Guppedantha Manasu 29th February Episode:3నెలలో రిషిని తీసుకువస్తానన్న వసు, వెంట్రుక పీకి చేతిలో పెట్టిన మను..

First Published | Feb 29, 2024, 7:12 AM IST

పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు అని ఫణీంద్ర చెబుతాడు. అయితే.. వయసు పెరగగానే పెద్దవాళ్లు అవ్వరని, బుద్ధి కూడా పెరగాలి అని వసు సెటైర్ వేస్తుంది.
 

Guppedantha Manasu

Guppedantha Manasu 29th February Episode: వసుధారకు తెలీకుండా రిషికి కర్మకాండలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. శైలేంద్ర ప్లాన్ తెలుసుకోవడానికి వసు చాలా ప్రయత్నిస్తుంది కానీ. తెలుసుకోలేకపోతుంది. దీంతో.. మను వచ్చి వసుకి విషయం తెలియజేస్తాడు. లైవ్ లో అక్కడ జరిగేది చూపించడంతో వసు నమ్మి.. మనుతో కలిసి కర్మకాండలు జరిగే ప్లేస్ కి వస్తుంది. రావడం రావడమే..  రిషి ఫోటో పక్కన తన ఫోటో కూడా పెడుతుంది. అది చూసి అందరూ షాకౌతారు. అమ్మా.. వసుధార అంటూ మహేంద్ర ఆగిపోతాడు. 

నేను కూడా చనిపోయాను మామయ్య.. నాకు కూడా కర్మకాండ చేయండి.. రిషి సర్ చనిపోయారు అంటే నేను కూడా చనిపోయినట్లే, మీరు నా నమ్మకాన్ని చెరిపేసారంటే నేను చచ్చిపోయినట్లే.. తండ్రి లాంటి మామయ్య కూడా నన్ను మోసం చేశారంటే నేను చనిపోయినట్లే.. ఈ వసుధార బతుకు ఎందుకు.. నాకు కూడా కర్మకాండ జరిపించండి.. ప్లీజ్ మామయ్య.. నేను కూడా చచ్చిపోయాను.. ఇది వట్టి దేహం మాత్రమే.. అని వసు బాధగా ఉంటుంది.
 

Guppedantha Manasu

ఎవరు ఏం చెప్పినా వినిపించుకోదు. ఇక దేవయాణి మధ్యలో కలగజేసుకొని..ఆచారాల ప్రకారం చేస్తుంటే.. ఏదో నేరాలు ఘోరాలు చేసినట్లు మాట్లాడతావేంటి అని సీరియస్ అవుతుంది. ఆమెను వసు ఆపమంటుంది. కానీ దేవయాణి ఆగదు.. నీకు మాత్రమే బాధ ఉన్నట్లు మాట్లాడుతున్నావ్.. నేను చిన్నప్పటి నుంచి రిషిని పెంచాను నాకంటే ఎక్కువ బాధ ఉంటుందా నీకు? వాళ్ల నాన్న, పెదనాన్నల కన్నా ఎక్కువ బాధ ఉంటుందా అని అడుగుతుంది. ఆమెను వసు మరోసారి సీరియస్ అవుతుంది. ఇంకొక్క మాట మాట్లాడొద్దు అని చెబుతుంది. అయితే.. పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు అని ఫణీంద్ర చెబుతాడు. అయితే.. వయసు పెరగగానే పెద్దవాళ్లు అవ్వరని, బుద్ధి కూడా పెరగాలి అని వసు సెటైర్ వేస్తుంది.

అయితే.. ఈ విషయంలో మహేంద్ర తప్పేం లేదని.. తానే అన్నీ చేశానని, నీకు తెలిస్తే నువ్వు అడ్డుకుంటావని, బాధపడతావని చెప్పలేదని ఫణీంద్ర అంటాడు. దీంతో.. వసుధార.. తాను రిషి సర్ బతికే ఉన్నారని నమ్ముతున్నానని.. తన నమ్మకాన్ని ఎలా వమ్ము చేస్తారు అని అడుగుతుంది. నాకంటే రిషి సర్ అంటే ఎక్కువ ఇష్టం అన్నారు కదా.. మీరు ఎలా నమ్ముతున్నారు అని వసు అడుగుతుంది. ఎలా నమ్మేదేంటి.. రిపోర్ట్స్ లో తెలిసింది కదా అని శైలేంద్ర అంటాడు. ఫణీంద్ర కూడా అదే అంటాడు. అయితే.. వాళ్లు చెప్పింది మీరు ఎలా నమ్ముతారు అని వసు ప్రశ్నిస్తుంది. తన మనసుకు తెలుసు అని, రిషి సర్ బతికే ఉన్నారు అని, ఆయన లేకపోతే తాను ఉండను అని గట్టిగా చెబుతుంది.
 


Guppedantha Manasu

ధరని కూడా వసుకి సపోర్ట్ గా నిలుస్తుంది. వసు అంత నమ్మకంగా ఉన్నప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని ధరణి అంటుంది. వెంటనే శైలేంద్ర.... ధరని పై సీరియస్ అవుతాడు. నీకేం తెలుసు నోరు మూసుకో అంటాడు. ఇక మన హీరో మను గారు తన ఒపీనియన్ చెబుతాడు. ‘ సర్.. ఇది మీ అందరికీ ఎమోషన్స్ కి సంబంధించిన విషయం ఒప్పుకుంటాను. కానీ, కేవలం రిపోర్ట్స్ చూసి మీరు రిషి సర్ చనిపోయారు అనుకుంటున్నారు. కానీ ఆయన చనిపోవడం ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదు కదా,కనీసం డెడ్ బాడీ కూడా చూడలేదు కదా, ఏదో గుర్తు తెలియని శవాన్ని చూసి సర్ చనిపోయారు అనుకుంటున్నారు కదా, లేదు ఫ్యూచర్ లో ఇవన్నీ అబద్ధం అని తెలిస్తే, రిషి సర్ బతికి వస్తే.. మీరు కర్మకాండ చేశారని తెలిస్తే.. ఎంత బాధపడతారు. వసుధార చెబుతున్నా కూడా మీరు ఇవన్నీ ఎందుకు చేశారు అని రిషి సర్ అడిగితే.. మీరు ఆయనకు ఏం సమాధానం చెబుతారు. ఒకసారి ఆలోచించండి. కొన్ని కొన్ని సార్లు మన నమ్మకాలు నిజం కాదు అని తేలుతుంది. రిషి సర్ నిజంగానే బతికి ఉన్నారేమో? వసుధార మేడమ్ నమ్మకాన్ని గౌరవించి, ఇవన్నీ చేయకపోతే ఏమౌతుంది?’ అని మను అడుగుతాడు.
 

Guppedantha Manasu

మను లాజిక్స్ కి శైలేంద్రకు మతి పోతుంది. వీడెవడురా బాబు.. ఇన్ని లాజిక్స్ మాట్లాడుతున్నాడు అని మనసులోనే అనుకుంటాడు. దేవయాణి మాత్రం బయటకే అడిగేస్తుంది. అందరూ చనిపోయినవాళ్లు కర్మకాండలు ఎందుకు చేస్తారు అని అడుగుతుంది. మన ఆచారాల ప్రకారం చేయాలని, లేకపోతే మా ఇంటికి కీడు జరుగుతుందనది, ఇప్పటికే అష్ట దరిధ్రాలన్నీ తమ ఇంటికే పట్టినట్లు రోజుకో కష్టం వచ్చేస్తోందని, నష్టాలు వస్తాయని, ఇప్పుడు ఇది కూడా జరిపించకపోతే ఎంత అరిష్టం... రిషి ఆత్మ శాంతిస్తుందా అని దేవయాణి అడుగుతుంది.

మనుషులు పుట్టిన తర్వాత ఆచారాలు పుట్టాయని, మీరు నమ్ముతున్న ఆచారాలు ఒక నమ్మకమే అని, రిషి సర్ బతికే ఉన్నారు అనేది కూడా తన నమ్మకమే అని.. మీరు నా నమ్మకాన్ని ఎందుకు గౌరవించడం లేదు, నా నమ్మకాన్ని ఎందుకు నమ్మడం లేదు అని వసు అడుగుతుంది.  దేవయాణి మాత్రం వినిపించుకోదు. ఈ కార్యక్రమం మధ్యలో ఆపకూడదని, చేయాల్సిందే అని పట్టుపడుతుంది. అయితే.. వసు మాత్రం తనకు కొంత సమయం ఇస్తే.. రిషి సర్ బతికే ఉన్నారని నిరూపిస్తానని, నిరూపించడం కాదు.. రిషి సర్ ని తీసుకువచ్చి చూపిస్తాను అని అడుగుతుంది.
 

Guppedantha Manasu

ఎంత టైమ్ కావాలి? సంవత్సరం, రెండు సంవత్సరాలు సరిపోతాయా అని శైలేంద్ర అడుగుతాడు. అయితే.. కేవలం మూడు నెలలు చాలు అని  వసు అంటుంది. తనకు మూడు నెలలు టైమ్ ఇస్తే.. ఈ భూమి మీద రిషి సర్ ఏ మూల ఉన్నా నేను తీసుకువస్తాను అని  వసు చెబుతుంది. వాడు రారు అని శైలేంద్ర కోపంగా అంటే.. ఫణీంద్ర లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. వసు తీసుకువస్తాను అంటే.. ముందే రాడు అని ఎలా చెబుతావ్.. ఎందుకు కీడు మాట్లాడుతున్నావ్ అని కొడుకును తిడతాడు. 

‘రిషి చనిపోయాడని మనం అనుకుంటున్నాం కానీ.. వసుధార బలంగా నమ్ముతుంది కదా.. వసు మాటలు నమ్మాలనిపిస్తోందని, తన మాటలు నిజమై.. రిషి తిరిగి వస్తే అంతకన్నా సంతోషం మరోటి ఉండదు.. నిజంగానే రిషి తిరిగి వస్తాడని అనిపిస్తోందని ఫణీంద్ర అంటాడు. రిషి లేడు కదా డాడ్ అని శైలేంద్ర.. అంటే.. అసలు ఈ కార్యక్రమం ఐడియా ఇచ్చింది నువ్వే కదరా, అప్పుడు నువ్వు చెప్పింది నిజమనిపించింది జరిపించాలని అనుకున్నాను. ఇప్పుడు వసు చెప్పిందే నమ్మాలనిపిస్తోంది. నువ్వు కూడా వసుధార మాట నమ్ము. దేవయాణి నువ్వు కూడా ఇదే నమ్మాలి.. మీరే కాదు అందరూ నమ్మాలి. అందరూ నమ్మితీరాల్సిందే. వసుధార మాటలు అందరూ నమ్మితీరాల్సిందే. సతీ సావిత్రి యముడితో పోరాడి భర్తను కాపాడుకుంది. ఆ పట్టుదల ఇప్పుడు వసుధారలో కనపడుతోంది. నిజంగానే రిషి ని తీసుకువస్తుందని అనిపిస్తుంది’ అని ఫణీంద్ర నిర్ణయం తీసుకుంటాడు, ఈ కార్యక్రమం ఆపేసి పంతులు గారుని వెళ్లిపోమ్మని ఫణీంద్ర అంటాడు. 
 

Guppedantha Manasu

ఇలా కార్యక్రమం మధ్యలో ఆపేస్తే అరిష్టం జరుగుతుందని దేవయాణి అంటే.. ఆమెను కూడా ఫణీంద్ర తిడతాడు. అరిష్టం గురించి పంతులు ని అడిగితే.. శాంతి పూజ చేయిస్తే సరిపోతుందని ఆయన చెబుతాడు. దీంతో పంతులు వెళ్లిపోతాడు. తన ప్లాన్ ప్లాప్ అయ్యిందని శైలేంద్ర ఫీలౌతాడు. తర్వాత.. మహేంద్రకు ఫనీంద్ర సారీ చెబుతాడు. వసుకి ఫుల్ సపోర్ట్ చేస్తాడు. నువ్వు రిషిని తీసుకొని రామ్మా అంటాడు. దానికి వసు.. మూడు నెలల్లో తీసుకువస్తాను అని, కానీ మీరందరు కూడా రిషి వస్తాడనే నమ్మకంతో ఉండమని  అడుగుతుంది. దానికి ఫనీంద్ర సరే అంటాడు. తర్వాత.. మనుకి ఫణీంద్ర థ్యాంక్స్ చెబుతాడు.
 

Guppedantha Manasu

అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. శైలేంద్ర, దేవయాణి అక్కడే ఉండిపోతారు. శైలేంద్ర ఫుల్ ఫ్రస్టేట్ అవుతాడు. మను గాడు ఎలా వచ్చాడు మమ్మీ అని అడుగుతాడు. వసు ఫోటో ఎత్తి పడేయబోతుంటే.. ఫనీంద్ర పిలిచి.. ఫోటోలు తీసుకొని రమ్మని చెబుతాడు. చేసేది లేక.. ఫోటోలు జాగ్రత్తగా పట్టుకొని వస్తాడు. వచ్చే దారిలో మనుని కదిలిస్తాడు.
 

Guppedantha Manasu

నా ఫ్యామిలీ విషయంలో  నీ జోక్యం ఎక్కువ అయ్యిందని.. ఇక నుంచి వాటిని ఆపేయాలి అని  శైలేంద్ర.. మనుకి వార్నింగ్ ఇస్తాడు. దూరంగా ఉండకపోతే బొంద పెట్టేస్తాను అని శైలేంద్ర అంటే.. మను వెంట్రుక పీకి.. శైలేంద్ర చేతిలో పెడతాడు. నాతో పెట్టుకుంటే తట్టుకోలేవ్ అని శైలేంద్ర వార్నింగ్ ఇచ్చినా.. మను లెక్కలో కూడా వేసుకోడు. మాటలతో చెబితే నువ్వు వినే రకం కాదని... నీ చావు నా చేతిలో అని శైలేంద్ర అంటాడు. రిషికి పట్టిన గతే నీకు పడుతుందని ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు. మను మాత్రం సింపుల్ గా తిప్పి కొడతాడు. నిజంగానే నువ్వు ఎంత వెదవవో నాకు తెలీదని, తెలిస్తే నా ట్రీట్మెంట్ మరోలా ఉండేదని, గతంలో నువ్వు ఎన్ని వెదవ వేషాలు వేశావో తనకు తెలీదని, అప్పుడు తాను లేనని.. ఇప్పుడు వచ్చానని. తన ముందు ఈ వేషాలు పనికి రావు అని చెప్పేసి కారు ఎక్కేస్తాడు. చూసుకుందాం అని శైలేంద్ర అంటే.. డైలాగులు కొట్టడం కూడా తనకు నచ్చదని మను చెబుతాడు. తర్వాత వెళ్లిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
 

Latest Videos

click me!