Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ

Published : Mar 05, 2026, 09:45 AM IST

Gunde Ninda Gudi Gantalu: రాజేష్ ఫోన్ చేసి చెప్పడంతో.. చింటూ, సుగుణమ్మను వెతుక్కుంటూ బాలు వింధ్య ఇంటికి వెళతాడు. మరోవైపు గుడిలో మాణిక్యం ప్రభావతికి చిక్కుతాడు. నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం... 

PREV
13
గుండె నిండా గుడి గంటలు..

బాలు వింధ్య ఇంటికి వెళ్లి డోర్ కొడతాడు. ఈ టైమ్ లో ఎవరు తలుపు కొడుతున్నారు అని రోహిణీ కంగారు పడుతుంది. చింటూ వెళ్లి డోర్ తీయబోతుంటాడు. ఈ లోగా రోహిణీకి వింధ్య ఫోన్ చేసి బాలు అటువైపు వచ్చాడు అని చెబుతుంది.చింటూ గురించి, మీ అమ్మ గురించి అడిగాడు.. అనుమానంతో అక్కడికి వస్తాడేమో అని ముందుగానే హెచ్చరిస్తుంది. దీంతో.. అలర్ట్ అయిన రోహిణీ.. చింటూని డోర్ తీయకుండా ఆపుతుంది. బాలు కిటికీలో నుంచి చూస్తాడు. కానీ.. ఆలోపే రోహిణీ చింటూని లోపలికి తీసుకొని వెళ్లిపోతుంది. ఇక.. ఇంట్లో ఎవరూ లేరు అని.. బాలు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇక, గుడిలో రవి, శ్రుతి సరదాగా మాట్లాడుతూ ఉంటే.. రవికి తెలిసిన వ్యక్తి కనిపిస్తాడు. వెళ్లి పలకరిస్తారు. అప్పుడు వాళ్లు తమకు సంతానం కలగడం లేదని.. ముడుపు కట్టడానికి వచ్చాము అని చెబుతారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత.. శ్రుతికి రవి క్లాస్ పీకుతాడు. నువ్వు కూడా పురుటి నొప్పులకు భయపడి పిల్లలు వద్దు అంటున్నావ్.. మనకు కూడా ఫ్యూచర్ లో పిల్లలు ఉండరు అని ఫీల్ అవుతాడు. అయితే.. ఈ విషయంలో తనకు వేరే ప్లాన్స్ ఉన్నాయి అని. శ్రుతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలో అని రవి తలబాదుకుంటాడు.

23
మాణిక్యంకి చుక్కలు చూపించిన బాలు..

ప్రభావతి, సత్యం గుడిలో మాట్లాడుకుంటూ వెళ్తుంటే.. వాళ్లకు మాణిక్యం తగులుతాడు. అతనిని ప్రభావతి, సత్యం గుర్తుపట్టేస్తారు. మరోవైపు బాలు వెళ్లిపోయాడు అని రోహిణీ ఊపిరి పీల్చుకుంటుంది. కానీ.. తనకు ఏ రోజు ప్రశాంతత ఉండటం లేదు అని ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే.. వింధ్య వచ్చి బాలు గురించి అడుగుతుంది. వెళ్లిపోయాడు అని చెబుతుంది. వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా.. రోహిణీకి ప్రభావతి ఫోన్ చేస్తుంది. మీ మలేషియా మామయ్య కనిపించాడు అని చెబుతుంది. ఎలా మేనేజ్ చేయాలా అని రోహిణీ కంగారుగా గుడికి బయలు దేరుతుంది.

ఇక... మాణిక్యం ని ప్రభావతి ఫ్యామిలీ మొత్తం రౌండప్ చేస్తారు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మాణిక్యం దేనికీ సమాధానం చెప్పడు. నోరు తెరిస్తే నిజం చెప్పాలి.. చెబితే రోహిణీ దొరికిపోతుంది.. రోహిణీ కాపురం నాశనం అవుతుంది అని.. మాణిక్యం తనలో తానే భయపడుతూ ఉంటాడు. అప్పుడే.. అక్కడికి బాలు వస్తాడు. దేనికీ సమాధానం చెప్పడం లేదు అని ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. మౌన వ్రతమేమో అని ప్రభావతి అంటుంది. వంక దొరికిందని.. మౌన వ్రతం అని తప్పించుకుంటాడు. దీంతో.. సైగలు చేసి సమాధానాలు చెప్పమని బాలు ఒత్తిడి చేస్తాడు. బాలు ఏం చేసినా మాణిక్యం మాత్రం నోరు విప్పడు. దీంతో.. హారతి పల్లెం తీసుకువచ్చి.. దాని మీద ఒట్టు పెట్టి... ‘ నువ్వు అసలు మలేషియాలో ఉండవు కదా? నువ్వు అసలు పార్లరమ్మ మేనమామ కాదు కదా.. కచ్చితంగా నువ్వు మటన్ కొట్టు నడుపుతున్నావ్ కదా? హారతి ఆర్పి నిజం చెప్పు’ అని బాలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. అప్పుడే రోహిణీ అక్కడికి వస్తుంది. రోహిణీ రావడంతో మాణిక్యం ఊపిరి పీల్చుకుంటాడు.ఇక.. అందరూ రోహణీపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఇంతలో.. మాణిక్యం నోరు తెరిచి ఏమీ మాట్లాడటం లేదు అని మనోజ్ చెబుతాడు. మౌనవ్రతం చేస్తున్నాడు అంట అని సత్యం కూడా చెబుతాడు.

