Brahmamudi
BrahmaMudi 2nd march Episode: కావ్య తన పుట్టింటికి వెళ్లాలి అని రాజ్ ని అడుగుతుంది. రాజ్.. సంతోషంగా వెళ్లి రమ్మని చెబుతాడు. వెంటనే తన బావ కూడా వస్తున్నాడని.. వాళ్ల బావ అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి మా ఇంటికి రాలేదని.. మా అమ్మ తీసుకురమ్మంది అని కావ్య చెబుతుంది. ఆ మాట విని రాజ్ షాకౌతాడు. వీళ్లిద్దరినీ విడదీయాలి అనుకుంటే.. ఇలా జరిగింది ఏంటా అనుకుంటారు. కావ్య, భాస్కర్ లు బట్టలు సర్దుకోవడానికి వెళతారు. ఎలాగైనా తాను కూడా అక్కడికి వెళ్లాలి అని రాజ్ నిర్ణయించుకుంటాడు. అయితే.. కావ్య, భాస్కర్ లు వెళ్లి.. ఏ కారణంతో ఆయన మాతో వస్తాను అంటారో అర్థం కావడం లేదని చెబుతారు. ఆ సంగతి నేను చూసుకుంటాను అని ఇందిరా దేవి చెబుతుంది.
Brahmamudi
రాజ్ తన బెడ్రూమ్ లోకి వెళ్లి జట్టుపీక్కుంటూ ఉంటాడు. కళావతిని ఇంటికి పిలిచి, ఆ బావను కూడా పిలిచారు.. కానీ నన్ను మాత్రం పిలవలేదు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. కావాలనే రాజ్ ని ఏడిపించాలని కాసేపు వేరేవాళ్ల సంగతి మాట్లాడుతుంది. తర్వాత...కళావతి వాళ్ల బావతో కలిసి పుట్టింటికి వెళ్తోందని.. తనను మాబత్రం పిలవలేదు అని రాజ్ చెబుతాడు. దీంతో.. ఇందిరాదేవి కనకం కి ఫోన్ చేసి.. మీ కూతురిని, మేనల్లుడిని పిలుచుకొని.. అల్లుడిని పిలవరా అని సీరియస్ అవుతుంది. రాజ్ కి ఫోన్ ఇచ్చి పిలవమని చెబుతుంది,
Brahmamudi
దానికి కనకం.. మీరు మా ఇంటికి రావడానికి ఇష్టపడరు కదా.. అందుకే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పిలవలేదు అని చెబుతుంది. మీరు వస్తే అంతకంటే భాగ్యమా రండి అల్లుడు గారు అని చెబుతుంది. ఇలా ఫోన్ చేసి అడిగితే పిలుస్తారా..? ఏం అవసరం లేదు నేను రాను అని రాజ్ అంటే.. మీకు అంత ఇబ్బందిగా ఉంటే రాకండి అని కనకం అంటుంది. ఆ ఆన్సర్ ఊహించని రాజ్ షాకౌతాడు. పిలవకుండా ఫోన్ పెట్టేశారు అని చెబుతాడు. రాను అంటే ఎలా పిలుస్తారు.. మీరు ఎప్పుడు వచ్చినా గడపదాకే వస్తారు కదా అని కావ్య అంటుంది. తాను రాను అనే అంటానని... కానీ వాళ్లు బతిమిలాడాలి అని రాజ్ అంటాడు. అంత ఓపిక మా వాళ్లకు లేదు అని కావ్య అంటుంది.
Brahmamudi
వెంటనే ఇందిరాదేవి కావ్య అని కోపంగా అరుస్తుంది. నువ్వు పుట్టింటికి వెళ్లాలి అంటే.. అది మా రాజ్ తోనే వెళ్లాలి. నా మాటే శాసనం అంటుంది. మీరు అలా చెప్పాక నేను ఎందుకు కాదు అంటాను అమ్మమ్మగారు.. మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి.. నేను మీ బ్యాగ్ కూడా సర్దుతాను అని కావ్య అంటుంది. సరే.. సాధించాను అనుకొని రాజ్ అక్కడి నుంచి వెళతాడు. తమ ప్లాన్ సక్సెస్ అని కావ్య, ఇందిరాదేవిలు సంబరపడతారు. నాకోసం మీరు చాలా చేస్తున్నారు అమ్మమ్మ అని కావ్య అంటే.. వాడు మారి వస్తే చాలు అని ఆవిడ అంటుంది.
Brahmamudi
ఇక.. కనకం ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. రాజ్ వెళ్లి కారు ఎక్కుతాడు. రాజ్ లేని సమయంలో అక్కడ అందరూ పర్ఫార్మెన్స్ అదరగొట్టి.. తిరిగి వచ్చే సమాయనికి కావ్యతోనే జీవితాంతం ఉంటాను అని చెప్పాలి అని ఇందిరాదేవి అంటుంది. కావ్య, భాస్కర్ సరే అంటారు. ఇక రాజ్ డ్రైవర్ సీటులో కూర్చుంటే.. భాస్కర్, కావ్య వెనక కూర్చుంటారు. అది చూసి రాజ్.. నేను ఏమైనా డ్రైవర్ అనుకుంటున్నారా అని అడుగుతాడు. అయితే.. భాస్కర్ తానే డ్రైవింగ్ చేస్తానని ముందుకు వస్తాడు. ఈలోగా కావ్య వెళ్లి వాళ్ల బావ పక్కన కూర్చుుంటుంది. చేసేది లేక రాజ్ వెనక సీటులో కూర్చుంటాడు.
Brahmamudi
ఇక.. కావ్య, వాళ్ల బావ తమ చిన్ననాటి స్మృుతులు అంటూ ఏదేదో సోది మాట్లాడుతుంటే రాజ్ ఫ్రస్టేట్ అవుతాడు. పాటలు పెట్టమని అడుగుతాడు. ఆ పాటలు కూడా వాళ్లకు సెట్ అయ్యేవి రావడంతో రాజ్ కి మరింత చిరాకు వస్తుంది.
Brahmamudi
ఇక.. రాజ్ వస్తున్నాడని, అతని ముందు ఎలా నటించాలో అర్థం కావడం లేదని కనకం కంగారుపడుతూ ఉంటుంది. నీకు నటన రాదు అంటే ఎవరూ నమ్మరని.. నటన ఇరగదీయమని ఇందిరాదేవి చెబుతుంది.
Brahmamudi
ఈలోగా రాజ్, కావ్యలు రావడంతో.. హారతి ప్లేట్ తో కనకం పరుగులు తీస్తుంది. ఇక అక్కడ నుంచి రాజ్ ని ఆడుకోవడం మొదలుపెడతారు. అల్లుడు అని భాస్కర్ ని పిలిచిన ప్రతిసారీ.. రాజ్ కంగారుపడి.. అల్లుడు కాదు.. మేనల్లుడు అని నొక్కి నొక్కి చెప్పడం చాలా ఫన్నీగా ఉంటుంది. కక్కలేక, మింగలేక రాజ్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రేక్షకులకు మాత్రం ఈ సీన్స్ బాగా అలరిస్తాయి. ఇక్కడితో ఎపిసోడ ముగుస్తుంది.
కమింగప్ లో.. కావ్యను వాళ్ల బావ పెళ్లి చేసుకోవడానికే వచ్చాడేమో.. కావ్య నీకు కావాలి అంటే ఈ విషయం తెలుసుకో అని శ్వేత చెబుతుంది. రాజ్ అదేపనిలో ఉంటాడు.