Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన- పగలబడి నవ్విన పారు-కార్తీక్ ప్రశ్న

Published : Mar 05, 2026, 08:30 AM IST

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 5వ తేదీ)లో కడుపులో బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నారని కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన. నిజం చెప్పబోయిన దశరథ, ఆపిన కార్తీక్. పగలబడి నవ్విన పారు. కార్తీక్, దీపలపై జ్యో డౌట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో ఎక్కడికి బయల్దేరారు చెప్పు కార్తీక్ అని అడుగుతుంది కాంచన. దీప కడుపుతో ఉంది కదా.. కొన్ని రోజులు సరదాగా అలా తిరిగొద్దామని అనుకుంటున్నాము అని చెప్తాడు కార్తీక్. అబద్దం అని గట్టిగా అరుస్తుంది కాంచన. నువ్వు నాతో అబద్దం చెప్తున్నావ్ రా, పారిజాతం పిన్ని నాతో అంతా చెప్పింది అంటుంది కాంచన. లేదమ్మా ఇదే నిజం అంటాడు కార్తీక్. అయితే మాతో అబద్ధం చెప్పావా అంటూ ఎంట్రీ ఇస్తాడు శివన్నారాయణ.

28
దీపను నానామాటలు అన్న కాంచన

మీతో ఏం చెప్పాడు నాన్న అని అడుగుతుంది కాంచన. నా భార్యకు రెస్ట్ కావాలి. నేను తనకు సేవ చేయాలి. కొద్ది రోజులపాటు మేము ఇంట్లోనే ఉంటామని చెప్పాడు అని అందరితో చెప్తాడు శివన్నారాయణ. ఇంటి దగ్గర ఉందామనే లీవ్ తీసుకున్నాం. కానీ కడుపుతో ఉంది కదా తనకి నచ్చిన ప్లేస్ లకి తీసుకెళ్తే సంతోషపడుతుందని ఇలా ప్లాన్ చేశాను అని చెప్తాడు కార్తీక్.

నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు అంటుంది కాంచన. ఎక్కడికో చెప్పు అమ్మ అంటాడు కార్తీక్. నువ్వు దీపను హాస్పిటల్ కు తీసుకెళ్తున్నావు అంటుంది కాంచన. షాక్ అవుతారు దీప, కార్తీక్. నిన్ను అని ఏం లాభం.. నా కొడుకు బిడ్డను కడుపులో మోయడం ఇష్టం లేకనే ఇంత పాపానికి పూనుకున్నావు కదా అని దీపను నానామాటలు అంటుంది కాంచన.

38
అనసూయ ఫైర్

ఎక్కడో అనాథలా బతకాల్సిన నిన్ను చేరదీసి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన వీళ్లకు బిడ్డను ఇవ్వలేవా దీప. చెప్పు దీప చెల్లి మాట్లాడేది నిజం కాదని చెప్పు. నువ్వు అలాంటి దానివి కాదు అని చెప్పు అని అంటుంది అనసూయ. ఒకవేళ నువ్వు నిజంగా బిడ్డను వదులుకోవడానికి సిద్ధమైతే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంది అనసూయ. 

అది మాట్లాడదక్క.. దాని స్వార్థం కోసం ఏమైనా చేస్తుంది. ఎంతైనా పరాయి మనిషి కదా అంటుంది కాంచన. ఆపు కాంచన. దీపను ఇంకో మాట అనడానికి వీల్లేదు. తన గొప్పతనం తెలియక మీరు తనని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటాడు దశరథ. నువ్వు ఆగు అన్నయ్య అంటుంది కాంచన. తను హాస్పిటల్ కి ఎందుకు వెళ్తుందో నాకు తెలుసు. నిజం నేను చెప్తాను అంటాడు దశరథ.

48
మళ్లీ ప్రేమలో పడ్డాను

మరోవైపు మామయ్య ఎక్కడికి వెళ్లారు అని కావేరిని అడుగుతాడు కాశీ. డ్రైవర్లు ఓనర్ ని సార్ అని పిలవాలి అంటుంది స్వప్న. కాశీ చేతికి కాఫీ ఇచ్చి.. నువ్వు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి అని చెప్తుంది. అల్లుడి గారెని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావే అంటుంది కావేరి. అది నిన్నటి వరకు.. ఇప్పుడు నేను శ్రీధర్ కూతురిని మాత్రమే. ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది అంటుంది స్వప్న. 

నాన్న బయటకు వెళ్లారు. బయట వెయిట్ చెయ్ అని కాశీతో చెప్తుంది. వెయిట్ చేస్తాను. జీవితాంతం వెయిట్ చేస్తాను. విలువైన దాన్ని పొందినప్పుడే కాదు పోగొట్టుకున్నప్పుడే దాని గొప్పతనం తెలుస్తుంది అని వాళ్ల జీవితాన్ని ఉద్దేశించి అంటాడు కాశీ. ఇదేంటి కొత్తగా అంటుంది స్వప్న. నేను మళ్లీ ప్రేమలో పడ్డానని చెప్పి వెళ్లిపోతాడు కాశీ.

58
జ్యో అనుమానం

హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం. నాన్న, తాత కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది జ్యోత్స్న. నీకు ఒక సీక్రెట్ చెప్పలేదు. కానీ కాంచనతో చెప్పాను. నా అంచనా ప్రకారం అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంటుంది అని పగలబడి నవ్వుతుంది పారు. ఏం సీక్రెట్ గ్రానీ అని అడుగుతుంది జ్యోత్స్న.

 దీప, కార్తీక్, మీ నాన్న మాట్లాడుకుంటుంటే విన్నాను. దీప తన కడుపులోని బిడ్డను వదిలించుకోవాలి అనుకుంటోంది అని చెప్తుంది పారు. దీనికి రిపోర్ట్స్ మ్యాచ్ కావడానికి ఏదైనా సంబంధం ఉందా? దీపే వారసురాలి అని వాళ్లకు తెలిసిపోయిందా.. ఈ దాసు వల్ల నా మతి పోయేలా ఉంది అని మనసులో అనుకొని.. నిజాలు తెలుసుకోవడానికి బయల్దేరుతుంది జ్యోత్స్న.

68
దశరథను ఆపిన కార్తీక్

చెప్పు అన్నయ్య దీప హాస్పిటల్ కి ఎందుకు వెళ్తోంది అని దశరథను అడుగుతుంది కాంచన. దీప తన తల్లి కోసం బిడ్డను అని దశరథ చెప్పబోతుంటే అడ్డుపడతాడు కార్తీక్. ఏ అర్హత ఉందని నా భార్య గురించి మాట్లాడుతున్నావ్? అని దశరథ నోరు మూయిస్తాడు కార్తీక్. నా భార్య గురించి మాట్లాడే అర్హత నాకే ఉంది. నేనే సమాధానం చెప్తాను అంటాడు కార్తీక్. నువ్వు అర్హతల గురించి మాట్లాడే స్థాయికి వచ్చావంటే బాగానే ఎదిగిపోయావు అంటాడు శివన్నారాయణ. నీ తల్లిని కన్న తండ్రిగా నేను అడుగుతున్నాను బిడ్డను ఎందుకు వదలుకుంటున్నారో చెప్పండని అంటాడు శివన్నారాయణ.

78
నిన్ను కోడలిగా చూడలేదు

పిల్లలు సంతోషంగా ఉంటేనే తల్లిదండ్రులుగా మేము ప్రశాంతంగా ఉండగలం. ఇప్పటికే మీ చెల్లి జీవితం గురించి బాధపడుతున్నాం. ఇంకా మేము బాధపడే పనులు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు శ్రీధర్. అమ్మా దీప నేను ఏ రోజు నిన్ను కోడలిగా ఒప్పుకోలేదు. నువ్వు నా కొడుకు జీవితంలోకి రావడం నాకు నచ్చేది కాదు. కానీ నా కొడుకు వారసత్వం నీ కడుపులో ఉందని తెలిశాక నిన్ను కోడలిగా అంగీకరించాను. ఇప్పుడు నువ్వు దాన్నే వద్దనుకుంటున్నావు. ఎందుకు అని ప్రశ్నిస్తాడు శ్రీధర్.

88
కార్తీక్ ప్రశ్న..

చెప్పు దీప.. ఎందుకు ఇలా చేస్తున్నారు. నీ భర్తను నువ్వు ఎలాగో మార్చేశావు. వాడు నీ మాటే వింటాడు కాబట్టి ఇప్పుడు నువ్వే మాట్లాడాలి అంటుంది కాంచన. దీప మాట్లాడలేదమ్మా.. తను మాట్లాడలంటే నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటాడు కార్తీక్. ఏంటది అని అడుగుతుంది కాంచన. తల్లి ప్రాణాలు, బిడ్డ ప్రాణాలు ఎవరో ఒకరి ప్రాణాలు వదులుకోవాల్సి వస్తే నువ్వేం చేస్తావు? అని అడుగుతాడు కార్తీక్. సైలెంట్ అవుతుంది కాంచన. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories