Guppedantha Manasu 6th march Episode:వసు, మను కొత్త ప్రేమ జంట.. కాలేజీలో పోస్టర్లు, అనుపమై ఏంజెల్ అనుమానం

First Published | Mar 6, 2024, 9:34 AM IST

మొన్న మీరు అడిగారు కదా అందుకే నేను అడుగుతున్నాను అని అంటుంది. అడిగితే.. పరిచయం ఉన్నట్లేనా అని మను అంటాడు. ఇలా వీళ్లు మాట్లాడుకుంటూ ఉంటే.. శైలేంద్ర వస్తాడు.

Guppedantha Manasu


Guppedantha Manasu 6th march Episode: వసు దగ్గరకు ఏంజెల్ వస్తుంది. ఏంజెల్ తో.. వసు.. మను గురించి ఏమైనా తెలుసా అని అడుగుతుంది. తనను మొన్న నువ్వే కదా పరిచయం చేశావ్.. అలా మాత్రమే నాకు తెలుసు అని ఏంజెల్ చెబుతుంది. ఎందుకు అంటే.. అనుపమ మేడమ్ కి మను తెలుసేమో అనే అనుమానంగా ఉంది అని అంటుంది. అవునా.. నాకు అనిపించలేదే అని ఏంజెల్ బదులిస్తుంది.

Guppedantha Manasu

తర్వాత.. అనుపమ మేడమ్ ని మీరు అత్తయ్య అని ఎందుకు పిలుస్తున్నారు అని మను అడిగిన ప్రశ్న ఏంజెల్ కి గుర్తుకు వచ్చి.. వసు కి చెబుతుంది. అప్పుడే.. అటుగా మను వస్తాడు. వసుధార షాకౌతుంది. ఏంజెల్ మాత్రం చాలా కాజ్యువల్ గా.. రండి మనుగారు.. మీ గురించి మాట్లాడుకుంటున్నాం అని చెబుతుంది.

Latest Videos


Guppedantha Manasu

మను గారు అవసరం లేదు.. మను అంటే చాలు అని అంటాడు. తర్వాత.. నా గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది అని అడుగుతాడు. దానికి వసుధార ఏమీ లేదు అని అంటుంది. కానీా.. ఏంజెల్ అదేంటి వసుధార.. నన్ను అడిగిన ప్రశ్న.. మనుని అడిగితే సరిపోతుంది కదా అని అంటుంది.వసుధార వద్దు అని సైగ చేస్తున్నా.. ఏంజెల్ వినిపించుకోకుండా... మీకు మా అత్తయ్య ఎలా తెలుసు అని అడుగుతుంది. లేదంటే.. మా అత్తయ్యకు మీరు ఎలా తెలుసు అని అడుగుతుంది. ఎందుకండి అని మను అంటే.. మొన్న మీరు అడిగారు కదా అందుకే నేను అడుగుతున్నాను అని అంటుంది. అడిగితే.. పరిచయం ఉన్నట్లేనా అని మను అంటాడు. ఇలా వీళ్లు మాట్లాడుకుంటూ ఉంటే.. శైలేంద్ర వస్తాడు.

Guppedantha Manasu

రావడం రావడమే.. మనుకి, వసుధారకు గుడ్ మార్నింగ్ చెబుతాడు. తర్వాత.. ఏంజెల్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అంటాడు. ఏంటో ఈ కాలేజీకి ఎవరెవరో వస్తూ ఉంటారని, కొత్తవాళ్లు ఎక్కువైపోయారని, ఒక్కోసారి ఇది డీబీఎస్టీ కాలేజీలా కాకుండా.. ఇంకేదో కాలేజీలా అనిపిస్తూ ఉంటుందని సెటైర్ వేస్తాడు. అయినా మీరు ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నట్లున్నారు కదా.. నాకు కూడా గ్రూప్ డిస్కషన్స్ అంటే చాలా ఇష్టం. టాపిక్ చెప్పండి నేను కూడా మాట్లాడతాను అంటాడు. దానికి వసుధార సీరియస్ అవుతుంది. మాకు నీతో డిస్కస్ చేయాలనే ఆలోచన లేదని... మాకు మేమే చేసుకుంటామని.. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లొచ్చు అని చెబుతుంది. దీంతో.. మనసులో శైలేంద్ర.. నేను , రాజీవ్ వేసే ప్లాన్లకు మీ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం అనుకుంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu

ఇక.. కూరగాయల కోసం బయటకు వెళ్లి వస్తున్న చక్రపాణికి రాజీవ్ ఎదురౌతాడు. మీరు ఇంట్లో లేరని.. మీ కోసం ఇక్కడిదాకా వచ్చాను అని రాజీవ్ చెబుతాడు.  ఎందుకు వచ్చావ్ అని చక్రపాణి అంటే... వసుని నాతో పెళ్లి ఒప్పించాలని, ఎలాగూ రిషి లేడు కాబట్టి.. మీరే పెళ్లికి ఒప్పించాలని.. లేకపోతే.. వసు జీవితం నాశనం చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. నువ్వు తిట్టి, ఆ మనుగాడు తిట్టి... అందరికీ నేను ఎలా కనపడుతున్నాను అని అడుగుతాడు. వెధవలా కనపడుతున్నావ్ రా అని చక్రపాణి తిడతాడు. అయితే.. ఒకప్పుడు మీరు నాతో ఎలా ఉండేవారని.. ఇఫ్పుడు ఇలా తిడుతున్నారని.. కాలానికి తగినట్లు మారిపోతే ఎలా అని అడుగుతాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని లేకపోతే.. నీ సంగతి చూస్తాను అని చక్రపాణి సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. అయినా కూడా రాజీవ్ పెద్దగా పట్టించుకోడు.

