదు. కనుగుడ్లు బాగున్నాయి కానీ, నరాలు సరిగా లేవు. నాగ లక్ష్మికి ఐదు శాతం మాత్రమే ఒక కంటితో చూడగలదు. అయితే ఒక ఇంట్లో కాసేపు నడిస్తే... ఏది ఎక్కడ ఉందో అర్థం చేసుకుంటుంది. నా చెల్లి బాగోగులు నా భార్యనే చూసుకుంటుంది. అలాంటి నాగ లక్ష్మి వేరే ఇంటికి కోడలిగా వెళితే మరింత కష్టం అవుతుంది.