ఇక.. అపర్ణ వచ్చి.. ఇంట్లో ధాన్యలక్ష్మి చేసిన పెంట గురించి అత్తగారు ఇందిరాదేవి తో చెబుతుంది. మీరు ఇంట్లో విషయాలు అస్సలు పట్టించుకోవడం లేదని అపర్ణ ముందు వాపోతుంది. ధాన్యలక్ష్మి ఏమైనా అన్నదా అని అడిగితే... నన్ను అయితే.. తోటికోడలుగా భరిస్తాను. కానీ.. ఈసారి మా ఆయనపై అరిచింది అని చెబుతుంది. సుభాష్ పై అరిచిందా అని షాకౌౌతుంది. ప్రకాశం తప్పు చేస్తే... ఆయన మందలిస్తుంటే.. తన భర్త పై అరుస్తారా, అవమానిస్తారా అంటూ అరిచిందని చెబుతుంది. ఆ మాటలకు మా ఆయన చాలా చిన్నబుచ్చుకున్నారని.. నా తమ్ముడిని ఒక్క మాట అనే హక్కు కూడా నాకు లేదా అని బాధపడ్డారు అని చెబుతుంది. అయ్యో అని ఇందిరాదేవి అనుకుంటుంది. అయితే.. వాళ్లిద్దరూ అన్నదమ్ములు మళ్లీ కలిసిపోతారని వాళ్లకు అంత ప్రేమ ఉందని, ఆ విషయంలో తనకు ఆ భయం లేదని.. కాకపోతే .. ధాన్యలక్ష్మి ప్రవర్తన ప్రమాదకరంగా మారుతోందని.. ఇలా మారితే... ఆమె త్వరలోనే ఇల్లు ముక్కలు కాయడం అని అంటుంది.
ఇక కమింగప్ లో.. కావ్య వాళ్ల బావతో ఫైర్ క్యాంప్ దగ్గర ఆడుకుంటూ ఉంటే.. కావ్య కాలు కాలబోతుందని.. రాజ్ కంగారుపడతాడు. ఈ క్రమంలో రాజ్ చేతికి, వాళ్ల బావ కాలికి కాలుతుంది. అయితే.. వాళ్ల బావను పట్టించుకోకుండా.. కావ్య రాజ్ కోసం తాపత్రయపడుతుంది.