Guppedantha Manasu

తన దగ్గర దాచుకున్న తాళి బయటకు తీస్తాడు. ఆ రోజు తాను వసుధార మెడలో కట్టాల్సిన తాళి అని.. కానీ వసు తన మెడలో తానే తాళి వేసుకొని తప్పించుకుందని గుర్తు చేస్తాడు. అప్పడంటే సొంతంగా తాళి కట్టుకుందని.. కానీ.. ఈసారి మాత్రం.. తన చేతిలో ఉన్న తాళి కట్టించుకోవాల్సిందేనని, రెండేళ్లుగా ఈ తాళిని తాను మోస్తున్నానని.. వసుధార మెడలో ఈ తాళి పడే సమయం వచ్చిందని.. అలా జరగకపోతే.. నా విశ్వరూపం చూపిస్తాను అంటాడు. కానీ రాజీవ్ బెదిరింపులను చక్రపాణి పట్టించుకోడు.  అయితే.. రాజీవ్ వెళ్లేముందు.. వసుకి మీ బావ వచ్చాడు అని చెప్పండి అనేసి వెళ్లిపోతాడు. వీడి విషయంలో వసుని జాగ్రత్తగా ఉండమని చెప్పాలని చక్రపాణి అనుకుంటాడు.

ఇక.. కాలేజీలో వసుధారకు చక్రపాణి ఫోన్ చేస్తాడు.  రాజీవ్ తనకు ఎదురయ్యాడని చెబుతూ ఉంటాడు. వెంటనే వెనక నుంచి రాజీవ్ ఇచ్చి..,. ఆ ఫోన్ లాక్కుంటాడు. మీ నాన్న మునుపటిలా మారిపోయి.. నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు అని అంటాడు. వసు సీరియస్ అవుతుంది. మామయ్య మారిపోయి మన పెళ్లి చేస్తాడు అని.. జాగ్రత్త వసు, తిన్నావా..? టైమ్ కి తింటూ ఉండూ.. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి.. నీకు ఏదైనా అయితే తట్టుకోలేను అని చెప్పేసి.. చక్రపాణి చేతిలో ఫోన్ పెట్టేసి వెళిపోతాడు. నేను మళ్లీ ఫోన్ చేస్తాను అని చక్రపాణి అంటే.. వాడితో జాగ్రత్త నాన్న అని వసుధార చెబుతుంది.
 

Guppedantha Manasu

ఇక.. కాలేజీలో ఏంజెల్ కారు ప్రాబ్లం వస్తుంది. నేను చూడనా అని మను అంటే... నువ్వు ఏమైనా మెకానిక్ వా అని అనుపమ ఎంట్రీ ఇస్తుంది. అయితే.. తాను ప్రొఫెషనల్ మెకానిక్ కాదని.. కాకపోతే చిన్న రిపేర్లు చేయగలను అంటాడు.  అతను కారు చెక్ చేస్తే ఏమౌతుంది, కారు ప్రాబ్లం వస్తే ఇంటికి ఎలా వెళ్తాం అని ఏంజెల్ అడిగితే, క్యాబ్ లో వెళ్లకూడదా అని సీరియస్ గా అడుగుతుంది. ఎందుకు అంత సీరియస్ అవుతున్నావ్ అని ఏంజెల్ అడుగుతుంది. 

Guppedantha Manasu

నేనేమీ సీరియస్ అవ్వడం లేదని అనుపమ అంటుంది కానీ.. ఏంజెల్ ఊరుకోదు. మను టాపిక్ వస్తేనే నువ్వు సీరియస్ అవుతున్నావ్ అంటుంది.  మీ ఇద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉందా అని అడుగుతుంది. లేదు అని అనుపమ అంటుంది.  పరిచయం ఉందా అని అడుగుతుంది. దానికి కూడా అనుపమ సమాధానం ఇవ్వదు. కానీ.. ఏంజెల్ ఒప్పుకోదు. నువ్వు ఏదో దాస్తున్నావని.. అది మీ ఇద్దరి కళ్లల్లో తెలుస్తోంది అని  అంటుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న గతం చెబుతావా లేదాఅని ప్రశ్నిస్తుంది. కానీ.. అనుపమ మాత్రం.. గతం ఏమీ లేదని.. తాను ఒంటరిదానినని.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేయకు అని అంటుంది. క్యాబ్ బుక్ చేయనా అని మను అడిగితే.. అనుపమ తిడుతుంది. దీంతో.. మను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఏంజెల్ ని క్యాబ్ బుక్ చేయమని అడుగుతుంది. అనుపమ ప్రవర్తనను వసు దూరం నుంచి చూస్తుంది. ఈవిడ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అని అనుకుంటుంది.

Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే.. రాత్రిపూట.. రాజీవ్ కాలేజీలోకి అడుగుపెడతాడు. తన దగ్గర ఉన్న వసు, మనుల ఫోటోలను కొత్త ప్రేమ జంట పేరిట పోస్టర్లుగా తయారు చేస్తాడు. వాటిని కాలేజీ గోడలపై అంటించడం మొదలుపెడతాడు. ఇలా చేయడం తప్పు అని తెలిసినా కూడా తప్పక  చేస్తున్నానని.. నీ పరువు బజారులో పెడుతున్నందుకు తనకు బాధగా ఉన్నా..త ప్పక చేస్తున్నాను అంటాడు.ప్రతి విషయంలో ఈ మను తనకు అడ్డు వస్తున్నాడని.. అందుకే.. తాను ఇలా చేయాల్సి వచ్చిందని, క్షమించు వసు అని అనుకుంటాడు. క్యాంపస్ మొత్తం ఆ పోస్టర్లు అంటిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!