హమ్మయ్య.. నోరు తెరవలేదు కాబట్టి.. ఎన్ని అబద్ధాలు అయినా చెప్పొచ్చు అని రోహిణీ ఫిక్స్ అయిపోతుంది. ఇక.. నోటికి వచ్చింది చెబుతూనే ఉంటుంది. తనకు ఫోన్ చేశాడని.. సంవత్సరానికి ఒక వారం రోజులు మౌన వ్రతంలో ఉంటాడు అని.. తీర్థ యాత్రలు చేస్తూ ఉంటాడు అని కవర్ చేసి.. మాణిక్యం ని తీసుకొని వెళ్లిపోతుంది. రోహిణీ ఆస్తుల గురించి అడగలేకపోయాను అని ప్రభావతి ఫీల్ అవుతుంది. ఇక.. మాణిక్యం ని రోహిణీ పంపించేస్తుంది. బాలు వచ్చి.. అందరూ గుడిలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్లావ్ అని రోహిణీని అడుగుతాడు. వింధ్య దగ్గర వడ్డీ వసూలు చేయడానికి వచ్చాను అని.. వాళ్ల అమ్మకు హెల్త్ బాగోకపోతే మనోజ్ లక్ష వడ్డీకి ఇచ్చాడు అని చెబుతుంది. నిజమే అని బాలు నమ్మేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

33
గుణ కుట్రతో శివకు తిప్పలు..

మరుసటి రోజు బాలు, మీనా వాళ్ల పుట్టింటికి వెళతారు.మీనా డల్ గా ఉండటం చూసి ఏమైందని వాళ్ల చెల్లి అడుగుతుంది. చింటూ వాళ్ల అమ్మమ్మ సుగుణమ్మ అన్న మాటలను చెబుతుంది. అయితే.. మీకు పిల్లలు పుట్టరా? అసలు దత్తత ఎందుకు తీసుకోవాలి అని సీరియస్ అవుతుంది. అప్పుడే.. అక్కడికి శివ వస్తాడు. బాలుని చూసి తల దించకొని వెళ్లిపోతుంటే మీనా ఆపుతుంది. కాలేజీ నుంచి వెనక్కి ఎందుకు వచ్చావ్ అని మీనా అడిగితే.. తనను ఎగ్జామ్స్ రాయనివ్వమని ప్రిన్సిపల్ చెప్పారు అని చెబుతాడు. ఏం జరిగింది అంటే.. కాలేజీలో జరిగిన విషయాన్ని చెబుతాడు. శివ బ్యాగులో మందు బాటిల్ ఉందని.. ప్రిన్సిపల్ కి దొరికిందని.. అందుకే.. పరీక్షలు రాయడానికి ఒప్పుకోలేదని చెబుతాడు. తన తప్పు లేదని.. శివ చెప్పినా ప్రిన్సిపల్ వినిపించుకోడు. అయితే.. ఇదంతా గుణ వేసిన ప్లాన్ కావడం గమనార్హం. ఆ విషయం బాలు పసిగడతాడు. గుణని తన్ని.. నిజం కక్కిస్తానని బాలు వెళతాడు. కానీ.. బాలుకి దొరకకుండా గుణ తప్పించుకుంటాడు.

ఇంట్లో తన తమ్ముడి గురించి మీనా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే.. శ్రుతికి ఒక పార్శిల్ వస్తుంది. దానిని మీనా తీసుకుంటుంటే ప్రభావతి వచ్చి సెటైర్లు వేస్తుంది. పార్శిల్ ప్రభావతి తీసుకొని.. సంతకం మాత్రం మీనా తీసుకున్నట్లు పెట్టిస్తుంది. ఇక.. ఆ పార్శిల్ ప్రభావతి తెరవడానికి ప్రయత్నిస్తుంటే... మీనా ఆపుతుంది. కానీ.. మీనా మాటలు లెక్కచేయకుండా ప్రభావతి తెరవడానికి ప్రయత్నిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories