Gunde Ninda Gudi Gantalu : పెళ్లికి ముందే తల్లి అయ్యావా? పాపం దాచి నా ఇంట్లో అడుగుపెట్టావా? రోహిణీని నిలదీసిన ప్రభావతి

Published : Jan 21, 2026, 08:54 AM IST

Gunde Ninda Gudi Gantalu : రోహిణీ దాచి పెడుతున్న నిజం నెమ్మదిగా బయటపడుతోంది. రోహిణీకి పెళ్లికి ముందే బిడ్డ ఉన్న సంగతి మీనాకు తెలిసిపోయింది. మరి, నేటి ఎపిసోడ్ లో మీనా ఏం చేస్తుందో టీవీ కంటే ముందుగా.. 

PREV
15
Gunde Ninda Gudi Gantalu

మీనా హాస్పిటల్ నుంచి పరధ్యానంగా ఇంటికి వస్తుంది. ఇల్లు కూడా దాటి వెళ్లిపోతుంటే బాలు పిలవడంతో మళ్లీ ఇంటికి వస్తుంది. సరిగ్గా అప్పుడే.. బాలుకి ఫోన్ వస్తుంది. ఓ మహిళకు డెలివరీ నొప్పులు వస్తున్నాయని వెళ్లాలని అర్జెంట్ కాల్ వస్తుంది. అయితే.. మీనా.. రోహిణీ గురించి చెప్పకుండా ఏదేదో మాట్లాడుతుంది.ఫస్ట్ డెలివరీ నా, సెకండ్ డెలివరీనా..? అంటే కడుపు ఉన్నట్లే కదా అని అర్థం లేకుండా మాట్లాడుతుంది. బాలు అర్జెంట్ పనిమీద వెళ్లిపోతాడు. మీనాను ఇంట్లోకి వెళ్లమని చెబుతాడు.

మీనా ఇంట్లోకి వెళ్తుంటే ప్రభావతి చూసి పిలుస్తుంది. ‘ మీరు బయటకు వెళ్లారు కదా ఎప్పుడొచ్చారు?’ అని మీనా అడిగితే.. ‘ అర్జెంట్ పని ఉండి అంబులెన్స్ లో వచ్చాను ’ అని ప్రభావతి వెటకారంగా బదులిస్తుంది.‘ అంబులెన్సా.. హాస్పిటల్ కి వెళ్లారా? రెండోసారి అని కూడా తెలిసిందా?’ అని మీనా అడిగితే.. ‘ ఏమైందే నీకు.. ఎండదెబ్బ తగిలిందా? ఏదోదో మాట్లాడుతున్నావ్..? ఇంట్లో ఉన్న నన్ను పట్టుకొని బయటకు వెళ్లారా అని అడుగుతావ్ .. నేను ఎందుకు బయటకు వెళతాను.. నువ్వేగా ఊరంతా తిరిగొచ్చేది’ అని ప్రభావతి అంటుంది. ‘ పూలు ఇవ్వడానికి వెళ్లాను అత్తయ్య’ అని మీనా చెబితే.. ‘ ఇదో వంక దొరికింది నీకు... నడుచుకుంటూ కాదు కదా నువ్వు వెళ్లేది..బండి మీదే కదా తిరిగేది.. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి.. వెళ్లి టీ పెట్టు’ అని ఆర్డర్ వేస్తుంది. అయితే.. మీనా టీ కాకుండా టీవీ పెడుతుంది. అందులో.. ఒక అమ్మాయి డెలివరీ నొప్పులు పడుతుంది. దీంతో.. ప్రభావతి మీనా మీద అరుస్తుంది.మీనా మళ్లీ తిక్కతిక్కగా మాట్లాడుతుంది. పని తప్పించుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నావా అని ప్రభావతి తిడుతుంది. మీనా మాత్రం అదే ట్రాన్స్ లో ఉండిపోతుంది.

25
శుభవార్త చెప్పిన రోహిణీ..

ఇక రోహిణీ, మనోజ్ ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. రోహిణీ స్వీట్లు పంచుతుంది. ఏంటి విశేషం అని ప్రభావతి అడిగితే శుభవార్తే అత్తయ్య అని రోహిణీ చెబుతుంది. ఇదంతా దూరం నుంచి చూసిన మీనా‘ నాకెందుకో మొదటిసారి అత్తయ్య అమాయకంగా కనపడుతోంది. మొదటి బిడ్డ గురించి తెలిస్తే అత్తయ్య ఏమైపోతారో..? వాళ్లందరినీ రోహిణీ బకరా చేసేసిందే’ అని మనసులో అనుకుంటుంది. ఈలోగా.. శుభవార్త అంటే రోహిణీ తల్లి కాబోతోందని అనుకొని ప్రభావతి సంబరపడుతుంది.కానీ.. అదేమీ కాదని తుస్సుమనిపిస్తుంది. నిజంగానే బిడ్డ పుడుతుందేమో అని.. అత్తగారు ఆస్తి రాసి ఇస్తుందేమో అని ప్రభావతి చాలా ఊహించుకుంటుంది. కానీ రోహిణీ ఆ శుభవార్త కాదు అని చెప్పడంతో ప్రభావతి ఆశలన్నీ నీరుగారిపోతాయి. ఇంతకు మించి శుభవార్త ఏముంటుంది అని నిష్టూరంగా మాట్లాడుతుంది.దీంతో.. మనోజ్ మధ్యలో దూరి.. ‘ నువ్వు ఈ శుభవార్త వింటే చాలా సంతోషిస్తావ్.. ఈ రోజు మన షాప్ లో 15 సింగిల్ కాట్ బెడ్స్ అమ్ముడయ్యాయి.. దాని వల్ల చాలా లాభం వచ్చింది’ అని మనోజ్ చెబుతాడు. మళ్లీ ఎవరినైనా నమ్మి మోసపోలేదు కదా అని ప్రభావతి అంటే.. ‘ లేదు అత్తయ్య..మీ పేరు మీద పెట్టిన షాప్..మంచి సేల్ జరిగితే శుభవార్తే కదా ’ అని రోహిణీ అంటుంది. ‘ ఇప్పటి వరకు నా షాప్ లో ఎక్కువ సేల్ ఈ రోజే జరిగింది. ఇలాంటివి నెలకు రెండు జరిగినా బిజినెస్ బాగా డెవలప్ చేయవచ్చు’ అని మనోజ్ చెబుతాడు.‘ ఏడ్చారులే.. ఇంట్లో చిన్న పిల్లలు తిరిగితే ఆ సంతోషం వేరేలా ఉంటుంది. నువ్వు నెలతప్పావేమో అని ఆశ పడ్డాను’ అని ప్రభావతి అంటుంది. 

35
మీనా చూపులకు భయపడిన రోహిణీ..

అయితే.. మీనా.. దూరం నుంచి చూస్తూ... ‘ ఏంటో మొదటిసారి ఈ లక్షలు మింగిన వాడిని చూసి కూడా జాలి వేస్తోంది’ అని అనుకుంటుంది. ఈ లోగా.. మీనా టీ తెచ్చి ప్రభావతికి ఇస్తుంది. రోహిణీ మాత్రం స్వీట్ తీసుకోమని చెబుతుంది. అయితే.. స్వీట్ తీసుకునేటప్పుడు మీనా చూపు చూపు చూసి రోహిణీ భయపడుతుంది. ‘ మీనా ఇలా చూస్తుందేంటి?’ అనుకుంటుంది.

ఈ లోపు మీనా ఇచ్చిన టీ బాలేదని ప్రభావతి తిడుతూ ఉంటుంది. ఆ మాటలు విని వెళ్లిపోయే వాళ్లు కాస్త మనోజ్, రోహిణీ కిందకు వస్తారు. ‘ మీనాని మా అమ్మ తిడితే భలే బాగుంటుంది’ అని మనోజ్ ఆశగా కిందకు వస్తాడు. తీరా కిందకు వచ్చిన తర్వాత.. టీ అడిగితే కాఫీ ఇచ్చిందని ప్రభావతి రచ్చ చేస్తుంది.కావాలంటే.. టీ టేస్ట్ చూడమని ప్రభావతి అంటే.. ‘ మా అమ్మ ఎంగిలి చేసింది వద్దు’ అని రోహిణీని ఆపుతాడు. ఆ మాటకు ప్రభావతి కి కోపం వచ్చి.. చిన్నప్పుడు మనోజ్ చేసిన పనులు అన్నీ బయటపెడుతుంది. తర్వాత రోహీణీ టేస్ట్ చేసి... ఇది టీ కాదు కాఫీ అని తేల్చి చెబుతుంది. మనోజ్ మాత్రం సమయం సందర్భం లేకుండా.. ‘ గురూజీ చెప్పారు.. నాకు నడిచొచ్చే కొడుకు పుడతాడు’ అని మురిసిపోతూ ఉంటాడు. వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే.. రవి, శ్రుతి వచ్చి.. మీనాని పిలుస్తారు.

45
బాలు చేసిన పనికి సంతోషంలో సత్యం...

‘ మా దగ్గర విషయం ఎందుకు దాచావు?’ అని రవి, శ్రుతి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. అయితే.. బాలు అన్నయ్య ఫోన్ చేయ్యలేదా అని అడుగుతాడు. లేదు అని మీనా అంటుంది. బాలు ఏం చేశాడు అని ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు వేస్తారు. కచ్చితంగా తప్పు చేసి ఉంటాడు అని మనోజ్, రోహిణీ, ప్రభావతి ఫిక్స్ అయ్యి బాలు మీద కౌంటర్లు వేస్తారు. రవి.. బాలుని పొగుడటం మొదలుపెడతాడు..ప్రభావతి కౌంటర్లు వేస్తూ ఉంటుంది. అప్పుడే.. మెడలో దండ వేసుకొని బాలు ఎంట్రీ ఇస్తాడు. తర్వాత బాలు అందరికీ స్వీట్లు తినిపిస్తాడు. రవి, శ్రుతి మాత్రం కంగ్రాట్స్ చెబుతారు.

విషయం ఏంటి అని ప్రభావతి రెట్టించి అడగడంతో.. బాలు విషయం చెబుతాడు. కడుపుతో ఉన్న మహిళకు నొప్పులు ఎక్కువ అయ్యాయని.. హాస్పిటల్ దూరంగా ఉందని.. మార్కెట్ వైపు తిప్పాను అని.. అక్కడ కొందరు స్త్రీలు ఆమెకు పురుడు పోశారు అని బాలు చెబుతాడు. బాలు చేసిన పనికి అందరూ మెచ్చుకున్నారని అసలు విషయం చెబుతాడు. బాలు చేసిన మంచి పనికి సత్యం, మీనా పొంగిపోతారు. ప్రభావతి, మనోజ్ తప్ప.. అందరూ బాలుని పొగుడుతారు. ఆ తర్వాత.. ఊర్లో అందరికీ పిల్లలు పుడుతున్నారని.. మన ఇంట్లో మాత్రం ఆ ధ్యాస ఎవరికీ లేదు అని ప్రభావతి కౌంటర్లు వేస్తుంది.

55
ప్రభావతిని నిలదీసిన రోహిణీ..

కమింగప్ లో.. ప్రభావతికి నిజం తెలిసి... రోహిణీని నిలదీస్తుంది. వీడితో జరిగింది నీకు మొదటి పెళ్లేనా..? పెళ్లికి ముందే నువ్వు తల్లివి అయ్యావా? ఆ పాపాన్ని దాచి నా ఇంట్లో అడుగుపెట్టావా? అని నిలదీస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories