దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ దంపతులు తమ ఏడాది కూతురు దువా పదుకొణె సింగ్ ముఖాన్ని మొదటిసారి చూపించారు. దివాళి సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో గారాల కూతురు ఫోటోలు షేర్ చేశారు.
రణ్‌వీర్-దీపికా కూతురు దువా పుట్టి ఏడాది పూర్తి అయ్యింది. దువా సెప్టెంబర్ 8, 2024న పుట్టింది. పాప పుట్టిన ఏడాది తరువాత.. దీపావళి సందర్భంగా మొదటిసారి కూతురి ముఖం చూపించారు స్టార్ కపుల్. దువా చాలా అల్లరి పిల్లలా కనిపిస్తోంది. ఫోటోలలో నవ్వుతూ, వేలు నోట్లో పెట్టుకుని కనిపించింది.
24
ఏడాది పాటు ఎదురు చూసిన ఫ్యాన్స్
దువా ఎర్రటి ఫ్రాక్‌లో ఉంది. దీపిక కూడా కూతురికి మ్యాచింగ్‌గా అదే రంగు హెవీ జరీ వర్క్ చీర కట్టుకుంది. దువా ముఖం చూడటం కోసం ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా దీపికా కూతురును చూడటానికి వెయిట్ చేశారు. ఎట్టకేలకు దువా సోషల్ మీడియాలో సందడి చేయడం స్టార్ట్ చేసింది.
34
దీపిక ఒడిలో కూర్చుని
ఈ ఫోటోలో దువా తల్లి దీపిక ఒడిలో కూర్చుని చేతులు జోడించి దీపావళి పూజ చేస్తోంది. దీపికా దంపతులు షేర్ చేసిన ఈ ఫోటోలకు భారీగా రెస్పాన్స్ కూడా వస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సోనమ్ కపూర్, భారతీ సింగ్, రకుల్ ప్రీత్, భూమి పెడ్నేకర్, శ్రేయా ఘోషల్, అనన్య పాండే, కరణ్ జోహార్ వంటి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వీరిని విష్ చేశారు.
దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ఇద్దరూ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు. రణ్‌వీర్ ఒక భారీ యాడ్ ఫిల్మ్‌లో నటించగా , దీపిక 800 కోట్ల బడ్జెట్ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా నటిస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా ఈసినిమా తెరకెక్కుతోంది. కాగా రీసెంట్ గా కల్కీ పార్ట్ 2 మూవీ నుంచి దీపికా పదుకొనే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. 8 గంటల వర్క్ విషయంలో దీపికా ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.