
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో ఏరా కార్తీక్ నీ ఫోటో గురించి నిజం చెప్పమంటావా? అంటుంది సుమిత్ర. నేనేదో సరదాగా షేర్ చేస్తే నిజం చెప్తా అంటావేంటి అత్త వద్దు అంటాడు కార్తీక్. నువ్వు ఆగు బావ అని సుమిత్రను నిజం చెప్పమంటుంది దీప. కాంచన వదినకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. కార్తీక్ చిన్నగా ఉన్నప్పుడు తనని ఆడపిల్లలా రెడీ చేసేది. జుట్టు పెంచి జడలు వేసేది. పూలు పెట్టేది. ఒక రోజు కార్తీక్ ని ఆడపిల్లలా రెడీ చేశారు. మా చుట్టాల అబ్బాయి ఒకరు వీడిని చూసి నిజంగా ఆడపిల్లే అనుకొని.. పెద్దయ్యాక నేను తననే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. బుగ్గ మీద ముద్దు కూడా పెట్టుకున్నాడని సుమిత్ర చెప్పడంతో అంతా నవ్వుతారు.
సుమిత్ర నవ్వుతూ దీపతో మాట్లాడుతుంటే కార్తీక్ చూస్తూ ఉంటాడు. అది గమనించిన దశరథ.. కార్తీక్ దగ్గరకు వచ్చి, నువ్వు ఎంత బాధను లోపల పెట్టుకొని పైకి నవ్వుతున్నావో నాకు తెలుసురా అంటాడు. నీ వల్లే సుమిత్ర నవ్వడం చూస్తున్నాను. నాన్న కాసేపు బాధను మర్చిపోవడం చూస్తున్నాను. థాంక్స్ రా కార్తీక్ అంటాడు దశరథ.
మరోవైపు రిపోర్ట్స్ గురించి ఆలోచిస్తూ భయపడుతుంది జ్యోత్స్న. పారు వచ్చి భోజనం చేద్దాం రా అని పిలుస్తుంది. నీకు ఆకలి కూడా తెలుస్తోందా? నాకు అయితే భయమే తెలుస్తోంది అంటుంది జ్యోత్స్న. రిపోర్ట్స్ గురించి భయపడుతున్నావా అంటుంది పారు. రిపోర్ట్స్ అంటే కాగితాలు కాదు మన భవిష్యత్తును నిర్ణయించే నిజాలు అని భయపడుతుంది జ్యోత్స్న. నేను చేసిన పాపాలన్నీ కట్టకట్టుకొని ఒకేసారి ఇంటికి వచ్చేలా ఉన్నాయని కంగారు పడుతుంది పారు. ముందు దాసుగాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అంటుంది.
ఎందుకు అని అడుగుతుంది జ్యోత్స్న. అసలు వారసురాలిని తీసుకురమ్మని చెప్పాలి అంటుంది పారు. నీకు ఎవరిమీదైనా అనుమానంగా ఉందా అని అడుగుతుంది జ్యోత్స్న. నీ మీదే నా అనుమానం అంటుంది పారు. నువ్వు నా దగ్గర కూడా నటిస్తున్నావేమో అనిపిస్తోంది అంటుంది పారు. మన ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికే బావ నీకు అనుమానం వచ్చేలా మాట్లాడి వెళ్లాడు అంటుంది జ్యోత్స్న. రిపోర్ట్స్ వచ్చి నిజం తెలిస్తే తాత ఎవ్వరినీ వదిలిపెట్టడు అంటుంది జ్యోత్స్న. ఇది నేను కష్టపడి కట్టుకున్న కలల కోటనే. దీన్ని అంత ఈజీగా కూలిపోనివ్వను అంటుంది పారు. ఏం చేయాలి అని ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు.
ఈ డబ్బులు అమ్మకు ఇవ్వు అని దీప చేతికి ఇస్తాడు కార్తీక్. ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు? అప్పు చేశావా? అని అడుగుతుంది దీప. ఇప్పటికే మీరు నావల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒకటి చేశానులే అంటాడు కార్తీక్. ఈ విషయం సరే.. మా అమ్మ విషయం ఏం చేశావు. ఈ రోజు అంటే నవ్వించడానికి ఫొటో పంపించావు. మరి నిజం తెలిసినప్పుడు బాధ పడకుండా ఏం చేస్తావు? అని అడుగుతుంది దీప.
నువ్వే తన కూతురువని చెప్పేస్తాను అంటాడు కార్తీక్. వాళ్లు నమ్ముతారా అంటుంది దీప. జ్యోత్స్న శాంపిల్ ఎలాగు అత్తతో మ్యాచ్ కావు. ఆ విషయం డాక్టర్ చెప్పేస్తుంది అని కార్తీక్ అంటుండగా కాంచన వస్తుంది. జ్యోత్స్న శాంపిల్స్ మా వదినతో ఎందుకు మ్యాచ్ కావు అని అడుగుతుంది.
ఏంటి సుమిత్ర ఇది. ఆరోగ్యం గురించి పట్టించుకోవా? అని సుమిత్రను మందలిస్తాడు దశరథ. ఏమైంది దశరథ, కోడలిని ఏమంటున్నావు అని అడుగుతాడు శివన్నారాయణ. సుమిత్ర టాబ్లెట్ వేసుకోలేదు. భోజనం కూడా చేయలేదు. నేను తినేటప్పుడు తినమంటే తర్వాత తింటా అంది. ఇప్పుడేమో తినాలనిపించడం లేదని చెప్తోంది అని తండ్రికి కంప్లెయింట్ ఇస్తాడు దశరథ. నువ్వు అనాల్సింది సుమిత్రను కాదు అని జ్యోత్స్నను గట్టిగా పిలుస్తాడు శివ నారాయణ.
పారు వచ్చి ఏంటండి అని అడుగుతుంది. ఇప్పుడే ఒక విషయం తెలిసింది జ్యోత్స్నను పిలువు అంటాడు శివన్నారాయణ. రిపోర్ట్స్ గురించి తెలిసిందేమో అని వణికిపోతుంది పారు. ఏంటి తాత అనుకుంటూ కిందికి వస్తుంది జ్యోత్స్న. నువ్వు నన్ను తాత అని పిలవాల్సిన అవసరం లేదు. నువ్వు అసలు నా మనుమరాలివే కాదు. సుమిత్ర కూతురివి అంతకంటే కాదు అని జ్యోపై ఫైర్ అవుతాడు శివన్నారాయణ. అదేంటి తాత అలా మాట్లాడుతున్నావు అంటూనే లోలోపల టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. నీకు జ్వరం వస్తే మీ అమ్మ నిన్ను ఎలా చూసుకుంటుంది? నువ్వు కూడా మీ అమ్మను చూసుకోవాలి కదా అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్నను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి గదిలోకి వెళ్తుంది సుమిత్ర.
చూశావా మీ అమ్మను.. నువ్వు ఇబ్బంది పడతావని తనే బాధ పడుతోంది అని జ్యోతో అంటాడు దశరథ. నువ్వంటే అంత ఇష్టం తనకు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పిల్లలు తోడుగా లేకపోతే ఇంకెందుకు అమ్మ పిల్లలు. కాస్త అర్థం చేసుకో అమ్మా. ఈ గండం గట్టెక్కేవరకు నీ తోడు, సాయం మీ అమ్మకు అవసరం అని చెప్తాడు దశరథ. సరే డాడీ నేను చూస్కుంటాను అంటుంది జ్యో. పర్లేదు వెళ్లమ్మ అంటాడు దశరథ. సుమిత్రను నువ్వే చూసుకో దశరథ అంటాడు శివన్నారాయణ. పోనీ దీపను ఇక్కడే ఉండమని చెప్తాదా అని అడుగుతాడు. దీప వద్దు కానీ చెల్లిని రమ్మని చెప్తాం నాన్న అంటాడు దశరథ.
జ్యోత్స్న శాంపిల్ సుమిత్రతో ఎందుకు మ్యాచ్ కాదని కార్తీక్ ని నిలదీస్తుంది కాంచన. అంటే జ్యోత్స్న మా అన్నయ్య కూతురు కాదా? అని అడుగుతుంది. లేదమ్మా జ్యోత్స్న, పారు హాస్పిటల్ కి వచ్చినప్పుడు చాలా భయపడ్డారు. అదే విషయాన్ని దీపతో చెప్తున్నాను అని కవర్ చేస్తాడు కార్తీక్. దానికి చిన్నప్పటి నుంచి హాస్పిటల్ అంటే భయం లేరా అంటుంది కాంచన. ఇంతలో శివన్నారాయణ కార్తీక్ కి ఫోన్ చేస్తాడు. ఏంటి తాత ఈ టైంలో ఫోన్ చేశావు అంటే.. సిటీ మొత్తం కారులో తిరగాలని ఉందిరా వస్తావా అని అడుగుతాడు శివన్నారాయణ. నువ్వు ఇంకా అత్త ఆరోగ్యం గురించి ఆలోచిస్తూనే ఉన్నావా.. అత్తకు ఏం కాదు తాత అంటాడు కార్తీక్.
అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు కార్తీక్ అంటాడు శివన్నారాయణ. కూతురిని ఇంటికి రమ్మని అడుగుతాడు. సుమిత్రకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు వస్తే తను అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటుందని చెప్తాడు శివన్నారాయణ. కాంచన ఆలోచిస్తూ ఉండగా ఫోన్ తీసుకొని అమ్మ తప్పకుండా వస్తుంది అని చెప్తాడు కార్తీక్.
నేను వస్తానని నీతో చెప్పానా? నేను రాలేను అని చెప్పి గదిలోకి వెళ్తుంది కాంచన. అత్తను ఇబ్బంది పెట్టకు బావ అంటుంది దీప. అమ్మ వస్తే అత్త హ్యాపీగా ఉంటుందని వాళ్లు ఫీల్ అవుతున్నారు. కానీ అనారోగ్యంతో ఉన్న అత్తను చూసి తట్టుకోలేనని అమ్మ భయపడుతోంది అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.